డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోరీ మిరుమిట్లుగొలిపే సౌందర్యాన్ని, గుణాలనీ చూశాక, హృదయాన్ని చిందులు వేయించే మధుర కంఠాన్ని విన్నాక, ముగ్ధ మనోహరమైన ఆమె నృత్యాన్ని తిలకించాక అక్క ప్రభావితం అవక తప్పదు.
అప్పుడు అక్కకు తన ఎదలోతుల్లో నెలకొన్న కోరికను వెల్లడించి అమ్మా నాన్నలను ఒప్పించమని వేడుకుంటాడు. తనంటే ఆమెకు వల్లమాలిన అభిమానం. తమ్ముడు మనసు చివుక్కుమంటే సహించలేదు. అమ్మ నాన్నలను కూడా ఆమె తప్పక ఒప్పిస్తుందని అతడి నమ్మకం. అమ్మా నాన్నలు ఆమె మాటను కాదనరు.
మోరీ మాగీర్ అక్కతో హనాడో భవంతిలో తాను చేస్తున్న పని గురించి వివరించి మధ్యాహ్నం పాఠశాలకు వస్తూంటాను అని చెప్పింది.
‘‘ఔను, మాగీర్‌తో అజోడాగారు కూడా ఈ విషయం చెప్పారుట, ఫర్వాలేదు మోరీ. మధ్యాహ్నమేరా. నువ్వు ఇక్కడకు వచ్చి విద్యార్థినులకు నృత్య పాఠాలు నేర్పడం ముఖ్యం అంది మాగీర్ అక్క.
ఆమె రోజూ హనోడా భవంతి వెల్లపని, అలంకరణ పని ఆజమాయిషీతో బాటు కళా సామగ్రి కొనుగోలు కూడా చేస్తూ మధ్యాహ్నం పాఠశాలకు చేరింది. అక్కడి శిష్యురాళ్లకి నృత్యగానం నేర్పుతూంటే ఆమె మనసుకు చాలా హాయిగా ఉండేది. ఆమెను చూసి శిష్యురాళ్ళలో నూతన ఉత్సహం పుట్టుకొచ్చేది. ఆ వాతావరణంలో ఆమెలో పురివిప్పిన కళాచైతన్యం చిందులు వేసేది.
ఆమెలో తేజరిల్లే ఉత్సాహానికి మరో కారణం కాబోయే భర్తతో ప్రేమాలాపన కూడా. ఇంటికి వెళుతూ మాగీర్ ఇంటిలో నేలమాళిగలో వేచి వున్న అజోడాతో ఆమె గడిపే ఘడియలు క్షణాల్లో పరుగుతీసేవి. ప్రేమికులు ఈ సంసారాన్ని మరిచి సుమధుర భవిష్యత్తులో విహరించేవారు.
‘‘ఏవండోయ్, మన పెళ్ళాయ్యాక జోగార్ వెళ్లి ఆ ఊళ్ళో కొన్ని దినాలు గడుపుదాం’’ అంది ఆమె కాబోయే భర్తతో.
దానికి ముందు మనం సరయూ నది దీనిలో వున్న గుడిలో మొక్కు తీర్చాలి.
‘‘ఔను చెట్టుకున్న పీలికను తీసి నదిలో పారించాలి కదా! ఆ తర్వాత జోగార్‌కు వెళదాం’’.
‘‘తప్పకుండా వెళదాం మహారాణీ! ఐతే మనం మళ్ళా ఏడాదికి ఓసారి ఆ దేవి గుడికి వెళ్లాలి. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకి వెళుతుండాలి’’.
‘‘ప్రతి రెండేళ్ళకా? ఎందుకని?’’
‘‘బిడ్డలు కనవా ఏమిటి?’’
‘‘ప్రతి రెండేళ్ళకా? నాకంత ఓపిక లేదు.’’
‘‘నాకుందిగా?’’
‘మీ కొంటె మాటలకేం కానీ, నే వెళ్లి వస్తా’’.
‘‘అప్పుడేనా?’’
‘‘ఇంటిలో ఎదురుచూస్తూంటారు.’
‘‘ఇంకాసేపు ఉండు మోరీ’’
‘‘నాకూ ఉండాలనే ఉంటుంది. రేపు భవంతిలో కలుసుకుంటాం కదా!’’
‘‘అదీ కలయికేనా? కాస్త దగ్గరకొస్తే దూరంగా ఉండమంటావు’’.
‘‘సెలవు స్వామీ’’ అంది నవ్వుతూ.
***
ఆ రోజు మధ్యాహ్నం ఓ పరిచారిక హనోడా వద్దకు ఏడుస్తూ వచ్చి ‘‘అయ్యగారూ! నా పెనిమిటిని కాపాడాలి. మా పంచాయతీ అతడికి 50 కొరడా దెబ్బల దండన విధించింది’’ అంది.
‘‘మీ ఆయన చేసిన నేరం ఏమిటి?’’ అడిగాడు హనోడా.
‘‘పొరుగునున్న రాళ్ళతో కూడిన బంజరు పొలాన్ని తన కండలను కరిగించి బాగు చేసి యవలు పండించాడు. తీరా పండాక పంచాయితీ పంటని కోయించి పంచాయతీ గిడ్డంగికి తరలించింది. ‘‘మరి దాన్ని సాగు చేసే అనుమతి శిస్తు కట్టి పంచాయతీ నుంచి పొందాలి కదా! అది చేసి ఉండడు. దానికి శాస్తి పంట జప్తు, కొరడా దెబ్బలు.
‘‘పంట జప్తు చేశాక దండన ఎందుకు అయ్యగారూ!’’
‘‘మన మొహంజోదడోలో నియమాల పాలన పకడ్బందీగా జరుగుతుంది కాబట్టి మన పాలనా వ్యవస్థ అంతా సవ్యంగా ఉంటోంది. వీధులు శుభ్రంగా ఉంటాయి. నేరాలు తక్కువ. అవినీతి లేదు. తీవ్ర శిక్షల వలనే ఇది సాధ్యం అవుతోంది’’.
‘‘అయ్యగారూ! నగర పాలనా సంస్థలో తమకు అంత పలుకుబడి ఉంది. ఎవరితోనైనా మా పంచాయతీకి చెప్పించి మా ఆయన దండన తగ్గేలా చూడండి అయ్యగారూ. అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది’’.
‘‘నీకు తెలుసు కదమ్మా! నేనే కాదు, ప్రధాన పూజారి కూడా పరిపాలనా విషయాల్లో కలుగజేసుకోరని. 50 కొరడా దెబ్బలకి బతికే ఉంటాడు. మరీ అయితే తెలివి తప్పుతాడు. ఫర్వాలేదు, 100 కొరడా దెబ్బలకైతే చావడం ఖాయం కాబట్టి నువ్వు క్షమాపణ కోరి కొరడా దెబ్బలు తగ్గించమని అడగొచ్చు.’’
ఆమె ఏడుస్తూ వెళ్లిపోయింది.
పంచాయతీ శారీరక శిక్షలే కాక సామాజిక బహిష్కరణ, నిప్పు బహిష్కరణ మొదలగు శిక్షలు విధించేది. సామాజిక బహిష్కరణ అంటే నేరస్త కుటుంబాలతో మాటలతో సహా అన్ని సంబంధాల తెగతెంపు. నిప్పు బహిష్కరణ మరీ తీవ్రమైన శిక్ష.
చెకుముకి రాళ్ళు, ఇతర సాధనాలతో అగ్గి రగల్చడం తక్షణం అయే పనికాదు. రగిల్చినా ప్రతి ఇంటిలో రాత్రింబవళ్ళు నిప్పు మండుతూ ఉంచడం కష్టసాధ్యమే. అందుకోసం పంచాయితీ గ్రామంలో లేక పేటలో ఓ కుటుంబానికి ఆహార ధాన్యాలు, డబ్బులు ఇచ్చి ఎల్లప్పుడు నిప్పు మండుతూ ఉంచే పని అప్పజెప్పేది. ఆ ఇంటి నుండి అంతా నిప్పు తీసుకెళ్ళేవారు ఆ పరిస్థితిలో నిప్పు బహిష్కరణకు గురయే కుటుంబం పడే యాతన మనం ఊహించుకోవచ్చు.
భవంతికి వెల్లవేసే పని పూర్తయింది. మోరీ అజమాయిషీలో రంగు రంగుల చిక్కని వెల్లలతో భవంతి బయట గోడలు, గదులు, నడవలు, వసారాలు, వాకిళ్ళు, ముంగిళ్ళు వనె్నలీనుతున్నయి.
గోడలకు కొంత ఎత్తువరకు లేత నీలం వెల్ల పూసి దానిపై వెండి రంగులో చుక్కలు చిత్రించారు. అక్కడక్కడ గోడలమీద రంగవల్లులు, జంతువులు, నావలు, రథాలు, ప్రకృతి దృశ్యాలు చిత్రించారు. పులి, ఉడత, వేటకుక్క, కోతి, నర్తకి, ఖడ్గమృగం, ఏనుగు మొదలగు చిత్రాలు కూడా చిత్రించారు. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు