డైలీ సీరియల్

బడబాగ్ని-52

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవన్నీ తట్టుకోలేక, వికలమైన మనసుతో.. ఆ ఊరు విడిచి వచ్చేసాడు.. ఢిల్లీలో ఉద్యోగంలో చేరిన అతను విరాగిలా మారిపోయి విధి నిర్వహణకే అంకితమైపోయాడు.
అయితే ఎక్కడ అన్యాయం జరిగినా, ముఖ్యంగా స్ర్తిలకు జరిగే అన్యాయాలకు తీవ్రంగా స్పందించి పోరాడే అతనిని ఎన్నో రకాలుగా లొంగదీసుకోవాలనుకునేవాళ్ళు ఎందరో.. అతను ఎంత పోరాడినా.. చట్టంలోని లొసుగులు తమకు అనుకూలంగా మలచుకుని, అతనిని వెర్రివాడిని చేసి కేసుల్లోంచి బయటపడేవాళ్ళని చూసి అతని మనసు రగిలిపోయేది.. అందుకే కొన్నాళ్ళ తర్వాత ప్రతి దోషిని కూడా అతను చట్టానికి అతీతంగా వెంటాడి.. వెంటాడి వాళ్ళను శిక్షించేవాడతను.. ఇది తెలిసి.. అతనిని పట్టుకుని నిరూపించలేక.. అలా అని జరిగేవాటిని ఆపలేకా.. పైఅధికారులు అతనికి ట్రైనింగ్ సెంటర్‌లో పోస్టింగ్ ఇచ్చి డెహ్రాడూన్ పంపేశారు.
***
తన జడ్జిమెంట్ వ్రాయడం పూర్తిచేసిన జడ్జి.. దాన్ని చదవటం మొదలు పెట్టడంతో ఈ లోకంలోకి వచ్చాడు సాహూ, ఈ లోపుగానే తన జడ్జిమెంట్ వ్రాయడం పూర్తిచేసిన జడ్జి...
‘‘ఎందుకోసం చేసినా.. చేసినది తప్పు.. పైగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో వుండి చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని ఇంతమందిని చంపి సోషల్ అన్‌రెస్ట్ కలిగించిన రవీంద్ర సాహని దోషిగా నిర్థారిస్తూ అతనికి కఠిన కారాగారశిక్ష జీవితకాలం విధించడమైనది...తనకున్న పదవితో, సోషల్ స్పృహతో అతను ఆనాటి సంఘటనను చట్టం దృష్టికి తెచ్చి అప్పటి ఆ నేరానికి, బలైపోయిన మల్లికకి న్యాయం చేసివుంటే బాగుండేది.. అతను ఎంచుకున్న మార్గం సభ్య సమాజం, న్యాయవ్యవస్థలకు ఆమోదయోగ్యం కాదు.. అందుకు అతను శిక్షింపబడాలి..
ఎంతో చాకచక్యంతో ఈ కేస్ సాల్వ్ చేసిన ప్రొ.రాహుల్‌కి మిగతావారికి మా న్యాయస్థానం తరఫున అభనందిస్తున్నాం. నౌ ద కోర్ట్ ఈజ్ ఎడ్జరండ్..’’ జడ్జి ఫైల్ మూసి లేచాడు.
అప్పుడు జరిగిందా సంఘటన. తనను అదుపులోకి తీసుకోవడానికి బోను దగ్గరకు వచ్చిన పోలీసు నుంచి అతని వాల్ట్‌లోంచి గన్ తీసి తన కణతలకి గురిపెట్టుకున్నాడు సాహూ...
‘‘యిప్పటికీ నేను చేసింది తప్పని నేననుకోవడం లేదు.. కానీ అమర్, కమల్‌ల చావులకి నైతిక బాధ్యత వహిస్తూ.. న్యాయస్థానం నాకు విధించిన శిక్షను వ్యతిరేకిస్తూ.. ఎప్పటి తప్పుకి అప్పుడే శిక్షించబడాలనే నా వాదనతో నేనే మరోసారి ఏకీభవిస్తూ, హంతకుడిగా రుజువైన నన్ను ప్రభుత్వానికి భారంగా నన్ను జీవితకాలం భరించే అవస్థని తప్పిస్తూ సెలవ్ తీసుకుంటున్నా.. గుడ్ బై..’’ మెల్లి మెల్లిగా తన దగ్గరకు వస్తున్న పోలీస్ ఆఫీసర్‌కు విష్ చేస్తూ ట్రిగ్గర్ నొక్కాడు.. అలాగే కుప్పకూలిపోయాడు. అందరూ ఒక్కసారిగా హాహాకారాలు చేస్తూ లేచి నిలబడ్డారు.
****
‘‘... నో.. నో..’’ అనే్వష్ అరుపుతో ఆ గదంతా మరుమ్రోగింది.
మాంచి నిద్రలో ఉన్న అజిత్ అదిరిపడి లేచాడు.
‘‘అరేయ్.. అనే్వష్... ఏమయిందిరా.. అంతలా అరిచావ్.. అనే్వష్.. అనే్వష్’’ లేచి కూర్చుని వెర్రి చూపులు చూస్తున్న అనే్వష్‌ని కుదుపుతో పిలిచాడు.
‘‘ఒరే.. సాహూ.. మన సాహూ సార్ ఆత్మహత్య చేసుకున్నాడురా ...’’ గాబారాగా అన్నాడు..
‘‘ఏమిటీ.. సాహూ సార్ ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎప్పుడు? నీకెవరు చెప్పారు?’’ అయోమయంగా అడిగాడు.
‘‘ఇప్పుడే.. కోర్టులో జడ్జి.. ఆయనకు కఠిన కారాగారశిక్ష విధించాడు.. అది వింటూనే.. నేరం చేసిన నన్ను ప్రభుత్వ సొమ్ముతో జీవితకాలం భరించడం నాకు ఇష్టం లేదు..’’ అంటూ అక్కడే పోలీస్ ఆఫీసర్ వాల్ట్‌లోంచి పిస్టల్ తీసుకుని షూట్ చేసుకుని అక్కడికక్కడే...’’ మాట పూర్తి చెయ్యలేకపోయాడు అనే్వష్.
‘‘రేయ్.. అనే్వష్.. కూల్.. నీకొచ్చింది కల... అసలు ఇంకా సాహూ సార్‌మీద కేసే ఫైల్ చెయ్యలేదు.. నువ్వు ఈ కేసులో మరీ ఇన్‌వాల్వ్ అయిపోయావ్.. ఇదిగో మంచినీళ్ళు ఆగి.. రిలాక్స్‌కా..’’ అంటూ నీళ్ళు అందించిన అజిత్‌ని ఇంకా అలానే చూస్తున్న అనే్వష్‌ని.. ‘‘అనే్వష్ మనం ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్నాం.. రేపు డెహ్రాడూన్ వెళ్ళేకా.. రాహుల్ సాహూ సార్‌మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు.. ఏమిటి మెలుకువ వచ్చిందా..? అతని దగ్గరగా కూర్చుని చెబుతున్నాడు.
‘‘్థంక్ గాడ్. నాకు ఈ కల టైంలీగా వచ్చిందిరా.. రాహుల్‌కి ఫోన్ చెయ్... మాటాడదాం.. ఆ కంప్లైంట్ ఇవ్వడం రెండు రోజులు ఆపమని చెబుదాం.. నాకెందుకో మనం చేస్తున్న పని సరైనది కాదేమో అనిపిస్తోంది.. సరే.. ఇవన్నీ తరువాత మాటాడదాం.. ముందు ఫోన్ చెయ్యి...’’
‘‘రేయ్.. నీకు మతిపోయిందా.. మన అమర్‌నీ.. కమల్‌నీ చంపిన.. అసలు వాళ్ళనే కాదు.. అంతమందిని అన్యాయంగా చంపినవాడిని.. చ్ఛా.. నీకేమయింది? సర్లే నువ్వు బాగా డిస్టర్మ్ అయి వున్నావ్. రేపు మాటాడదాం.. పడుకో...’’.

-ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్