డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-56

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగైదురోజుల తరువాత తేజ ఫోన్ చేసింది. తనూ, వాళ్ళ నాన్నగారు వెళ్లి కార్ టో చేయించామని, ఇపుడు అంతా బాగానే ఉందని చెప్పి మరోసారి థాంక్స్ చెబుదామని కాల్ చేశానంది.
మీరు, మీ పేరెంట్స్, ఈ థాంక్స్‌తో నన్ను మరీ హడలు కొట్టేస్తున్నారు అన్నాను.
‘‘అదేం లేదు. యు డిజర్వ్ ఇట్’’ అంది.
‘‘నాకు కాదు థాంక్స్ మీకు నేను థాంక్స్ చెప్పుకోవాలి. మీరు త్వరగా నిర్ణయించుకుని నా కారు ఎక్కి ఉండకపోతే ఆ స్నోలో నా కారు కూడా స్టక్ అయ్యేది’’ అన్నాను.
నవ్వి గుడ్‌బయ్ చెప్పింది.
ఎప్పుడయినా లాన్సింగ్ వైపు వెళ్లినపుడు ఆ అమ్మాయి గుర్తుకు వస్తే పిలిచేవాడిని. అలాగే ఓసారి దాదాపు కొన్ని నెలల తరువాత ఫోన్ చేశాను. చాలా టైర్డ్‌గా వినిపించింది ఆ అమ్మాయి కంఠం. ‘‘ఏమిటలా ఉంది మీ వాయిస్, ఒంట్లో బాగాలేదా?’’ అన్నాను.
‘‘అదేం కాదు. ఐయామ్ జస్ట్ టైర్డ్! రేపటినుంచి నాకు ఫైనల్స్. టుమారో ఈజ్ స్టాటిస్టిక్స్. సెమిస్టర్ అయిపోతుంది. ఐ స్టిల్ హేట్ ఇట్ అంది విసుగ్గా. ఎంత చదివినా తెలిసినదానికంటే తెలియనిదే ఎక్కువగా ఉంది. ఐ షుడ్ హావ్ డ్రాప్డ్! లేదే! నాకు డ్రాప్ చేయాలంటే మనసు ఒప్పుకోదే! ఐ నో, ఐయామ్ గోయింగ్ టు రూయిన్ మై జిపిఎ. డెస్పరేట్‌గా వినిపించింది.
‘‘ఎక్కడున్నారు ఇప్పుడు’’ అన్నాను.
‘‘లైబ్రరీకి వెడుతున్నాను ఇంకో పది నిమిషాలలో’’ అంది.
‘‘జస్ట్ స్టే అవుట్‌సైడ్. ఐ లైక్ టు మీట్ యూ!’’ అని ఫోన్ పెట్టేశాను. ఆ తరువాత సుమారు రెండు గంటలు తేజతో గడిపాను లైబ్రరీలో ఆ అమ్మాయికి హెల్ప్ చేస్తూ. నా ఎం.ఎస్ ప్రోగ్రాంలో నాకు దొరికిన టీచింగ్ అసిస్టెంట్ ఉద్యోగం బాగా పనికొచ్చింది ఈ అమెరికన్ స్టూడెంట్స్‌కి నేర్పడానికి. అమెరికాలో బేసిక్స్‌ని మెమోరైజ్ చేయించరు.
ఎంతసేపూ అనలైజ్ చెయ్యమంటారు. ఆ దృష్టి తక్కువున్నవాళ్ళు చాలా కష్టపడవలసి వస్తుంది. నేను చాలామందికి మన పద్ధతిలో నేర్పుతూ ఉంటాను.
తేజకి కొంచెం ధైర్యం వచ్చింది. ఇంక ఈ సబ్జెక్టు ఇప్పటికి మూసేయండి. మళ్లీ రేపు తెరవండి. మిగిలినవాటికి ప్రిపేర్ అవ్వండి అని లేచాను.
రెండు చేతులు పైకెత్తి ‘‘నో.. థాంక్స్ చెప్పకండి’’ అన్నాను నవ్వుతూ!
మర్నాడు రాత్రి పిలిచింది. ‘‘ఐ యామ్ వెరీ హాపీ!’’ అన్నాను నవ్వుతూ!
ఓ.కె! ఇప్పుడు థాంక్స్ చెప్పండి అని మూసేశాను. ఆ తరువాత అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉండేది. తెలియనివి అడుగుతూ ఉండేది. ఫోన్‌లోనే చాలా చెప్తూ ఉండేవాడిని. తరుచుగా కలుసుకోవడం, సినిమాలకు, డిన్నర్‌కి వెళ్ళడం చేస్తూ ఉండేవాళ్ళం.
గో ఫర్ పిహెచ్.డి. యు విల్ మేక్ ఆ గ్రేట్ ప్రొఫెసర్ అంటూ ఉండేది! తనకు అర్థం అవగానే!
సావిత్రిగారు థాంక్స్ గివింగ్‌కి, క్రిస్ట్‌మస్‌కి పిలుస్తూనే ఉండేవారు. కాని నేనే ఒకటి రెండు సార్లకంటే వెళ్ళలేదు. ఆవిడ ననే్న కాదు అలా పరిచయమయిన స్టూడెంట్స్ అందరిని పిలుస్తూనే ఉండేవాళ్ళు. వంటరిగా దేశానికి చాలా దూరంగా ఉంటారని.
నా గ్రాడ్యుయేషన్‌కి తేజాని, ఆ అమ్మాయి పేరెంట్స్‌ని కూడా ఇన్‌వైట్ చేశాను. మామూలుగా కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. మన చంద్రశేఖర్‌ని రమ్మంటే సెలవ లేదన్నాడు. మూర్తిగారూ వాళ్ళకు కూడా మరేదో ఎంగేజ్‌మెంట్ ఉండటంతో వాళ్ళు రాలేకపోయారు.
తేజ మాత్రం కాలేజీ నుంచి సరాసరి వచ్చింది. గ్రాడ్యుయేషన్ సెర్మనీ పూర్తి అవగానే హాల్ బయటకు వచ్చాను. తేజ బయట నా కోసం వెయిట్ చేస్తూ ఉంది.
నన్ను చూడగానే చెయ్యి చాచి కంగ్రాట్స్ అంది. ఆ అమ్మాయిని చూసేంతవరకు తేజాని నేను ఆహ్వానించానన్న విషయం కూడా మర్చిపోయాను.
ఆ రోజు ఆ హాల్‌లో ఎదురయిన అనుభవం చుట్టూ ఉన్న పరిసరాలను మరిపించేటట్లు చేసింది.
తేజ చెయ్యి పట్టుకుని షేక్ హాండ్ ఇస్తూ అలాగే ఆగిపోయాను. రెండు చేతులతో ఆ అమ్మాయి చేయి ఉండిపోయింది.
తేజ ఆశ్చర్యంతో చూస్తూ ఏం చేయాలో తెలియనిదానిలా నిలబడిపోయింది.
పక్కపక్కనే నడస్తూ రిసెప్షన్‌కి వెళ్లాం. యు ఆర్ ఏవ్‌ఫుల్లీ క్వైట్. సమ్‌థింక్ బాదరింగ్ యు? తేజ ఎప్పుడూ ఇంగ్లీష్‌లోనే పలకరిస్తుంది. తెలుగు అర్థమయినా మాట్లాడటానికి ముందుకు రాదు.
ఏం లేదన్నట్లు తల ఊగించాను.
మా గైడ్, ప్రొఫెసర్, డా.రఘురాం నన్ను పలకరించి వెళ్లిపోయారు. పక్కనే ఉన్న తేజా కాసేపు అయ్యాక కుతూహలంగా వెనక్కి తిరిగి చూచింది. ఏమిటన్నట్లు నేనూ తిరిగి చూచాను.
డా.రఘురాం జేబులు రెండింట్లో చేతులు పెట్టుకుని నుంచుని, ఎదుటగా ఎవరితోనో మాట్లాడుతూ నిలబడి ఉన్నాడు. పక్కనే ఉన్న ప్రొఫెసర్ తల ఊగిస్తూ మధ్య మధ్యలో ఏదో అంటూ ముగ్గురూ సంభాషించుకుంటున్నారు.
ముందుకు నడుస్తూ తేజ తల అడ్డంగా ఊగించింది. ‘‘స్ట్రేంజ్.. నీకు, డా.రఘురామ్‌కి ఎంత పోలికలు ఉన్నాయో అంది. తెలియనివారైతే మీ ఇద్దరూ రిలేటెడ్ అనుకుంటారు’’ అంది.
నడస్తున్నవాడిని ఆగిపోయాను. తేజ ముఖంలోకి చూస్తూ ఉండిపోయాను.
క్షణం నేను ఏమీ ఆలోచిస్తున్నానో, ఏమంటున్నానో కూడా తెలియదు. పరధ్యానంగా ‘వుయ్ ఆర్’ అన్నాను. ఈసారి ఆశ్చర్యపోవడం తేజ వంతు అయింది. నడుస్తున్నదల్లా ఆగిపోయింది
ఎదురుగా చాలామంది తెలిసినవాళ్ళు, ప్రొఫెసర్లు ఫెలో స్టూడెంట్స్ అంతా ఎదురవడంతో అందరి దగ్గరనుండి కంగ్రాట్స్ అందుకుంటూ, తిరిగి పంచుతూ హాల్ నుండి బయటకు వచ్చేశాం. తేజకి నా మాటలు అర్థం కాలేదు. కానీ, వాటిని గురించి అడగాలని ఉంది. సభ్యత అడ్డు రావడంతో సందేహిస్తూ ఉండిపోయింది.
ఇక తేజా వెళ్లిపోవాలని బయలుదేరంగానే అన్నాను.
‘‘మీకు వేరే పనులు లేకపోతే ఈ సాయంత్రం ఇక్కడ ఉండండి.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి