డైలీ సీరియల్

బడబాగ్ని-49

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే చదువు అయిపోయి జాబ్ వచ్చాక ఇంట్లో వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకుందాం అని చెప్పిన నన్ను ఎంతో యిష్టపడింది.. అమ్మాయిలతో ప్రేమ కబుర్లు చెప్పి, సినిమాలకి షికార్లకీ, పబ్‌లకీ తిప్పే ఈ రోజుల్లో నువ్వు ఇంత చక్కగా, క్లియర్‌గా ప్రపోజ్ చేశావంటే.. అది నా అదృష్టం.. మనం అప్పటివరకూ మంచి స్నేహితులం అంటూ తన స్నేహహస్తం అందించింది. మొదటి యేడు పరీక్షలు అయిపోయి మా స్నేహితులంతా పిక్నిక్‌కి ప్లాన్ చేస్తే.. తన ఇంట్లో ఒప్పుకోకపోయినా నా కోసం, మళ్లీ సెలవులు అయిపోయేదాకా నన్ను చూడడం, మాట్లాడడం కుదరదనీ, నా కోసం, కేవలం నా కోసం వచ్చిన మల్లిక...
మల్లెపువ్వులాంటి నా మల్లిక.. బోరుమంటూ బోనులో కూలబడిపోయాడు రవీంద్ర సాహూ.
అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు జడ్జి, చెమర్చిన కళ్ళను కళ్ళజోడు తీసి రుమాలుతో వత్తుకుంటూ.. వెంటనే అక్కడున్న అందరూ నిలబడ్డారు.. రెండు నిముషాల వౌనం తరువాత జడ్జి కూర్చున్నాడు.. భారమైన మనసుతో..
లాయర్ భగవాన్ తేరుకుని సాహూతో అన్నాడు.. ‘‘ఐయాం ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ మిస్టర్ సాహూ.. ఇన్ని ఏళ్ళ తరువాత కూడా మీరు ఇంత బాధపడుతున్నారంటే.. ఆమె మీద మీ ప్రేమ, అలాంటి మీతో జీవితాన్ని కోల్పోయిన ఆమె నిజంగా దురదృష్టవంతురాలు.. ప్లీజ్ కంట్రోల్ యువర్‌సెల్ఫ్...’’
అప్పటికి కొంచెం తేరుకున్న సాహూ.. ‘‘వెరీ వెరీ సారీ యువరానర్.. కంట్రోల్ చేసుకోలేకపోయాను.. ఇదంతా నేను సానుభూతినో.. నాకు శిక్ష తగ్గించడానికో ఆశించి చెప్పలేదు.. అర్థం చేసుకోండి.. ప్లీజ్..’’
‘‘మిస్టర్ సాహూ.. ఒక సమర్థవంతుడైన, బాధ్యతాయుతుడైన ఆఫీసర్ అయివుండి మీరు ఎక్కువ రోజులు ఫీల్డ్‌లో పనిచేయకుండా యిలా ట్రైనింగ్ సెంటర్‌లో ఉండిపోవలసి రావడానికి కారణం.. మీ దురుసుతనం, నేరస్థులని చట్టానికి అతీతంగా శిక్షించడం అని అంటారు.. దీనికి మీ సమాధానం..
‘‘అవును.. ఖచ్చితంగా వాడే నేరస్థుడు అని తెలిసాకా కూడా పైనించి వచ్చే ఒత్తిళ్ళతో.. సరైన సాక్ష్యాలు లేవన్న కారణం చూపో వాళ్ళని మళ్లీ సభ్య సమాజం మీదకి.. పొండి.. మీ యిష్టం వచ్చినట్లు నేరాలు చేసుకోండి అని వదిలెయ్యవలసి రావడం నిజంగా బాధాకరం.. అందుకే అలాంటి కేసుల్లో వాళ్ళు బయటపడిన కొన్నాళ్ళకే వాళ్ళని ప్రమాదాల రూపంలో మృత్యువు వరించేది.. అందుకే నా పైవాళ్ళూ నన్ను సాక్ష్యంతో పట్టుకోలేక, అక్కడ నన్ను బంధించలేక యిక్కడ పడేసారు..’’ అతను చెప్పిన విషయం బాధ కలిగించేదే అయినా, చెప్పిన తీరు నవ్వు తెప్పించింది కోర్టులోవారికి.
‘‘మీకు చట్టంమీద గౌరవం, న్యాయవ్యవస్థమీద నమ్మకం లేవా’’
‘‘ఎందుకు లేవు.. వున్నాయ్ కనుకే నా మీద మోపబడిన ఈ నేరాలన్నీ అంగీకరిస్తున్నాను.. లేకపోతే నా మీద చూపిన ఈ ఆరోపణలన్నీ కేవలం అనుమానాలే.. సాక్ష్యాధారాలు కావు, నేను తలచుకుంటే యివి నన్ను ఏమీ చెయ్యలేవు..’’
‘‘మరి అంత నమ్మకం ఉన్న మీరు యిలా యిన్ని హత్యలు అంత కిరాతకంగా, నరరూప రాక్షసుడిలా ఎందుకు చేశారు?
‘‘హలో సార్.. నా నేరం ఒప్పుకుంటున్నా కదా, యింకా మీ కొచ్చిన పదాలన్నీ వాడి నన్ను కించపరచే పనేముంది.. అందుకే నాకు ఈ వ్యవస్థమీద నమ్మకం లేదు..
‘‘మీకు చట్టంమీద...’’
‘‘ఎందుకు సార్, మళ్లీ మళ్లీ అవే అడిగి కోర్టువారి అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తారు.. నేను నా నేరం అంగీకరిస్తున్నాను.. నన్ను శిక్షించండి.. కానీ ఒక్కమాట.. రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ ఆగడాలనీ, అఘాయిత్యాలనీ అరికట్టండి.. వాదనల పేరిట రోజుల తరబడీ, నెలల తరబడీ, ఏళ్ళ తరబడీ సాగదీసి, కింది కోర్టు, కాకపోతే పై కోర్టు, యింకా వీలయితే సుప్రీంకోర్టు.. రాష్టప్రతి క్షమాభిక్ష అంటూ సాగదీసి.. సాగదీసి నేరస్తులకు వెసులుబాటు కల్పించి, ప్రభుత్వ సొమ్ముతో వాళ్ళని మేపకండి.. నేరం జరిగింది అని తెలయగానే రుజువు చేసి వాళ్ళని బహిరంగంగా ఉరితీయండి.. అలాంటి నేరం చెయ్యడానికి యింకొకడికి తలుచుకుంటే భయం పుట్టేలా చెయ్యండి.. అప్పుడు నేనే కాదు, నాలాంటి ఎందరికో చట్టంమీదా, న్యాయవ్యవస్థమీద నమ్మకం, గౌరవం కలుగుతాయి..’’ ఆవేశంగా అన్నాడు సాహూ..
‘‘మీరు ఈ నేరాలు చెయ్యడం వెనుక, ఎప్పుడో సుమారు యిరవై ఏళ్ళ క్రింద జరిగిన..
‘‘ఎందుకు సార్ నా నేరాన్ని నేను ఒప్పుకున్నాకా యింకా ఈ మాటలు..’’
‘‘ఎప్పుడో జరిగిపోయినదానికి ప్రతీకారంగా యినే్నళ్ళ తరువాత మీరు ఈ హత్యలు చెయ్యడంలో ఉద్దేశ్యం.. కోర్ట్‌వారికి అవగతం కావాలి..’’
‘‘యినే్నళ్ళు.. యినే్నళ్ళు అని అంత నొక్కి నొక్కి చెబుతున్న మీకు తెలియదా.. ఎప్పుడో కాదు.. యిప్పుడూ అవే జరుగుతున్నాయ్. జరుగుతూనే వున్నాయ్.. యింకా యింకా జరుగుతాయ్.. ఎందుకంటే రాను రాను.. మోరల్ వేల్యూస్ దిగజారిపోతున్నాయ్.. నిజానికి దిగజారడం నుంచి యింకా క్రిందికి జారి అంతరించిపోతున్నాయ్.. అనునిత్యం ఎన్నో.. ఎన్నో.. ఏం చేస్తోంది ఈ పోలీస్ వ్యవస్థ, న్యాయవ్యవస్థ?
-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్