డైలీ సీరియల్

ట్విన్ టవర్స్ 86

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పక్క బోగీలోంచేమో ఏదో మ్యూజిక్ వినిపిస్తోంది.
రైలు ఏ స్టేషన్‌లో ఆగినా, చాలా తక్కువగా జనసంచారం కనిపిస్తోంది. ఎక్కే దిగేవాళ్ళు కూడా చాలా తక్కువగా ఉన్నారు.
తేజ, వౌళి ఏం చేస్తుంటారో? శనివారం కదా! శెలవు రోజు! హనీమూన్ ప్లాన్స్ ఎంతవరకు వచ్చామో!
నవ్వుకున్నాను, ఇంకా వదిలి గట్టిగా 48 గంటలు అవలేదు.
అంతలోనే ఎయిర్‌పోర్టులో కనిపించిన రఘురామ్ గుర్తుకువచ్చాడు, ఎందుకొచ్చి వుంటాడు? అమ్మా నాన్నలను చూడటానికేమో!
తరచుగా, బెంగుళూరు ఐఐటికి వచ్చి వెళుతుంటాడని తను చదివింది.
తమాషా 20 గంటలు ఒక్క విమానంలో ప్రయాణం చేశాము. కాని తెలియలేదు. తెలిస్తే మాత్రం ఏం జరిగేది. అతన్ని పలకరించేదా? అతను పలకరిస్తే తను ఏం మాట్లాడేది?
‘‘ఎందుకు అమెరికా వచ్చావంటే?’’
నా కొడుకు కోసం. అతనికీ కొడుకే! కాని ఎందుకో మనస్సు చివుక్కుమంది. ఆ ఆలోచన చాలా చేదుగా అనిపించింది.
విజయవాడలో రెండు రోజులు వుండి కాలేజీకి వచ్చాను.
నే వచ్చే రోజు అందరికీ తెలుసు. దాంతో నా స్ట్ఫా అంతా చాలా చక్కని స్వాగతం పలికారు, పూలగుత్తులతో.
‘‘ఏమిటీ హడావుడి అంతా, నేనేమీ సాధించలేదు రుూ సత్కారాలందుకోవడానికి’’ అన్నాను.
‘‘కేవలం హాలిడేస్ అంతే’’ అన్నాను.
‘‘అయితే ఏం మేడమ్, అమెరికా వెళ్ళడం రావడం అంటే మామూలు కాదు కదా!’’ అన్నారు.
ఏమిటో రుూ అమెరికా వెళ్లాలన్న పిచ్చి రుూనాటికి తగ్గడంలేదు సరికదా, యింకా పెరుగుతోంది. ఇండియాలో ఇప్పుడు దొరకని వస్తువులు లేవు. డబ్బులుంటే ఇండియాలో వున్న సుఖం మరెక్కడా వుండదు. అయినా సరే డబ్బున్నవారంతా స్వంత డబ్బు ఖర్చుచేసుకుంటూ మరీ అమెరికాలో ఉంటున్నారు.
ఏమయి ఉండాలి ఇంతగా కోరడానికి. ఈమధ్య విజయవాడలో తెలిసిన వాళ్ళబ్బాయి అమెరికాలో అన్నీ అమ్మేసుకుని ఇండియా వచ్చాడు, వ్యాపారం చెయ్యాలని. రెండు సంవత్సరాలు గట్టిగా ప్రయత్నించి చివరకు తిరిగి వెళ్లిపోయాడు, ఇక్కడ వ్యాపారం కొనసాగించలేక. ఏమిటంటే నేను రుూ పద్ధతులు హ్యాండిల్ చెయ్యలేనండి. ఈ లంచాలు, రికమండేషన్స్ నావల్ల కాదు. ఏ ఒక్క పని మామూలుగా జరగదు. ఇంతమంది చేతులు తడుపుతూ ఇంతమంది కాళ్ళు పడుతూ నాట్ ఫర్ మి అని మళ్లీ తిరిగి వెళ్లిపోయాడు. ఇప్పుడు అతను అక్కడ ఓ పెద్ద వ్యాపారవేత్త.
పరాయి దేశంలో సాధించగలిగినది, స్వంత దేశంలో సాధించలేకుండా వున్నారు.
రుూ సంఘర్షణలో నా దగ్గరనుండి అయిదారు వ్యాసాలు వెలువడ్డాయి.
కానీ ఈసారి ఉద్యోగంలో చేరాక, పనంతా ఎందుకో చాలా యాంత్రికంగా అనిపించింది. మనసులో ఎందుకో ఒక నిర్లిప్తత ఆవహించింది.
ఇంతకాలం ఏమిటో నా మీద యింకా ఏదో బాధ్యత వుందన్న భావం మనసులో మెదులుతూనే ఉండేది. వౌళికి ఎప్పుడూ పెద్దగా ఏమీ చెయ్యకపోయినా, వాడి బాధ్యత ఏదో నామీద వుందనిపించేది.
యిప్పుడు వాడి చదువు పూర్తయింది, ఉద్యోగస్థుడయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో సెటిల్ అయ్యాడు. ఇక నా అవసరం వాడికి తీరింది. నేను బాధ్యత నుండి విముక్తిరాలినయ్యాననిపించింది. ఏమిటో జీవితంలో ఒక పర్పస్ లేదనిపించడం మొదలుపెట్టింది. ప్రతి జీవికి ఎదురుచూడాల్సిన అవసరం ఏదో వుండాలేమో! అప్పుడప్పడు ఆశ నిరాశల మధ్య వూగిసలాడటం కూడా ముఖ్యమేనేమో!
రుూ శూన్యభావన ఎక్కువవడంతో తరచుగా విజయవాడ వెళ్లి అమ్మా నాన్నలతో గడపడం మొదలుపెట్టాను. వాళ్ళు కూడా పెద్దవాళ్లయిపోయారు.
యిప్పుడు నా ధ్యేయం అంతా అన్నయ్య, వదిన మీద. నేను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటినుండి అన్నయ్యని పోరడం మొదలుపెట్టాను.
‘‘అన్నయ్యా! నువ్వు, వదిన ఒకసారి అమెరికా వెళ్లి శేఖర్ దగ్గర కొద్దిరోజులు వుండి రండి’’ అని సతాయించడం మొదలుపెట్టాను.
‘‘ఆ! ఇప్పుడు అమ్మ, నాన్నని వదిలి ఎక్కడికి వెళ్ళను అనేవాడు’’.
‘‘రుూసారి కాలేజీ సెలవులు ఇవ్వగానే నేనిక్కడికి వచ్చి వీళ్ళతో వుంటాను. అవసరమైతే చిన్న అన్నయ్య కూడా వస్తాడు. వీళ్ళను నే చూసుకుంటాను వెళ్ళు’’ అన్నాను.
అమ్మ కూడా నన్ను సపోర్టు చేయడం మొదలుపెట్టింది. ‘‘వెళ్ళరా, నీ పెళ్ళాన్ని కూడా తీసుకెళ్ళు. అత్తగారిలా తిరిగిరాని’’ అంటూ పాస్‌పోర్టుకు అప్లై చేయించాను.
మా వదిన ‘‘ఎందుకు కల్యాణీ నీకీ శ్రమ. మీ అన్నయ్య కృష్ణాతీరం వదిలి ఎక్కడకూ వెళ్ళడు’’ అనేది.
‘‘ఎందుకే అనవసరంగా బోలెడు ఖర్చు, శేఖరం తరచుగా వచ్చి వెళుతున్నాడు. చూస్తూనే వున్నాంగా’’ అన్నాడు అన్నయ్య.
‘‘డబ్బు ఖర్చు అనుకుంటే నువ్వు చేసే పనులన్నీ చేసేవాడివా?’’ అన్నాను.
ఎంత ఒప్పించాలి అని చూచినా ఒప్పుకోని అన్నయ్యతో చివరకు ఓ బ్రహ్మాస్త్రం ఉపయోగించాల్సి వచ్చింది.
‘‘నువ్వు చాలా స్వార్థపరుడివి అన్నయ్యా అన్నాను’’ నిరుత్సాహంగా.
నేను అంత మాట అంటానని వూహించని అన్నయ్య ఆశ్చర్యంగా చూశాడు.
‘‘లేకపోతే ఏమిటి చెప్పు. నీ తమ్ముళ్ళని చదివించడానికి నీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకు అన్నింటికి డబ్బు ఖర్చు చేశావు. ఇప్పుడు మీ ఆవిడని, ఆవిడ కొడుకు కాపురం చూడాలనుకుంటే డబ్బు దండగ అంటున్నావు’’ అన్నాను కొంచెం సీరియస్‌గా, నిష్ఠూరంగా.
‘‘అన్నయ్య నవ్వాడు. ఎంత లంచం ఇచ్చావు దానికి. నీ తరఫున యిలా వాదిస్తోంది’’ అన్నాడు వదిన వంక చూస్తూ.
‘‘అమ్మో యిప్పుడు రుూవిడ పెద్ద కాలమిస్ట్. లంచం అన్నామంటే మనం పేపర్ ఎక్కుతాం’’ అంది.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి