డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆమెకు మన భవంతి శుభ్రంగా ఉంటేనే సరిపోదు. అలంకరణలతో కళాఖండంగా వెలుగొందాలి. ఎంత డబ్బైనా ఖర్చుచేద్దాం. కొత్త శిల్పాలు, తెరలు, ఆసనాలు, శయ్యలు కొందాం’’.
‘‘చిత్రం అలాగే కానీ నాదో మనవి. ఓ చోట సంగీత నాట్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను. మీ ఆదేశం ఉంటే ఇక్కడ పని ముగించుకుని మధ్యాహ్నం అక్కడ కొద్దిసేపు శిక్షణ ఇస్తూంటా’’.
‘‘నువ్వు పని ముగించాక అక్కడికి వెళితే మాకేల ఇబ్బంది అవుతుంది? అలాగే వెళ్ళు’’ అన్నాడు అజోడా.
‘‘సరే, మోరీ. రేపటినుంచి ఉదయం పూజలో పాట పాడడంతోపాటు పని ప్రారంభించు’’ అంది మాజా.
మర్నాడు పూజ వేళకు వచ్చింది మోరీ. పూజలో పాల్గొన్నాక ‘‘అమ్మగారు, నిన్న భవంతి అంతా తిరిగి చూశా. వెల్ల బాగా వేయలేదు. మళ్లా వేయవలసి ఉంటుంది’’ అంది మోరీ.
‘‘అలాగా! ఈ విషయం అబ్బాయిగారితో మాట్లాడు. వెల్ల విషయంలో వాడూ నసుగుతూనే ఉన్నాడు’’.
‘‘చిత్తం’’ అని అజోడా వద్దకు వచ్చింది. అజోడా గది బైట పంజరంలో రామచిలుకతో సంభాషిస్తున్నాడు. మోరీని చూసి గదిలోకి వచ్చి ఆసనంమీద కూచున్నాడు.
ఆమె దగ్గరకు వచ్చింది. అతడి మందస్వరంలో ‘‘ఇక్కడ నిన్ను నాతోబాటు కూచోమనలేను గదా! నువ్వు క్షమించాలి’’ అన్నాడు.
‘‘మిమ్మల్ని క్షమించదగ్గదానినా నేను? సాయంత్రం మాగీర్ గారింటిలో ఆ ముచ్చట తీర్చుకుంటాగా’’ అంది మోరీ నెమ్మదిగా.
‘‘చిన్నయ్యగారూ, భవంతిలో వెల్ల బాగా వేయలేదని అమ్మగారికి విన్నవించా. వారు ఈ విషయం మీతో మాట్లాడమన్నారు’’ అంది సామాన్య స్వరంతో.
‘‘ఔను. అది నిజమని నాకూ అనిపించింది. ఈ విషయం నువ్వు వచ్చాక తేల్చాలని అనుకున్నా, నీ సలహా ఏమిటి?’’
‘‘వెల్ల మరోసారి వేస్తే బాగుంటుంది. ఈసారి చిక్కగా వేయించాలని నా సలహా’’.
అజోడా మందహాసం చేసి ‘‘సరే, మరోసారి వెల్ల వేయిద్దాం. నువ్వే వెల్ల చిక్కదనం గట్రా చూడు’’ అని నెమ్మదిగా ‘‘మరి ఈ ఇంటిలో ఉండేది నువ్వు కూడా కదా! నీ ఇష్టానుగుణంగా వెల్ల వేయించుకో’’ అన్నాడు.
‘‘మీ ఆదేశానుసారమే చేయిస్తా చిన్నయ్యగారూ’’
అజోడా నెమ్మదిగా ‘‘వెల్లే కాదు, గోడలపై చిత్రాలు, అలంకరణ సామాన్లు, నక్షత్రాలు అన్నీ నీ ఇష్టానుసారం జరగనీ’’ అన్నాడు.
‘‘చిత్తం’’
మోరీ వెల్ల వేసే ముఖ్య మేస్ర్తిని పిలిపించింది. భవంతిలో వెల్ల ఎక్కడ ఏ రంగులో ఉండాలో నేను చెప్పినట్టు వేయించండి. వెల్ల చిక్కదనం నాకు చూపెటి ట వేయాలి’’ అంది.
ఆ తర్వాత ఓ చిత్రకారుడిని పిలిపించి ‘‘గోడలమీద అక్కడక్కడ నేను వేసి ఇచ్చిన చిత్రాలను వివిధ రంగులలో చిత్రించాలి. ఎక్కడా పొరపాటు జరగకూడదు’’ అని ఆదేశించింది.
తర్వాత అజోడాని ‘‘చిన్నయ్యగారూ, కొత్త శిల్పాలు, ప్రదర్శన కళావస్తువులు తయారుచేయించాలి. ఎటువంటివి కొనాలో సెలవిస్తారా?’’ అని అడిగింది.
‘‘నీకు నచ్చినవి కొను. నా వద్ద డబ్బు తీసుకో.’’
‘‘ప్రవేశద్వారంగుండా లోనికి రాగానే ఓ ఎతె్తైన రాతి పీఠంపై పెద్ద కొమ్ములు, పలు ముడతలతో దట్టమైన గంగడోలుగల వృషభం రాతిబొమ్మని పెట్టిద్దామనుకుంటున్నా. ఓ శిల్పి వద్ద అటువంటి బొమ్మని చూశా. నాకు బాగా నచ్చింది. నా ఆలోచన బాగుందంటారా?’’
‘‘్భష్.. చాలా బాగుంది. అలాగే మరోపక్క ఎత్తుపీఠంపై ఒక నర్తకి కంచుబొమ్మ ఉంచు. చాలా కళాత్మకంగా ఉంటుంది’’.
‘‘ఔను, అదీ బాగుంటుంది చిన్నయ్యగారు. శునకం, ఎడ్లబండి, నౌకలాంటి ఎర్రమట్టి బొమ్మలు కూడా కొందామని అనుకుంటున్నా’’.
‘‘శభాష్! అందుకే కదా నీకు ఈ పని అప్పజెప్పింది. అన్నట్టు నా తరఫున నువ్వు చక్కని పతకంగల రంగు రంగుల పూసల హారం కొనుక్కో’’.
‘‘‘నావద్ద బోలెడన్ని అటువంటి హారాలు ఉన్నాయి. వేసుకుంటూంటా చిన్నయ్యగారూ’’ అని నెమ్మదిగా ‘వాటిని మీరు చూడకపోతే నేనేం చేయను?’ అంది.
అతడు రహస్యంగా ‘‘సూర్యచంద్రులను మరిపింపజేసే నీ ముఖ సౌందర్యం ముందు వెలవెలబోయే ఆ హారాలను ఎవడు గమనిస్తాడు’’ అన్నాడు అతడు ఆమె దగ్గరకు రాబోతూ.
ఆమె సిగ్గు మిళితమైన చిరుకోపంతో అతణ్ణి సుతారంగా తోసి ‘‘ఇక్కడ మీరు దూరంగానే ఉండాలి. ఎవరైనా చూస్తే కొంప ములుగుతుంది. అంటే నా ఉద్యోగం హాంఫట్’’ అంది గది బయటకు నడుస్తూ.
అసలు తాను మోరీని భవంతికి రప్పించింది ఆమెను అక్క చూడాలనే. అక్క స్వయంగా చెప్పుకోదగ్గ సౌందర్యవతి. తెల్లని మేలిమి బంగారు ఛాయ, తామర రేకులవంటి కళ్ళు, కెంపుల వంటి పెదవులు, తుమ్మెద రేకుల వంటి నల్లని కేశరాశి, ఎండాకాలం ఏరువంటి సన్నని నడుముతో కనుల పండువుగా వుంటుంది.
అజోడ బావ ఆమెను కొండమీద ఉత్సవంలో ఓసారి చూసి సమ్మోహితుడయాడట. హడప్పాలో ధనిక కుటుంబానికి చెందిన అతడు మొహంజోదడోలో ఓ నగర ప్రముఖుడి ఇంటికి చుట్టపు చూపుకు వచ్చాడు. అప్పుడు కొండమీద ఉత్సవం జరుగుతోంది. ఆ ఉత్సవానికి వచ్చి గోదాని చూశాడు.
అతడు ఆమె వివరాలు కనుక్కొని హడప్పా తిరిగి వెళ్ళాడు. ఆ చుట్టం ద్వారా గోదాని చేసుకుంటానని కబురు పంపాడు. గోదా తల్లిదండ్రులు ముందు దూరపు సంబంధం అని ఆసక్తి చూపలేదు. బావ మాత్రం పట్టు విడవలేదు. తర్వాత హనోడా మాజా అబ్బాయి అన్ని విధాలా గోదాకి తగినవాడని చేసుకున్నారు.
గోదాలో అన్నింటికంటే విశిష్టమైన గుణం సంగీతం అంటే చెవి కోసుకోవడం. చక్కగా పాడుతుంది కూడా. నృత్యం కూడా చేస్తుంది. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు