డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అలాగా! అన్నింటికీ మించి అందాల రాశి కూడా. ఈమెలాటి సొగసుల గుమ్మ ఎప్పుడో కాని కానరాదు’’ అంది మోరీ వైపు చూసి.
మోరీ సిగ్గుతో ‘‘మీ ముందు నేనేపాటిదాన్ని అమ్మాయిగారూ. చంద్రుడి ముందు మిణుకు మిణుకుమనే చుక్కలాంటి దాన్ని ’’అంది.
‘‘అమ్మో.మాటకారి కూడానూ’’ అంది గోదా నవ్వుతూ.
‘‘అది సరే కాని ఈమె మంచి పాటగత్తె అంటున్నావు’’ అంది గోదా.
‘‘మోరీ, అక్కకు సంగీతం వచ్చు. పాడుతుంది కూడా. అక్కా, ఈమె పాటవినాలంటే పొద్దునే్న ఆమె పూజా గృహానికిరా’’.
‘‘అలాగే తప్పకుండా వస్తా’’ అంది గోదా.
మోరీ ‘‘వెళ్లివస్తాను అమ్మాయిగారూ’’ అని చెప్పి సెలవ తీసుకుంది.
మర్నాడు పొద్దునే్న పూజా గృహంలో అంతా చేరారు. గోదా, భర్త కూడా వచ్చారు.
‘‘మోరీ, ఆ ప్రార్థన ‘‘నువ్వే దైవం, నువ్వే గురువు, నువ్వే సర్వం’’ పాడు అంది మాజా. తీగల వాయిద్యాన్ని మీటుతూ రాగాలాపన చేసి గానాన్ని అందుకుంది.
ఆమె మధుర కంఠం నంచి వెలువడిన సంగతులు, గళ సంచారాన్ని వింటూ అంతా మంత్రముగ్ధులైపోయారు. సంగీత ప్రియురాలైన గోదా ఆ సంగీత ప్రవాహంలో ప్రవహించుకుపోతూ తనను తానే మర్చిపోయింది.
కీర్తన ముగియానే గోదాకు మరో లోకం నుంచి ఈ లోకానికి వచ్చినట్టు అనిపించింది. ‘నేను ఇటువంటి గానం ఇంతవరకు వినలేదు’’ అంది.
‘‘నిజమే అక్కా, ఈమె జానపద పాటలు పాడుతూంటే అంవరకు ఈలలు, అరుపులతో చెలరేగుతున్న జనం సంపూర్ణ నిశ్శబ్దంతో ఆమె గానాన్ని ఆస్వాదిస్తారు’’ అన్నాడు అజోడా.
గోదా‘‘‘మోరీ నేనిక్కడ ఉన్నంతవరకు ఉదయానే్న నీ పాట వినడంతో నా దినచర్య మొదలవుతుంది. ఇదిగో నీకు నా తరఫున బహుమతి’’ అని ఆమె చేతిలో ఓ వరహా పెట్టింది.
‘‘అమ్మాయిగారూ! తమరి మన్నననలు నాకు ఈ వరహాలు కంటే గొప్పవైనవి’’ అంది మోరీ వరహా అందుకుని.
ఆ మధ్యాహ్నం భోజనాలయాక హనోడా, అల్లుడు అలా ఊళ్ళోకి వెళ్ళారు. మాజా చంటాడిని ఆడిస్తూ మనవడితో ముచ్చటిస్తోంది. వాడి ముద్దు ముద్దు మాటలు వింటూ పరవశిస్తోంది.
‘‘అమ్మమ్మా! ఇంటిలో ఎన్నో బొమ్మలున్నాయి’’ అన్నాడు మనవడు, వాడికిచ్చిన బొమ్మల్ని చూస్తూ.
‘‘అలాగే నాన్నా, నీకు ఇంకా కొనిపెడతాలే’’ అంది అమ్మమ్మ మాజా.
అజోడా తన గదిలో అక్క గోదాతో సంభాషిస్తున్నాడు.
‘‘అక్కా నీకోసం ఇదిగో ఓ కానుక’’ అని బిళ్ళల గొలుసు ఇచ్చాడు.
‘‘చాలా బాగుందిరా! ఎక్కడిది? ఇక్కడిది కానట్టుంది’’
‘‘ఇది సుమేర్ నుంచి వచ్చిన ఓ వర్తకుడి నుంచి కొన్నాను’’.
‘‘అందుకే అంత బాగుంది. మరి నీకు కాబోయే భార్యకోసం కూడా కొని ఉంచావా నగలు?’’.
‘‘నువ్వు ఎవరికీ చెప్పకపోతే నీకో రసహ్యం చెప్పాలి’’.
‘‘నేనెందుకు చెప్తారా? నిర్భయంగా చెప్పు’’
‘‘ఇటువంటి హారమే ఇదివరకు నీకోసం కొన్నా. కానీ మోరీ పనితీరు, ఆమె పాట విన్నాక దాన్ని బహుమతిగా ఆమెకు ఇచ్చేశా. అటువంటిదే మరోటి తెప్పించా నీకోసం.
‘‘దాంట్లో రహస్యం ఏమిట్రా? అమ్మకు చెప్పలేదా?’’
‘‘అమ్మకు చెప్పానులే. ఓ మాట చెప్పు.. మోరీ నీకెలా అనిపించింది?’’
‘‘మోరీ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఆమె లక్షల్లో ఒక్కర్తె. అందంలో, సంగీతంలో, వాక్‌చాతుర్యంలో ఆమెకు ఆమే సాటి. కానీ ఎందుకలా అడుగుతున్నావు?’’
‘‘నేను ఆమెను ప్రేమించా అక్కా. ఆమెను పెళ్లాడాలని అనుకుంటున్నా’’.
‘‘అందంలో నీకు ఆమె జోడీనే! కానీ కులం, సామాజిక హోదాలో కాదు. అమ్మా నాన్నలతో మాట్లాడావా?’’
‘‘వాళ్ళు ఊరి ప్రధాన పూజారి మనవరాలిని చేసుకోమని నన్ను నిర్బంధిస్తున్నారు. నాకు ఆ సంబంధం ఇష్టంలేదు’’.
‘‘మరి మోరీ ఏమంది?’’
‘‘నన్ను చేసుకుంటానంటోంది. ఆమె కూడా నన్ను గాఢంగా ప్రేమిస్తోంది. కానీ అమ్మా నాన్నలు మొండికేస్తున్నారు’’.
‘‘వాళ్ళు మాత్రం ఎలా ఒప్పుకుంటారు? ఆమె తండ్రి మన ఉద్యోగి, కులం కూడా వేరు. సామాజికంగా మనతో సరితూగలేరు.’’
‘‘కానీ ఇది నా జీవితానికి సంబంధించిన ప్రశ్న. నా సుఖ సంతోషాలు ఆమెను భార్యగా పొందడంలోనే ఉన్నాయి. నేను ఆమెనే పెళ్లాడతా కానీ మరో అమ్మాయిని పెళ్లాడనని అమ్మా నాన్నలకు నిక్కచ్చిగా చెప్పేశా’’.
‘‘గట్టి చిక్కుల్లో పెట్టేవే వాళ్ళని’’.
‘‘మన సమాజంలో నల్లజాతివారితో తెల్లజాతివారి వివాహ సంబంధాలు జరగడం సర్వసామాన్యం కాకపోయినా అరుదుగా జరుగుతూంటాయి కదా! పెద్దమావయ్య కూతురు రీబా నల్లజాతి కుర్రాడిని చేసుకుని హాయిగా కాపురం చేయడంలేదా?’’
‘‘కానీ ఆ కుర్రాడి తండ్రికి సమాజంలో పెద్ద హోదా ఉంది. వాళ్ళు సంపన్నులు, ఆస్తులు, భూములు ఉన్నాయి.
‘‘అవి లేకపోతేనేం పేదవాళ్ళు మనుషులు కారా? నువ్వే ఎలాగో అమ్మా నాన్నలని ఒప్పించాలి’’.
‘‘నే చెప్పినా వాళ్ళు ఒప్పుకోకపోతే ఏం చేస్తావు?’’
‘‘నేను ఆమెను కోవిలలో పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతా’’
‘‘అంటే నువ్వు ఆమెను అంతలా ప్రేమించావా?’’
‘‘ఔను, నేను ఆమె కోసం ఏమైనా చేస్తా’’.
‘‘ఆమె అమ్మా నాన్నలు ఏమంటారో తెలిసిందా?’’ ‘‘ఇంతవరకు వాళ్ళతో ఈ విషయం మాట్లాడలేదు. వాళ్ళు తలక్రిందులుగా తపస్సు చేసినా మీలాంటి సంబంధం దొరుకుతుందా, అందువలన వాళ్లు తప్పకుండా ఒప్పుకుంటారు అంటుంది మోరీ’’. - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు