డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ- 28

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆమెకు పెళ్లి కాబోతోందా? ఎప్పుడు? అడిగాడు అజోడా ఏం తెలియనట్టు.
‘‘ముహూర్తం నిశ్చయం కాలేదనుకుంటా’’ అంది మాజా.
‘‘ఇంకేం! పిలిపించవచ్చు కదా! ముహూర్తం నిశ్చయం అయ్యేలోగా ఆమె మన భవంతి అలంకరణ పూర్తిచేయగలుగుతుంది’’.
తల్లిదండ్రులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అతడి మాటల వలన అతడు తమ దారిలోకి వస్తున్నాడనే ఆశ కలిగింది.
‘‘అలాగే! లీబోతో మాట్లాడాక నిర్ణయానికి రావడం వీలవుతుంది’’ అన్నాడు హనోడా. అజోడా తన గదికి వెళ్లాడు.
హనోడా భార్యతో ‘‘మోరీని కొద్దిరోజులు పనిలో పెట్టుకుంటే ఫర్వాలేదనుకుంటా. వీడు ఇంటిలో ప్రేమాయణం ఎలాగూ జరపలేడు కదా! దాంతోబాటు అది బంకో సంబంధాన్ని స్వీకరించకపోయినా తిరస్కరించలేదే. మనం ఒత్తిడి చేస్తే బంకోను చేసుకుంటుందేమో!’’ అన్నాడు.
‘‘మన అమ్మాయి సంతోషం కూడా ముఖ్యమే. మీరన్నట్టు మనింటిలో వాళ్లు ప్రేమ వ్యవహారం ఎలాగూ జరపలేరు. అందులోనూ మనం ఓ కన్ను వేసి ఉంచవచ్చు.’’
‘‘అందుకే లీబతో మాట్లాడి మోరీని పనిలోకి రప్పిస్తాను’’.
‘‘మోరీ పని చేపట్టిందంటే మన భవంతిని చూడడానికి రెండు కళ్ళు చాలవు. గోదా మురిసిపోతుంది.
ఆ రోజు మాగీర్ ఇంటిలో అజోడా మోరీని కలిశాడు.’’
‘‘ఏవండీ, మీరంత ఉల్లాసంగా ఉన్నారు? ఏదైనా శుభవార్తా?’’ అడిగింది మోరీ.
‘‘శుభవార్తే మోరీ. అక్క గోదా, బావా పిల్లలలు కొండమీద ఉత్సవానికి వస్తున్నారు.’’
‘‘మీ సంతోషమే నా సంతోషం.’’
‘‘నీకు తెలుసా?’’
‘‘ఆమె చక్కగా పాడుతుంది, నృత్యం చేస్తుంది. దాంతోబాటు పరిసరాలు శుభ్రంగా, కళాత్మకంగా ఉండాలని కోరుతుంది. మా భవంతి ఈమధ్య కాంతిహీనంగా మారింది. ఆమెకు అది నచ్చదన్నది నిజం. అందుకు నువ్వే భవంతిని బాగుచేయగలవనే భావన నాకే కాదు అమ్మా నాన్నలకు కూడా కలిగింది. ఇదివరకు నియమించిన వ్యక్తికి కళాదృష్టి లేదని నేనే మాన్పించా.’’
‘‘నన్ను మరల పిలుస్తారా ఏమిటి?’’
‘‘తప్పకుండా పిలుస్తారు. నువ్వు మా అక్కను దగ్గరగా చూడగలుగుతావు’’/
‘‘అది సరే కాని అంత రాద్ధాంతం అయాక నన్ను పిలుస్తారా అని?’’
‘‘తప్పకుండా పిలుస్తారు. నాన్నగారు మీ నాన్నకి ఇవాళో రేపో నిన్ను పంపమని కబురు చేయవచ్చు.
‘‘మీరు రమ్మంటే రాక తప్పుతుందా, దొరగారు?’’
‘‘దీంట్లో నాకు మన ప్రయోజనం కనబడుతోంది. మన వివాహానికి అమ్మా నాన్నలని ఒప్పించమని నేను అక్కను వేడుకుంటా?’’
‘‘ఆమె ఒప్పుకుంటుందా?’’
‘‘ఆమెకు నేనంటే ప్రాణం. రెండోది నీ అపురూప సౌందర్యం, నృత్యగానం చూసిందంటే నాలాగే ఆమె కూడా నీకు అమ్ముడుపోతుందేమో’’
‘‘చాల్లెండి, మీ కబుర్లు. ఆమె స్ర్తి, మీరు పురుషులు’’.
‘‘నేను పురుషుడిని అని నువ్వు ఎలా చెప్పగలవు? మన పెళ్లి కాందే’’ అన్నాడు అజోడా పరాచింగా.
‘‘్ఛ పోండి మీరూ మీ కొంటె మాటలూను’’ అని ఆమె అతడిని జడతో బుగ్గమీద సుతారంగా కొట్టింది.
‘‘నన్ను కొట్టడానికేనా ఇవాళ జడ వేసుకొచ్చావు?’’’ అని ఆమె బుగ్గల్ని పుణికి ఇలా అన్నాడు.
‘‘సరే, నేను ఆమెను ఒత్తిడి చేస్తే ఆమె వాళ్ళను ఒప్పిచగలదని నాకు ఆశ ఉంది. ఆ ప్రయత్నం కూడా చేయడంలో ఏ హానీ లేదు కదా!
‘‘సరే, అలాగే దొరగారు. మీరెలా చెబితే అలా చేస్తా. మీ చేతిలో కీలుబొమ్మని కదా!’’
‘‘కీలుబొమ్మ కాదు, అపరంజి బొమ్మ’’.
‘‘మీ ఇల్లు బంగారంగారు.. నన్ను ఊపిరి తీసుకోనీండి..’’ అంది ఆమె అతడి కబంధ హస్తాలనుంచి వేరవుతూ.
మర్నాడు కబురు అందగానే లీబో కూతురు మోరీకి కబురు చెప్పి ‘‘ఇన్నాళ్ళ సెలవులకి కూడా నీకు జీతం ఇస్తారట. నువ్వు భవంతని వాళ్లకు నచ్చేలా ముస్తాబు చేస్తే పారితోషికం కూడా ఇవ్వవచ్చు’’ అన్నాడు.
‘‘ఆ పని అయిపోయాక నాకు శాశ్వత సెలవే కదా!’’
‘‘వాళ్ళు యజమానులు. వాళ్ళ సేవ చేయడం మన విధి. వాళ్ళు ఎన్నడూ మనకు అన్యాయం చేయరని నాకు నమ్మకం ఉంది’’
‘‘మరి నృత్యగాన పాఠశాలలో నా ఉద్యోగం మాటేమిటి? నాకు అది మానాలని లేదు, నాన్నా. నేను వాళ్ళింటిలో పని చేస్తూ సాయంకాలం అక్కడ నృత్యగానం నేర్పుతాను.
‘‘వారితో మాట్లాడు తల్లీ, వారేమంటారో అలా చేయి’’ అన్నాడు లీబో.
‘‘ఔనమ్మా. మనం వాళ్ళ ఉప్పుతింటున్నాం. అందుకు వాళ్ళ ఆదేశానుసారం మనం నడవాలి’’ అంది మోరీ తల్లి.
ఆ రోజే భవంతికి వెళ్లింది మోరీ. హనోడా లేడు. కానీ అజోడా, మాజా ఆమెకోసం ఎదురుచూస్తున్నారు. ‘‘రా మోరీ రా. బాగున్నావు కదా’’ అని మాజా పలకరించింది.
‘‘మీ చలవ వలన బాగున్నా అమ్మగారు’’ అంటూ ఇద్దరికీ వంగి దండం పెట్టింది.
‘‘అమ్మాయిగారు, అల్లుడుగారు, పిల్లలు వస్తున్నారని తెలిసి చాలా సంతోషించా అమ్మగారు. భవంతి త్వరలో పిల్లల కేరింతలతో మారుమోగుతూ కళకళాడుతుంది’’
‘‘ఔను మోరీ. వాళ్ళకోసం కళ్ళల్లో వత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్నాం. మా అక్కను నువ్వు చూశావా?’’ అని అజోడా అడిగాడు.
‘‘రెండేళ్ళ క్రితం కొండమీద ఉత్సవంలో చూశా చిన్నయ్యగారూ. అంతమంది జనంలో, చంటిబాబుగారిని ఎత్తుకుని ఉన్నారు’’.

- ఇంకా ఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు