డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రింద తలుపు దగ్గర హడావిడి గమనించి పైన మెట్లు పైన తేజ కనిపించింది. బానిస్తర్ అంతా పీచ్ రంగు క్లాత్- వరుసగా చుట్టబడి ఉంది. దానిమధ్య లైట్స్. వాటిమధ్య నుంచి తేజ దిగివస్తూంటే అందరూ ఆమెను చూస్తూ ఆగిపోయారు. లేత ఆకుపచ్చ రంగు షేల్వార్, కమీజ్ వేసుకుంది. వదులుగా ఉన్న జుట్టు భుజాలమీంచి ముందుకు పడుతోంది. అంతమంది ఒక్కసారి తన వంక చూస్తుంటే- అందరూ తన బంధువులే అయినా, సిగ్గు కప్పింది తేజ ముఖాన్ని.
‘‘హమ్మయ్యా! ఇంక వౌళి మొహంలో కూడా కొంచెం నవ్వు కనిపిస్తుంది’’ అన్నాడు మూర్తిగారి తమ్ముడు గోపాల్.
బాబాయి వంక చిరుకోపంతో చూసి, వౌళి వంక చూసి ‘హాయ్’ అంది. నా వంక చూసి ‘నమస్తే!’ అంది.
నేను కూడా తల ఊగించాను పలకరింపుగా. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా మర్యాదగా పలకరిస్తూనే ఉన్నారు. నేను కంఫర్ట్‌బుల్‌గా ఉన్నాననిపించాక వౌళి, తేజ, మరికొందరు చిన్నవాళ్ళంతా కలిసి బేస్‌మెంట్‌లోకి వెళ్ళారు. మంచినీళ్లతో మొదలయి ఫలహారాలు, కాఫీలు, కోకాకోలాలు వరుసగా వస్తూనే ఉన్నాయి.
‘‘మీరిలాగా మర్యాదలలు చేస్తుంటే అసలు పెళ్లి టైముకి అలసిపోతారు’’ అన్నాను.
‘‘్భలేవారు. అదేం లేదు’’ అన్నది సావిత్రి.
ఆ రోజు మొదలు పెళ్లిరోజు దాకా ఉన్న ప్లాన్స్ అన్నీ వివరించారు. ఇదేదో చాలా సింపుల్‌గా అమెరికాలో క్లుప్తంగా జరుగుతుందనుకున్న పెళ్లి చూడబోతే ఓ వారం రోజుల హడావిడిలా అనిపించింది.
చాలా సరదాలు, వేడుకలు జరపాలని ప్లాన్స్ చేశారు. సరదాల హడావిడి అంతా తేజ చెల్లెళ్లది, స్నేహితులదిలా ఉంది.
వేడుకలన్నిటికీ అమ్మమ్మగారు, మామ్మగారు ప్లాన్స్- అన్నిటికీ తల ఆడిస్తున్నారు మూర్తిగారు. ఆయనకు ఎవర్నీ నిరుత్సాహపరిచే ఉద్దేశం వున్నట్టు లేదులా ఉంది.
ఉన్నట్లుండి సావిత్రి అంది- ‘‘అన్నీ మేం చెప్పుకుపోతున్నాం. మీరు ఏదయినా చేయించాలి అంటే చెప్పండి’’. క్షణం అందరూ నిశ్శబ్దమయిపోయారు నేనేం అంటానో అని. పెళ్లికొడుకు తల్లి మాటకు అంత విలువ ఉంటుందన్న విషయం కూడా నాకు తోచలేదు.
‘‘నాకు ప్రత్యేకంగా ఏమీ లేవు’’ అన్నాను. మూర్తిగారి తల్లివైపు చూస్తూ, ‘‘నాకు పెద్దగా ఏమీ తెలియవు. మా తరఫునుంచి ఏం జరగాలో అన్నీ మీరు నాకు చెప్పండి.
తేజకి జరగాల్సిన వేడుకలలో ఏ ఒక్కటీ జరగకపోవడం నాకు ఇష్టంలేదు. వాటికి ఏమయినా ఏర్పాట్లు చెయ్యాలంటే చేద్దాం. ఇంకా టైం ఉందిగా’’ అన్నాను.
అందరి ముఖాలు ప్రఫుల్లమయ్యాయి. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది పెళ్లి అయ్యాక తమ పిల్లలకు, చక్కని ప్రేమ, ఆదరణ లభించాలనే!
ఆ రెండిటికి మా దగ్గర తక్కువ ఏమీ లేదు. నేను పొందనిది కూడా అందించాలన్న కోరిక నాకు కూడా చాలానే ఉంది.
ఆ రాత్రి దాకా, అక్కడే గడిపి మా హోటల్ రూంకు వచ్చాం. అంతమందిలో ఆ సందడి, హడావిడిలోంచి, బయటకు రాగానే, ఒక్క క్షణం చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు అసలు అంతమందిలో గడపడం అలవాటు లేదు.
ఆ హోటల్ కూడా చాలా పెద్దదిగా ఉంది. లోపల బెడ్‌రూంలో రెండు పెద్ద డబుల్ బెడ్స్ ఉన్నాయి. ముందు ఒక సిట్టింగ్ రూం ఉంది. రెండు రూమ్స్‌లోనూ టీవీ, ఫోన్స్ ఉన్నాయి. ఆనుకునే బాత్రూం, దాన్ని ఆనుకునే ముందుగా కాఫీ పెర్‌క్యులేటర్, రిఫ్రిజిరేటర్ అన్నీ ఉన్నాయి.
వౌళి లోపలకు వెళ్ళాడు షవర్ తీసుకుంటానని. నేను టీవీ ఆన్ చేసి ముందున్న టేబుల్‌మీద కాళ్ళు జాపుకుని రిలాక్స్‌డ్‌గా వెనక్కి వాలాను. ఆ రోజంతా జరిగినవన్నీ మనసులో నెమరువేసుకుంటూ గడిపాను.
నా కుటుంబం గురించి, నా ఉద్యోగం గురించి చాలామంది చాలా ప్రశ్నలు వేశారు ఏదో సంభాషణ పెంచాలి కదా అన్నట్లు. చిత్రం! ఏ ఒక్కరూ వౌళి తండ్రిని గురించి అడగలేదు. అతను ఎప్పుడు వస్తారని కానీ, రాలేదేమనిగాని అడగలేదు. నాకు కొంచెం ఆశ్చర్యమే అనిపించింది.
వాళ్ళందరికీ మా ఇద్దరి సంగతి తెలిసే ఉంటుంది. ఎంత విడిపోయినా, పెళ్ళిళ్ళ లాంటి పెద్ద కార్యాలకు రాకుండా ఉండరుగా! కానీ, ఒక్కరు కూడా ఆ విషయం ఎత్తలేదు. వారి సభ్యత, సంస్కారాలకు స్పందించకుండా ఉండలేకపోయాను.
డోర్‌మీద ఎవరో కొట్టినట్లు అనిపించింది. చటుక్కున కాళ్ళు జోళ్లల్లో పెట్టి, లేచి తలుపు దగ్గరకు వెళ్లాను. కొద్దిగా తెరిచి చూచాను. డోర్‌కి అవతల మూర్తిగారు, సావిత్రి. చటుక్కున డోర్ తెరచి ‘‘రండి రండి’’ అన్నాను. పొద్దుటనుంచి కంచిపట్టుచీరతో కనిపించిన సావిత్రి ప్యాంటు, షర్టుతో నుంచుని ఉంది.
‘‘ఇలా వచ్చానని మీరేం అనుకోకండి కళ్యాణిగారు. వంటిల్లు శుభ్రం చేసుకుంటుంటే ఈయన రమ్మని హడావిడి చేసేశారు. బట్టలు మార్చుకుందుకు కూడా వ్యవధి ఇవ్వలేదు’’ అంది మొగుడి వంక చూస్తూ సంజాయిషీ ఇస్తున్నట్లు.
‘‘్భలేవారే! ఇందులో అనుకునేందుకు ఏముంది. మీకు ఇంట్లో బోలెడు పనులు. ఎలా సులువుగా ఉంటుందో అలా ఉండండి. నా కోసం మీరు ఏ మర్యాదలు పాటించక్కర్లేదు. రండి కూచోండి అని చెప్పి లోపల రూంలోకి వెళ్లాను.
బాత్రూం డోర్ ముందు నుంచుని ‘‘వౌళి! మూర్తిగారు, సావిత్రిగారు వచ్చారు’’ అని చెప్పి ఇవతలకు వచ్చాను.
ఒక గంట క్రితమే మా ఇద్దరినీ హోటల్‌రూంలో దింపారు. అంతలోనే ఏమయి వుంటుంది? మళ్లీ వచ్చారేంటి? ఫోన్‌లోనే చెప్పచ్చుగా అనుకుంటూ వచ్చి వాళ్ళ ముందు కూర్చున్నాను.
వౌళి స్నానం ముగించుకుని పైజమా లాల్చి వేసుకుని తల తుడుచుకుని తువాలు భుజంమీద వేసుకుని బయటకు వచ్చాడు.
వస్తూనే ప్రశ్నార్థకంగా చూశాడు ఏమిటి సంగతన్నట్లు. ఒక్క క్షణం సావిత్రి, మూర్తిగారు మొహాలు చూచుకున్నారు.
‘‘అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ‘‘ఈవారం మీకోసం ఒక కార్ ఎండ్ డ్రైవర్‌ని ఏర్పాటుచేస్తున్నాను. మీరు ఎక్కువగా డ్రైవ్ చేయడం నాకిష్టంలేదు’’ అన్నారు. ఎక్కడికి వెళ్లాలన్నా అందులో తిరగవచ్చు అన్నారు మూర్తిగారు. ఉలిక్కిపడ్డట్టు చూశాడు వౌళి.
‘‘నో నో అంకుల్. అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టకండి. మా అమ్మకి నా కాలేజీ అవీ చూపించాలి. నేను అప్పుడే కార్ రెంట్ చేశాను. తేజ తన స్నేహితులను పిక్ చేయడానికి కావాలంది.. అందుకని తను, తీసుకుని వస్తోంది’’’ అన్నాడు కంగారుగా.
‘‘అది కాదోయ్- నా కోసం...’’
మాటల్లోనే అడ్డు వచ్చాడు వౌళి ‘‘ప్లీజ్ ఈ విషయంలో అభ్యంతరం పెట్టకండి. నాకు ఇక్కడ పెద్దగా పనులేమీ లేవు. మీరు రమ్మన్నారని వచ్చాను తప్ప మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చినపుడు ఎయిర్‌పోర్ట్‌కి అది వెళ్లాలి. నేను జాగ్రత్తగా డ్రైవర్ చేస్తాను’’ అన్నాడు నవ్వుతూ!
మూర్తిగారు కూడా నవ్వుతూ ‘‘ఓ.కె! ఐ గివ్ అప్!’’ అన్నారు.
వాళ్ళను చూస్తే కారు గురించి మాట్లాడడానికి వచ్చినట్లు నాకు అనిపించలేదు. ఎందుకో ఏదో మాట్లాడడానికి కొంచెం వెనుకాడుతున్నట్లు అనిపించింది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి