డైలీ సీరియల్

ట్విన్ టవర్స్-130

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను మాత్రం కిటికీలోంచి బయటకు చూస్తూ నుండిపోయాను.
పైన అంతస్తులలోంచి పేపర్స్ స్నొస్టారమ్‌లో పడుతున్నాయి. అసలు ఏం జరుగుతుందో ఏ మాత్రం అర్థంకాని నేను అయోమయంగా కిటికీలోంచి చూస్తూ ఉండిపోయాను. భూకంపం వస్తే పాటించాల్సిన పద్ధతులు గాని, ఆ రూమ్‌లోంచి బయటకు వెళ్లాలన్న విషయం కాని నాకు తోచలేదు. దాదాపు స్థాణువులా నిలబడిపోయాను.
బయటకు వెళ్లిన కృష్ణన్ చాలా ఆందోళనగా లోపలకు వచ్చాడు. మరకలు పడ్డ షర్ట్, కాని ముందున్న కాన్ఫరెన్స్ అతని మనసులో ఉన్నట్లు లేవు.
పెద్ద పెద్ద అంగలతో నా దగ్గరకు పరుగుపెడుతున్నట్లే వచ్చాడు. నా జబ్బ గట్టిగా పట్టుకుని, నాకు ఏ మాత్రం వివరించి చెప్పకుండా, ‘పద బిల్డింగ్‌లోంచి మనం బయటకు వెళ్లిపోవాలి’ అన్నాడు కంగారుగా.
నన్ను దాదాపు లాక్కువెడుతున్నట్లే ముందుకు కదిలాడు.
ఆగు ఆగు అంటూ నా హేండ్‌బాగ్ భుజాన వేసుకున్నాను.
బిల్డింగ్‌ని విమానం గుద్దిందట- పై అంతస్థుల్లో అన్నాడు. బార్బరా చెయ్యి కూడా పుచ్చుకుని ముగ్గురం కాన్ఫురెన్స్ హాలులోంచి బయటపడ్డాం.
అప్పటికే కారిడార్స్‌లో చాలామంది చేరిపోయారు. ఏం చెయ్యాలా అని తర్జన భర్జనలు జరుగుతున్నాయి.
దాదాపు అందరూ రాబోయే సూచనల కోసం ఎదురుచూస్తున్నారు.
విమానం ఎలా గుద్దింది. అంత క్రిందుగా విమానాన్ని ఎలా పోనిస్తున్నారు? ఒకరి ప్రశ్న.
‘‘ఏదో మెకానికల్ ట్రబుల్ వచ్చి వుంటుంది’’ మరికరి ఆలోచన.
పైలట్‌కి ఏ హార్ట్ అటాక్ అయినా వచ్చిందేమో!
ఆర్ యూ ష్యూర్ దిస్ రుూజ్ ఎ ప్లేన్, నాట్ ఎ బాంబ్ అటాక్. మరొకరి ఉద్దేశం కొద్ది సంవత్సరాల క్రితం బాంబు బ్లాస్టింగ్ ప్రత్యక్షంగా అనుభవించినవారు.
చాలామంది ఇళ్లకు పోన్ చేస్తున్నారు. మరికొందరు వాళ్ల బాస్‌లను కాంటాక్ట్ చెయ్యాలని చూస్తున్నారు.
బయటకు కనిపించే పెద్ద విండోలలోంచి అప్పుడే పొగ తెలుస్తోంది. ఫైర్ అలారమ్స్ మోగుతూనే వున్నాయి. ఎవరి దగ్గిరనుంచి ఎటువంటి ఆర్డర్స్ రావడంలేదు.
కాని కృష్ణన్‌కి ఎవరికోసం ఆగాలని లేదు. అదే అన్నాడు. నాతో బార్బరాతో ఇద్దరం వౌనంగా అతన్ని అనుసరించాం. అదొక అనూహ్యమైన సందర్భం. ఎవరు ఎవరిని గైడ్ చెయ్యాలో ఎవరికి తెలియదు. ఏది రైటో ఎవరికీ తెలియదు. అందరికీ తెలిసింది ఒక్కటే- తామందరూ చాలా తీవ్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నామని. ముందుకు వేసే ప్రతి అడుగు చాలా ముఖ్యమైనదని తెలుసు.
చాలా ఎత్తుగా ఉన్నాం. ఎలివేటర్ వాడితే అది ఏ క్షణంలోనైనా ఆగిపోవచ్చు.
మెట్లవైపు నడిచాం. దిగడం మొదలుపెట్టాం. అప్పుడే చాలామంది అక్కడకు చేరారు. రెండు అంతస్తులు దిగేసరికి, ఆ ఫ్లోర్ అంతా పొగ వుంది. చాలామంది తలుపులు మూసేస్తున్నారు. పేపర్స్ తడిపి తలుపుల అడుగున పెట్టాలని చూస్తున్నారు. అందరూ పొగ ఎగబీల్చడం అయిపోతుందని భయపడుతున్నారు.
చాలామందికి మానసికంగా ఏవేవో అనిపిస్తున్నాయి. కొందరు బిల్డింగ్ అన్‌స్టేబుల్‌గా ఉందన్నారు.
అది మా జీవితాలకు ఆఖరు రోజనే ఆలోచన మనసంతా ఆక్రమించుకుంది. దాదాపు అక్కడున్నవాళ్లంతా అదే ఆలోచనలో వుండి వుంటారు. ఎవరి ముఖం వంక చూచినా భయభ్రాంతులు. బిల్డింగ్‌ని కప్పేసిన పొగలాగానే ఆవరించాయి.
అంతలో పైన సీలింగ్‌మీద ఒక భయంకరమైన చప్పుడు వినిపించింది. కాని ఎవ్వరికీ మరొక విమానం మరో బిల్డింగ్‌ని గుద్దిందని కాని, వందలమంది క్షణాలమీద మసి అయిపోయారని కాని ఎవ్వరికీ తెలియదు.
పైనుంచి మండుకొస్తున్న రుూ బిల్డింగ్ ఎంతసేపు నిలబడగలదో ఎవరికీ తెలియదు.
పొగ కమ్ముకువస్తోంది. దిగుతున్న మెట్లమీంచి, మరో వైపున్న మెట్లమీదకు లాక్కెళ్లాడు కృష్ణన్.
ఎందుకో ‘బి’ స్టెయిర్స్‌మీద పొగ తక్కువ అనుకున్నాడు కృష్ణన్. దిగుతున్నాం. ఒక్కొక్క మెట్టు తీసే అడుగు వేసే అడుగు. మనసు మొద్దుబారిపోయింది. భయం పూర్తిగా ఆవరించింది. ఆ బిల్డింగ్ ఏ క్షణాన్నైనా కూలిపోవచ్చు.
దిగే ప్రతి అంతస్తులోనూ కొత్తవాళ్లే వస్తున్నారు. ఒక అంతస్తు దిగంగానే, మెట్ల తలుపు ఫోర్సుగా తెరుచుకుపోయింది. ఎదురుగా సరాసరి, మరో విమానం గుద్దుకున్న టవర్‌లో నల్లటి హోల్‌తో కనిపించింది. మంటలలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. నల్లటి పొగ దిట్టంగా అలుముకుంటోంది.’’.
తేజా ఆగిపోయింది. పెదిమలు వణకసాగాయి. చాలా బలవంతంమీద నిగ్రహించుకుని, మళ్లీ మొదలుపెట్టింది. కంఠం వణుకుతోంది.
మనుషులు ఎదుటి టవర్ నుండి దూకుతున్నారు. పైన మంటలు, క్రింద కొన్ని వేల అడుగుల దూరం-
దూకి చచ్చిపోవడమా! ఆగి మాడిపోవడమా! ఓ గాడ్! ఎందుకిలా చేస్తున్నావు.
‘తెల్లటి షర్ట్ ఎర్రటి టై’ వున్న ఒక వ్యక్తి దూకడం చూశాను. ఒక్కసారి కడుపులో ఎవరో కెలికినట్లయిపోయింది.
అప్రయత్నంగా క్రిందకి చూశాను. ఏమీ కనిపించలేదు. ఎర్రటి రక్తం మడుగు తప్ప. తల తిరగడం మొదలయింది. పెదిమలు ఎండిపోతున్నాయి. కళ్లు పొగి మండిపోతున్నాయి.
కృష్ణన్ ఒక్కసారి నా జబ్బ పట్టుకు గుంజాడు ‘అటు చూడకు’ అంటూ.
మళ్ల దిగడం మొదలుపెట్టాం. పక్క బిల్డింగ్‌లో 78వ ఫ్లోర్ పూర్తిగా దగ్ధమయిపోయింది.
ఆ క్షణంలో మానవత్వం అనేది అందరిని ఆవరించింది. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడానికి ఏ మాత్రం వెనుకంజ వేయడంలేదు. అంత భయంలోనూ కొద్దిమంది కొంచెం పరిసరాలను తేలిక పర్చాలని చూస్తున్నారు. ఎక్కడ చూచినా ఆడవారి చెప్పులే! హైహీల్స్‌తో మెట్లు దిగలేక ఎక్కడికక్కడే వదిలేసి దిగడం మొదలుపెట్టారు. రుూ గడబిడ తగ్గంగానే నేను షూ స్టోర్ తెరుస్తానన్నాడు ఒకతను, బ్రీఫ్‌కేసులు కూడా కలెక్ట్ చేయ్యి అన్నాడు మరొకడు.
35వ ఫ్లోర్‌కి దిగాం. మా పక్కనుండి పోలీసులు, ఫైర్ ఫైటర్స్ పైఅంతస్తుల్లోకి వెళ్లిపోతున్నారు. -ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి