డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-128

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నావంకే చూస్తున్న తేజా కళ్లంబట నీళ్లు చెంపలమీదకు జారాయి. పక్కనే సాయానికి నుంచున్న నర్సు టిష్యూ చేతికి ఇచ్చింది.
కళ్లు తుడుచుకుంటూ తేజా కుర్చీలో కూర్చుంది. కాస్ట్ వేసిన కాలు నిటారుగా జాపుకుంటూ, తేజా కుర్చీలో కుదుటపడ్డాక వౌళి వచ్చి నా పక్కన కూర్చున్నాడు.
ఇంతలో ఎవరో ఫొటోగ్రాఫర్ ఫ్లాష్ వెలిగి ఆరిపోయింది, వౌళి కోసం కాబోలు.
కొద్దిసేపు ఆమె ముఖంలో సంఘర్షణ కొట్టొచ్చినట్టు కనబడింది. పీడకల లాంటి వాస్తవం మళ్లీ పలకరిస్తోంది. మెల్లిగా దృష్టి ఆడియెన్స్ మీంచి మరల్చుకుంది. ఆ తరువాత తేజా తల ఎత్తి ఎవరివంకా చూడాలన్న ప్రయత్నం చెయ్యలేదు. కేవలం, 11వ తారీఖులోకి వెళ్లిపోయింది.
సెప్టెంబర్ 11, పోయిన మూడేళ్లుగా కృషి చేస్తున్న ఒక ప్రాజెక్టుని దేశంలో ఎంతో పేరుప్రఖ్యాతులుగాంచిన, కంపెనీలవారీగా వారికి నేను, డా.కృష్ణన్ ప్రజెంట్ చెయ్యబోతున్నాం. కృష్ణన్ నా కొలీగ్. నిజానికి కొంచెం సీనియర్. చాలా తెలివిగలవాడు. ఐటి అతని ప్రాణం. దాదాపు కంప్యూటర్‌తో సమంగా పని చేయగలిగినవాడు. కాని అతనికెందుకనో, నా ఆలోచనా విధానం మీద చాలా గురి వుంది. అందుకే అడుగడుగునా, నాతో చర్చించేవాడు. ఇద్దరం చాలా కృషి చేశాం. చాలా కష్టపడ్డాం. రుూ ప్రొడక్ట్ కనక అమలులోకి వస్తే చాలా సామాన్య ప్రజానీకానికి లాభిస్తుంది.
కృష్ణన్ తమిళనాడులో చిన్న పల్లెటూరు నుంచి వచ్చాడు. చాలా సామాన్యమయిన కుటుంబం నుంచి. ఇండియాలో, జీవిత విధానానికి అతనికి చాలా అవగాహన వుంది. పూర్ కంట్రీస్‌లో బేసిక్ రిక్వైర్‌మెంట్స్ అతనికి అర్థమయినంతగా నాకు ఎక్స్‌పీరియెన్స్ లేదు. అతని ధ్యేయం ఏ ఇనె్వన్షన్ జరిగినా అది సామాన్య ప్రజానీకానికి ఉపయోగపడాలి.
భారతీయుడి తెలివితేటలు, పరిజ్ఞానం, అమెరికన్ ఆలోచనా విధానం విమర్శనాత్మక విజ్ఞానం రెంటితో కలిసి రుూ ప్రోడక్ట్‌కి జన్మనిచ్చింది.
ముందు రాత్రి 12 గంటలదాకా ఫోన్‌లో చర్చిస్తూనే వున్నాం. మర్నాటి ఉదయం చేయబోయే ప్రజెంటేషన్ అతని ఐడియాస్, నా వాయిస్ రెండు కలవాలి. రుూ రెండూ ఆ ప్రెజెంటేషన్‌కి అటెండ్ అయ్యే వ్యాపారవేత్తలను మెస్మరైజ్ చెయ్యాలి. ఇదీ అతని ఆలోచన.
నాకు నా ప్రెజెంటేషన్ మీద అతనికున్నంత నమ్మకం లేదు. అదే అంటూ వుండేదాన్ని అతనితో. నీ మెదడులో వున్న అవగాహన, నీ కంఠంలో తొణికిసలాడే నమ్మకం, నీ మొహంలో కనుపించే నిజాయితీ నీకు తెలియదు. నువ్వు ఆడియెన్స్‌లో కూచుని ఎప్పుడూ చూడలేదు అనేవాడు. నీ చిత్తశుద్ధి నీకు ఒక ఆభరణం.
ఫోన్ మూసేసేముందు సడెన్‌గా అడిగాడు- వౌళి ఏం చేస్తున్నాడని.
బెడ్‌రూమ్‌లో ఏదో మాగజైన్ చదువుతున్నట్లున్నాడని అన్నాను. రోజు వౌళి అలవాటు తెలుసు కాబట్టి.
‘‘హీ ఈజ్ గ్రేట్ గై’’ అన్నాడు.
‘ఏమన్నావ్’ అన్నాను. అంత గొప్ప పొగడ్తకి. వౌళి ఏం చేశాడు నీకు అన్నాను. ‘‘కష్టపడుతున్నది నేను, కాంప్లిమెంట్స్ అతనికా’’ అన్నాను చిరుకోపంతో.
పెద్దగా నవ్వాడు. రోజంతా ఆఫీసులో శ్రమపడి వచ్చి, రాత్రి హాయిగా పడుకోవడానికి వస్తే భార్య మరో మగాడితో కబుర్లు చెప్తూ కూచుంటే.. అమ్మో చాలా కష్టమే భరించడం’’ అన్నాడు, నన్ను టీజ్ చేస్తూ.
‘‘నేను కబుర్లు చెప్పడంలేదు. ముఖ్యమైన విషయాలు చర్చిస్తున్నాను’’ అన్నాను సీరియస్‌గా.
‘‘రేపు నేను పెళ్లి చేసుకున్నాక, నా భార్య ఇలా చేస్తే, నేను వౌళి అంత ఓర్పుగా వుండలేను’’ అన్నాడు, నన్ను ఇంకా ఉడికిస్తూ.
‘‘ఏం నువ్వు మాత్రం అదే పని చేయడంలేదా, రాత్రి 11 గంటలకి మరో ఆడపిల్లతో ఫోన్‌లో కబుర్లు చెప్పడం’’.
‘‘ఐ యామ్ ఏ మాన్’’ నవ్వాడు.
‘‘నువ్వో మేల్ షావనిష్ట్‌వి’’ అన్నాను. ‘‘మెన్ షావనిజం పర్యాయ పదాలు’’ అన్నాను.
ఐ అగ్రీ అన్నాడు నవ్వుతూ! గుడ్ నైట్ తేజా. ఇప్పటికి చాలా టైమ్ ఖర్చుపెట్టాం. స్లీప్ వెల్. కాని నాకు నీతో మాట్లాడాక చాలా నమ్మకంగా వుంది.
ఫోన్ పెట్టేశాను. నిద్రపోతున్న ఉష వంక చూచాను. అదే స్థితిలో వున్న వౌళిని చూచాను.
నిశ్శబ్దంగా బాల్కనీలోకి వెళ్లి నుంచున్నాను.
సెప్టెంబర్ మూలంగా, గాలి చల్లబడుతోంది. పైన వెనె్నల. రోడ్లమీద చాలా కొద్దిగా కార్స్ తిరుగుతున్నాయి.
న్యూయార్క్ సిటీ హాయిగా నిద్రలోకి జారిపోయింది. భవిష్యత్తు తెలియని ప్రగాఢమయిన నిశ్శబ్దంలో-
నిన్న తిరిగిరాదు. రేపు తెలియబోదు. రుూ రోజే నీది. ఎంత నిజమైన వ్యాఖ్య. ఏ కవి మనసులో మెదిలిందో కాని.
నిద్ర రాని రాత్రి తెల్లవారింది. నా ఫైనల్ ఎగ్జామ్స్ ముందు కూడా ఎప్పుడూ ఇంత టెన్షన్ పడలేదు. రోజూకంటే ముందుగా లేచాను. ఉషకోసం పాలు సిద్ధం చేసి, ఆఫీసుకు వెళ్ళేందుకు రెడీ అవసాగాను.
నా వెనకే వౌళి కూడా లేచి వచ్చాడు. కాఫీ చేసి వేడిగా నాకో కప్పు ఇచ్చి, తనూ తెచ్చుకున్నాడు.
అంతకంటే- మా ఇద్దరిమధ్య ఏ మాటలు లేవు. అతనికి తెలుసు నేనెంత ముఖ్యమైన పనిమీద హడావిడి పడుతున్నానో.
క్రింద టాక్సీ వచ్చింది. నాకు అవసరమైన నోట్సు, నా కంప్యూటర్ అన్నీ ఓ అట్టపెట్టెలో పెట్టాను. దాన్ని ఎత్తబోతుంటే తెచ్చిపెడతానుండు, కొంచెం హెవీగా వున్నట్లుంది అంటూ వౌళి నాతోపాటు క్రిందకు వచ్చాడు.
బాక్స్ టాక్సీలో పెడుతూ ‘‘గుడ్‌లక్, యు విల్ డు ఫైన్’’ అంటూ కారు తలుపు గట్టిగా వేశాడు.
వౌళి వంక చూస్తూ ‘‘్థంక్‌యూ’ అన్నాను. రాత్రి కృష్ణన్ మాటలు మనసులో మెదిలాయి. చిరునవ్వు అప్రయత్నంగా వచ్చింది.
టాక్సీలో వెనక్కి వాలాను. శరీరం కొంచెం అలసిపోయినట్లున్నా, మనసు మాత్రం చాలా మెలకువగా వుంది.
ఇంక ప్రాజెక్టుని గురించి ఆలోచించడం మానేయాలని ప్రయత్నం. కారు విండోలోంచి బయటకు చూస్తూ కూర్చున్నాను. ఎప్పుడో నిద్రలేచిన న్యూయార్క్ హడావిడిగా పరుగులు పెడుతోంది. బయట సూర్యరశ్మి ప్రశాంతంగా పరచుకుని వుంది. పరిగెడుతున్న చెట్లు ఫాల్ మూలంగా రంగులు మార్చుకునే ప్రయత్నంలో వున్నాయి.
ఉదయం వాతవరణంలో ఎంత ప్రశాంతత వుందో గమనిస్తున్నాను. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి