డైలీ సీరియల్

యమహాపురి 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మరి ఆ చూపులు..?’’’
రేవతి అతడివంక అదోలా చూసి, ‘‘పెళ్లయి కాపురం చేస్తున్న మగాడు మీరు. ఇంకా టెన్తు చదువుతున్న తులసి కాస్త మోడ్రన్‌గా డ్రెస్సయ్యేసరికి- వయసులో ఉన్న ఆడపిల్లలా కనిపించింది మీకు. అవీ మీ చూపులు. ఆ చూపులకి తన చూపుల్లో ఇష్టం కనబడ్డంలో ఆశ్చర్యమేముంది? ప్రతి మగాడికీ ఇదే జబ్బు. ప్రతి ఆడదీ తన్ని చూసి మహా ఇష్టపడిపోతుందని!’’ ఈసడించింది రేవతి.
‘‘ఇదిగో ననే్నమన్నా అను- నా శీలాన్ని మాత్రం శంకించకు. అగ్ని- అగ్నిని నేను..’’ అన్నాడు సుందరం.
‘‘మీరు నిజంగా అగ్నే అయితే తులసి మిమ్మల్నదోలా చూడగానే- వెంటనే నాకు చెప్పేవారు. నేను వెళ్లి మందలించడమో ఏదో చేసేదాన్ని. కానీ మీరా చూపులు ఎంజాయ్ చేశారు, ఔనా?’’ అంది రేవతి.
‘‘అదిగో, అలా లేని పోని పెద్దరికం తీసుకుని గొడవల్లో చిక్కుకుంటావనే- ఆ పిల్ల విషయం నీకు చెప్పలేదు. నువ్వడిగితే ఆ పిల్లేం చేసేదీ- అంకులలాగన్నాడా అని ఆశ్చర్యం నటించేది. తనకలాంటి ఉద్దేశ్యమే లేదని దబాయించేది.
ఏదో దురుద్దేశ్యంతో నేనలాంటి పుకారు పుట్టించానని నెపం నామీదకి తోసేది. నీమీదా నామీదా తన అమ్మా నాన్నలకి ఫిర్యాదు చేసేది. ఇంత చిన్న వయసులోనే ఎవడితోనో లేచిపోయిన జాణ ఆరోపణలతో మనం నలుగురిలో తలెత్తుకోలేకుండా చెయ్యలేదా? అందుకే- విషయం నీదాకా రానీలేదు. నేనే పొరబడుతున్నానని అనుకుంటే సరిపోదా అనుకున్నాను’’ అన్నాడు సుందరం.
రేవతి నిట్టూర్చి, ‘‘నేనంత దూరం ఆలోచించలేదు. కానీ ఎందుకో మీకు తలసిమీద నాకున్న సదభిప్రాయం లేదు’’ అంది.
‘‘మీ ఆడాళ్లకిలాగే మా మగాళ్లకీ ఓ సర్కిలుంది. మీ సర్కిల్లో మా మగాళ్ల గురించి చెప్పుకున్నట్లే మా సర్కిల్లో మీ ఆడాళ్ల గురించీ చెప్పుకుంటాం. వాటిలో మీతో పంచుకోతగ్గవి పంచుకుంటాం. మగబుద్ధికి మాత్రమే పరిమితమైనవి కొన్నుంటాయి. అవి పెళ్లాలతో కూడా షేర్ చేసుకోం’’ అని ఆగి, ‘‘అవన్నీ ఇపుడెందుకులే కానీ- తులసికి మా సర్కిల్లో గౌరవ స్థానం లేదు. ఏదో రోజున ఆ పిల్ల ఎవడితోనో లేచిపోవడం ఖాయం అని ఒకసారి ఎవరో అన్నారు కూడా’’ అన్నాడు సుందరం.
రేవతి తెల్లబోయింది. ఆ కాంప్లెక్సులో ఆడాళ్ల సర్కిల్లో ఆమె కూడా ఉంది. అక్కడ మగాళ్ల గురించి ఏం మాట్లాడుకుంటారో ఆమెకి తెలుసు. భర్త మగాళ్ల సర్కిల్ గురించి చెప్పగానే ఆ విషయం స్ఫురించి, ఆమెకి సిగ్గనిపించింది కూడా. అందుకే మా ఆడాళ్ల గురించి మీరేం మాట్లాడుకుంటారని భర్తని నిలదియ్యలేదామె.
‘‘అంటే తులసి ఇలా చేస్తుందని మీకెప్పుడో తెలుసు. మరి ఓసారి నరసింహంగారిని హెచ్చరించాల్సింది. ఇప్పుడు చూడండి. ఘోరం జరిగిపోయింది. వాళ్లిక నలుగురిలో తలెత్తుకుని తిరగలేరు’’ బాధగా అంది రేవతి.
ఆమె నిజంగా తులసి గురించి బాధపడుతోందని సుందరానికి అర్థమైంది.
‘‘రే అమాయకురాలు’’ అనుకున్నాడు మనసులో. ఆమె వంక సానునయంగా చూసి, ‘‘కుక్క చేసే పని గాడిద చెయ్యకూడదని పెద్దలు చెబుతారు. అదే నేను పాటించాను. నువ్వూ పాటించాలి’’ అన్నాడు.
రేవతికి ఆ మాట అంత తృప్తికరంగా అనిపించలేదని గ్రహించేక, ‘‘ఒక్క విషయం గుర్తుంచుకో రే! పిల్లల బాధ్యత తల్లిదండ్రులది. వాళ్లు కోరినదివ్వడంతో ఆ బాధ్యత అయిపోదు. బయట వాళ్లేం చేస్తున్నారూ, ఎలా ఉంటున్నారూ- అని వెయ్యి కళ్లతో కనిపెట్టాలి. తప్పు చేస్తున్నారనిపిస్తే హెచ్చరించాలి. అలా కాక- వాళ్ల మానాన వాళ్లని వదిలెయ్యాలనుకుంటే- అప్పుడు పిల్లలేం చేసినా ఆమోదించాలి. తులసి, ఆ క్లీనరు కుర్రాడు సరసాలాడుకుంటారని బయట చాలామందికి తెలుసు. అమ్మా నాన్నలు తెలుసుకోవద్దా?’’ అన్నాడు సుందరం.
అతడి మాటలు జీర్ణించుకుందుకు రేవతికి కాసేపు పట్టింది. తర్వాత నెమ్మదిగా, ‘‘మీరెన్ని చెప్పండి, తులసి తప్పు చేస్తున్నదని తెలిసినప్పుడు హెచ్చరించకపోవడం మన తప్పు కూడా. ఏమైతేనేం- జరగాల్సింది జరిగిపోయింది. మీరిప్పుడు ఓ పొరుగువాడిలా కాక- పోలీసుగా ఈ వ్యవహారం చేపట్టి తులసిని తెచ్చి నరసింహంగారికి అప్పగించండి’’ అంది.
‘‘పిల్లల విషయంలో మొదటి పోలీసులు తల్లిదండ్రులు. ఆ తర్వాతనే మాలాంటి పోలీసులు రంగంలోకి దిగుతారు. నరసింహం దంపతులు వాళ్ల డ్యూటీ వాళ్లు సక్రమంగా చెయ్యలేదు. నువ్వెన్ని చెప్పు- అలాంటివాళ్లకి నేను సాయపడలేను’’ అన్నాడు సుందరం.
‘‘వాళ్లకి సాయపడొద్దు. కానీ పోలీసుగా మీకూ ఓ బాధ్యతుంది. తులసి మైనరు. మైనరు లేచిపోయినా, మైనర్ని లేవదీసుకుపోయినా- చట్టం ప్రకారం తప్పు తులసిది కాదు. ఒక పోలీసుగా ఒక మైనరుని రక్షించే బాధ్యత మీరు తీసుకోవాలి. ఒకవేళ మీకిష్టం లేకపోయినా- నా కోసం ఈ బాధ్యత తీసుకోవాలి. ఇందులో నా ఇంట్రస్టేమిటీ అనుకుంటున్నారా- తులసిని నా మనిషని నేననుకుంటున్నా’’ అంది రేవతి.
సుందరం ఇంకేమీ అనలేకపోయాడు. టైము చూసుకుని లేచి నిలబడ్డాడు.
అతడికి ఆఫీసుకి వెడతాడని రేవతి గ్రహించింది. ఆమె కూడా కుర్చీలోంచి లేచింది.
6
కుర్చీలో వెనక్కి జారగిలబడి చేత్తో ఆ పేపర్ కటింగ్ పట్టుకుని పరీక్షగా చూస్తున్నాడు ఇన్‌స్పెక్టర్ శ్రీకర్.
జగదానందస్వామి, యోగి, మరో ఐదుగురు ఉన్నారా కటింగ్‌లో ఉన్న ఫొటోలో.
ఎవరీ జగదానందస్వామి? ఆయన నిజంగా సాధువా లేక మాఫియా లీడరా?
ఆయన ఇంతవరకూ ఏ వివాదంలోనూ ఇరుక్కోలేదు. కొందరు సాధువులమీద ఉన్నట్లు ఆయనపై అభియోగాలు ఏమీ లేవు. గతంలో ముమ్మిడివరంలో బాలయోగి దర్శనానికిలా, ఇప్పటికీ హైదరాబాదులో ఏటా జూన్‌లో ఇచ్చే చేప మందు కోసంలా- జనం ఆయన దీవెన కోసం ఎగబడతారు.
దీవెనను ఆయన తన పేరిట కాక- దేవుడి పేరిట అందిస్తాడు. ఆ దీవెనలో విశేషమేమిటి? అది మాఫియా తరఫున అందుతున్న కోడ్ కానీ కాదు కదా! అదే నిజమైతే ఆ మాఫియా- జాతీయమా, అంతర్జాతీయమా?
ఆయన దీవెన పొందిన యోగి అనే యువకుడు తనని కలుసుకున్నాడు. తన గురించి ఓ ప్రేమ కథ చెప్పాడు.

ఇంకా ఉంది

వసుంధర