డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-129

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాక్సీ వరల్డ్ ట్రేడ్ సెంటర్ చేరింది. టాక్సీలు ఆగేచోట్ల అప్పుడే కృష్ణన్ ఎన్నింటికి వచ్చాడో పచార్లు చేస్తున్నాడు. నన్ను చూడంగానే అతని మొహంలో వెల్లివిరిసిన సంతోషం నన్ను ఆశ్చర్యపరిచింది. అతని కళ్ళల్లో ఒక విచిత్రమైన ఉత్సాహం కనిపించింది.
‘‘ఆ మొహం మాత్రం నేను ఎన్నటికీ మర్చిపోలేను’’. తేజా పెదిమలు వణికాయి. కృష్ణన్ జ్ఞాపకాలు బాగా కలవరపెడుతున్నాయి. తనని నిగ్రహించుకోవడానికి కొద్ది క్షణాలు ఆగిపోయింది. కొద్దిగా మంచినీళ్ళు తాగి మళ్లీ అంది.
కృష్ణన్ గబగబా టాక్సీ తలుపు తెరిచాడు. నేను దిగంగానే, నా పక్క సీటులో వున్న బాక్స్ అందుకున్నాడు, నేను వంగి తీసుకునేలోపలే!
‘రెడీ’ అన్నాడు నవ్వుతూ.
తల అడ్డంగా ఊగించాను. కాదన్నట్లు నవ్వాడు. ‘‘ఇది మరో చైల్డ్ బర్త్’’ అన్నాడు. పెద్దగా నవ్వాను. ఉష కోసం నేను చాలా కష్టపడాల్సి వచ్చిందని అతనికి తెలుసు.
‘‘నా బేబిని నీ ప్రాజెక్టుతో పోల్చకు. నా బేబి చాలా బ్యూటిఫుల్’’ అన్నాను.
‘‘అవునా! నా బేబి చాలా యూజ్‌ఫుల్’’ అన్నాడు.
నవ్వుకుంటూ లోపలకు వెళ్లాం.
లోపల క్రిందటివారమే పరిచయమయిన కుమార్ కనిపించాడు.
అతను కృష్ణన్ తమిళంలో ఏవో మాట్లాడేసుకున్నారు. ఇద్దరూ గుడ్‌లక్ చెప్పుకున్నారు.
ఎలివేటర్ ఎక్కాం. కృష్ణన్ అన్నాడు, కుమార్‌కి ఇవాళే మొదటిరోజట ఉద్యోగంలో చేరటానికి. సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు’’ అన్నాడు.
ఎలివేటర్ 84 ఫ్లోర్ చేరింది. మా ఆఫీసులు అన్నీ 94 అంతస్తులలో వున్నాయి. కాని కాన్ఫరెన్స్ రూమ్, బోర్డ్ రూమ్, ఇంకా కొన్ని 84 ఫ్లోర్‌లో వున్నాయి.
ఆ కాన్ఫరెన్స్ రూమ్ చాలా విశాలమయినది. పెద్ద విండోస్, మెరూన్ రంగు డ్రేప్స్, చాలా విశాలమయిన టేబుల్ చుట్టూ డార్క్ మెరూన్‌లో లెదర్ ఛైర్స్.
మేము ఎలివేటర్‌లోంచి బయటకు వచ్చేవేళకు, మా సెక్రటరీ బార్బరా కూడా పక్క ఎలివేటర్‌లోంచి బయటకు వచ్చింది. అందరం ఛీర్‌ఫుల్‌గా గుడ్‌మార్నింగ్ చెప్పుకున్నాం.
ఆ రోజు నిజంగా, వాతావరణం చాలా అందంగా ఆనందంగా అనిపిస్తోంది. చక్కని సూర్యరశ్మి- ఎక్కువగా చలి ఆవరించని గాలి. ఎత్తయిన భవనంలోంచి చూస్తుంటే ప్రపంచం అంతా మనకందుబాటులో వుందనిపిస్తోంది.
బార్బరా ఆ ముందురోజు కృష్ణన్ చెప్పిన ఎజెండా అంతా కాపీలు చేసుకు వచ్చింది. బ్రేక్‌ఫాస్ట్ అంతా టైముకు డెలివరీ చేస్తారో లేదా అని మళ్లీ ఫోన్ చేసి కనుక్కుంది. అందరి టేబుల్స్ ముందు ఆరోజు మా ప్రెజెంటేషన్ గురించిన పేపరు. పక్కనే ఒక వాటర్ బాటిల్, రాసుకునేందుకు పెన్, పేడ్ అన్నీ ఏర్పాటు చేస్తోంది.
కృష్ణన్ తన కంప్యూటర్, ప్రాజెక్టు చెయ్యబోయే స్క్రీన్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో అని చూసుకుంటున్నాడు.
నేను తెచ్చిన బాక్స్‌లోంచి నా కంప్యూటర్ నా నోట్స్ అన్ని తీసుకుని, పోడియమ్ మీద వుంచాడు. బార్బరా, కృష్ణన్ చకచకా అన్నీ చూసుకుపోతున్నారు. నేను మాత్రం బయటకు చూస్తూ ఆ రోజు మాట్లాడాల్సిన విషయాన్ని మనసులోనే ఆలోచిస్తున్నాను.
‘‘రెడీ! ఒకసారి చూసుకో’’ అన్నాడు కృష్ణన్.
వెళ్లి పోడియమ్ ముందు నుంచున్నాను. ఇంకొకసారి మళ్లీ మనం రివ్వూ చేద్దామా! అడిగాను కృష్ణన్‌ని.
‘‘నో’’ స్పష్టంగా అన్నాడు. మళ్లీ ఇంకోసారి విన్నావంటే నాకే విసుగు వచ్చేస్తుందేమో! నవ్వాను.
గదంతా బ్రూ కాఫీ వాసనలతో ఎంతో ఆహ్లాదంగా వుంది.
బార్బరా రెండు కప్స్‌లో కాఫీ తెచ్చి నాకు, కృష్ణన్‌కు ఇచ్చింది.
‘‘యూ లుక్ స్టన్నింగ్ ఇన్ యువర్ న్యూ స్యూట్’’ అంది బార్బరా!
కృష్ణన్ బార్బరా వంక చూచాడు. ‘‘నీకెలా తెలుసు. అది న్యూ స్యూట్ అని?’’ అన్నాడు.
తేజాని యిలా ఎన్నిసార్లు చూశాను అన్నాడు.
బార్బరా నా కళ్ళల్లోకి చూసింది. ‘‘ఈ మగజాతి వుందే! అని తల అడ్డంగా వూపింది. వీళ్లకు ఒక్కటి కూడా గమనించడం రాదు’’ అంది తన పనిలో నిమగ్నమవుతూ!
బార్బరా మా ఇద్దరికంటే చాలా పెద్దది. మా కంపెనీలో మా ఇద్దరికంటే చాలా ముందునుంచి పనిచేస్తోంది. కంపెనీ పద్ధతులు తెలుసుకోవాలంటే, వైస్ ప్రెసిడెంట్ దగ్గరనుంచి బార్బరాతో మాట్లాడుతాడు.
లాయల్ సెక్రటరీ, ఒక పెద్ద వరం ఏ పెద్ద వ్యాపారవేత్తకయినా!
నేను కృష్ణన్, ఒకరికి ఒకరు ఎదురుగా నుంచుని కాఫీ తాగుతున్నాం. మా ఆతృతకొద్దీ బాగా త్వరగా వచ్చేశాం. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక కూడా ఇంకా అరగంట టైముంది.
మా మీటింగ్ 9.00 గంటలకు కాని స్టార్ట్ అవదు.
నాకు లోపల కొంచెం నర్వస్‌గా వుంది. కొద్దిసేపట్లో ఆ రూమ్‌లో చేరేవారంతా, వ్యాపార రంగంలో చాలా పెద్దవారు. వారి ముందు మేమిద్దరం వయస్సులో, అనుభవంలో చాలా చిన్నవాళ్ళం. కాని మా కంపెనీలో మా ఇద్దరికి చాలా పెద్ద బాక్‌అప్ వుంది. అందుకే కొంచెం నెర్వస్‌నెస్, ఎక్కడ పొరపాటు చేస్తానా అని. కాని కృష్ణన్‌కి పూర్తి నమ్మకం వుంది నామీద.
ఫ్రెష్ కాఫీ రుచిని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇద్దరం.
‘వామ్’ మా బిల్డింగ్ ఒక్కసారి అదిరిపోయింది. కృష్ణన్ చేతిలో వున్న కాఫీ వలికిపోయింది. అతని షర్ట్, కోట్ అన్నిటిమీదా ఆ కాఫీ వేడి, అతనికి ఛాతికి కూడా తగిలిందనుకుంటాను.
ఒక్కసారి కృష్ణన్ కోపంతో గట్టిగా అరిచాడు ‘షిట్’ అంటూ.
ముఖ్యమైన మీటింగ్‌కి కాఫీ వలికిపోయిన బట్టలు.
ఏమయిందో తెలియలేదు, భూకంపం అనుకున్నాం మొదటిసారిగా.
దాదాపు బార్ల పడిపోయి నిగ్రహించుకున్న బార్బరా అంది ‘బాంబులు కాదు కదా!’’ అంది. 1993లో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో బాంబులు పేలినప్పుడు కూడా బార్బరా అక్కడే పనిచేస్తోంది.
ఏమిటయ్యి వుంటుందనుకుంటూ కృష్ణన్ తలుపు తీసుకు బయటకు వెళ్లాడు.-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి