డైలీ సీరియల్

బడబాగ్ని-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

..యింతలోనే అరుణ్ నుంచి ఫోన్.. ట్రైనింగ్ సెంటర్‌లో సాహూ సర్ పెట్టిన సెలవులతో ఆ మర్డర్స్ జరిగిన తారీఖులు సరిపోయాయని, కానీ ఎంత ప్రయత్నించినా ఆయన మెయిల్ ఐ.డి మాత్రం దొరకలేదనీ..
రాహుల్ వెంటనే అడిగాడు సాహూ పూర్తి పేరేమిటని?
దానికి బదులుగా అజిత్ పది నిమిషాల్లో బయట పబ్లిక్ కాల్ ఆఫీస్ నుంచి తమ ట్రైనింగ్ సెంటర్‌కి ఫోన్ చేసి.. రవీంద్ర సాహు కావాలని అడగటంతో.. ఆయన క్లాస్‌లో వున్నారనీ.. అరగంట తర్వాత కాల్ చెయ్యమన్న జవాబుతో తాము వెదుకుతున్న హంతకుడు అతనే అని నిర్థారించుకున్నారు.. అజిత్.. రాహుల్‌లు..
మర్నాడు ఆదివారం.. ఉదయానే్న లేచి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు యిద్దరూ.
‘‘ఎస్.. అట్ లాస్ట్ వియ్ బ్రేక్ ద సైలెన్స్.. కానీ యిప్పుడు మనం తొందరపడకూడదు.. మనం ‘హత్యానేరం మోపుతున్నది ఒక సామాన్య వ్యక్తిపై కాదు, ఒక సీనియర్ ఐపిఎస్ అధికారి’పై.
సో.. ఇది బేక్‌ఫైర్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా డీల్ చెయ్యాలి.. ఇక నేను ఏ ఎంక్వయిరీ చెయ్యక్కరలేదు.. దీనిని ప్రూవ్ చేస్తే చాలు.. సో దీనికి సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలు సేకరించాలి.. మనం లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలి. దానికి మంచి సమర్థుడైన లాయర్ ఎంచుకోవడం ముఖ్యం. అజిత్ నువ్వు తొందరపడి అప్పుడే ఎవరి దగ్గరా అనకు, నేను మళ్లీ డెహ్రాడూన్ వెళ్లిపోతాను, ఒకసారి లాయర్ భగవాన్‌ని కలిసి అతనిని స్టడీ చేసి, మంచివాడు అనుకుంటే అతని ద్వారా ఈ కేస్ మళ్లీ కోర్టులో వేద్దాం..’’ రాహుల్ క్షణాల్లో నిర్ణయం తీసుకున్నాడు.
ఈ విషయం అనే్వష్, అరుణ్‌లకు తెలియజేశారు. అయితే వాళ్ళను ఎక్కడా బయటపడద్దనీ, ఏ మాత్రం అతను పసికట్టినా ప్రమాదమే కాక అతను జాగ్రత్తపడే అవకాశం కూడా వుందనీ, ఇంక ఆ విషయం తను డీల్ చేస్తాననీ, మంచి లాయర్‌తో సంప్రదించి లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే విధంగా చూస్తాననీ చెప్పాడు. వాళ్ళ నలుగురికీ తాము ఆ మిస్టరీని ఛేదించామని ఓ పక్క ఆనందంగా వున్నా, అది ఎంతవరకూ నిలబడి అతను శిక్షించబడతాడు? అన్నది కొంచెం గాభరగా ఉంది.
***
మర్నాడే రాహుల్ మళ్లీ డెహ్రాడూన్ వెళ్లిపోయాడు.. అతను వెడుతూనే, ఇంటికివెళ్లి కాస్త ఫ్రెష్ అయి, శివరావుకి ఫోన్ చేసి తనని ఒకసారి అర్జెంట్‌గా సెంట్రల్ లైబ్రరీ దగ్గర కలవమనీ, చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనీ చెబుతాడు. ఒక గంటలో వస్తాననీ, ఇంతకూ మీరెవరు, ఎక్కడనుంచి మాట్లడుతున్నారు, నాతో ఏం పనీ అని అడిగిన అతనికి, తనని కలిస్తే అన్నీ అతనికే అర్ధం అవుతాయనీ చెప్పి ఫోన్ పెట్టేశాడు.
గంట తరువాత సెంట్రల్ లైబ్రరీ దగ్గర అతనికోసం ఎదురుచూస్తున్న అతనికి ఒకతను వచ్చి అక్కడ తనలాగా ఎదురుచూడడం చూసి, కాల్ చేస్తే తనే శివరావు అని తెలుస్తుంది.
అతనిని మెల్లిగా మాటల్లో పెట్టి అతను సాహు దగ్గర పనిచేసే సార్జంట్ అనీ, సాహు ఆ డబ్బులు తన ఖాతా నుంచి హైదరాబాద్‌లో వున్న అతనికి ఖాతాకి వెయ్యమని చెప్పాడనీ, అప్పుడప్పుడు అలాగే తన ఖాతా నుంచే ఎవరెవరికో డబ్బు పంపుతాడనీ, అది టేక్స్ ప్రాబ్లంతో అలా చెయ్యమని చెబుతాడనీ అతను చెప్పిన మాటలు రాహుల్‌కి బాగా అర్థం అయ్యాయి.
అక్కడినుండి లాయర్ భగవాన్ దగ్గరికి వెళ్లాడు.. ‘‘నమస్తే లాయర్‌గారూ..’’
తన దగ్గరికి వచ్చిన ఆ యువకుడు ఎవరా అని ఒక్క క్షణం పరికించి చూశాడాయన.. ఎక్కడ చూశానబ్బా...
‘‘నమస్తే.. నా పేరు రాహుల్.. అడవిలో హత్య కేసులో మనం..
అతను ఆ వాక్యం పూర్తిచేయకుండానే జ్ఞాపకం వచ్చింది ఆయనకు అతనెరన్నదీ.. అతను తన దగ్గరకెందుకొచ్చాడా అని ఆశ్చర్యపోతూనే...
‘‘ఆ ఆ గుర్తువచ్చారు కూర్చోండి.. కూర్చోండి.. తన ముందు సీట్ చూపించేరు..
‘‘్థంక్స్’’.. కూర్చుంటూ అన్నాడు.
‘‘మీరు యిలా వచ్చారేమిటీ.. ఏదైనా ప్రాబ్లమా..’’ ఆయన కళ్ళలో ఇంకా ఆశ్చర్యం...
‘‘నేను మీతో చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి.. మీరు ఎప్పుడు కలవమంటారో చెబితే...
‘‘ఆయన ఒక్క క్షణం విడ్డూరంగా చూసేడు.. ఒక్క పావు గంట వెయిట్ చెయ్యగలరా, ఈ ఫైల్ చూడటం అయిపోవచ్చింది..’’
‘‘ష్యూర్..’’ లేచాడు.
‘‘మీరు ఆ పక్క గదిలో కూర్చోండి.. జస్ట్ పావుగంట.. వచ్చేస్తా..’’ అంటూ బెల్ కొట్టి ‘‘నారాయణా, సార్‌ని ఆ గదిలో కూర్చోబెట్టి కాఫీ యియ్యి..’’ మళ్లీ తల ఫైల్లో దూర్చేశాడాయన.
ఈయన ఆ కేస్ విషయంలో ఎలా స్పందిస్తాడో తెలియకుండా తన దగ్గర ఉన్న ఆధారాల వివరాలు, సాహుయే అసలు హంతకుడు అన్న విషయం చెప్పదల్చుకోలేదు రాహుల్.
అక్కడ కూర్చుని పక్కన వున్న పేపర్ చేతిలోకి తీసుకున్న అతనికి నారాయణ కాఫీ తెచ్చి ఇచ్చాడు.. తనంటే రుూ పెద్దమనిషికి మంచి అభిప్రాయమే ఉన్నట్లుంది.. నవ్వుకున్నాడు రాహుల్.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్