డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-36

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కానీ మన నాగరికతమీద ఆపద వచ్చిన సూచనలు దృష్టిగతం అవుతున్నాయి. పడమర నుంచి వస్తున్న వార్తలను బట్టి అక్కడ చన్హుతారో పట్టణంపై ఝాంనగర్ అనే అనాగరిక జాతి దాడి చేసి ఆక్రమించి అక్కడ అరాచక పరిస్థితిని సృష్టించిందని తెలిసింది.
మనమంతా ధైర్యంగా మన నగరాన్ని మన నాగరికతను కాపాడే స్థితిలో ఉండాలి. దానికోసం మనమేం చేయాలో ఆలోచించడానికి ఈ సమావేశం ఏర్పాటుచేశారు. ఆ ముప్పు ప్రస్తుతం దూరంగానే ఉంది. అది క్రమేణా శక్తికోల్పోయి అణిగిపోవచ్చు లేదా అది శక్తి పుంజుకుని మనమీద విరుచుకపడనూ వచ్చు. మనం అన్నింటికీ సిద్ధమై ఉండాలి.
రక్షక భటుల నాయకుడు ఇలా అన్నాడు. ‘‘మన రక్షక భటులు దొంగలు, దుండగులు, దోపిడీదార్లను అదుపులో ఉంచడానికి సమర్థులే. దానికి కారణం ఆ నేరస్తుల వద్ద ఆయుధాలు లేవు మన రక్షక భటులు కర్రలు, బరిసెలు, గదలతో వాళ్ళ ఆటలు కట్టిస్తున్నారు. కానీ జామ్‌నగర్ సైనికుల వద్ద ప్రత్యేక ఆయుధాలు ఉన్నాయని విన్నాం’’.
‘‘ఏమిటా ఆయుధాలు?’’ అని ఓ నగర ప్రముఖుడు ప్రశ్నించాడు.
‘‘వాళ్ళు రాగి కత్తులు వాడుతున్నారట. అందుకే గౌరనీయులు ప్రధాన పూజారిగారు సెలవిచ్చినట్లు రహదార్ల మధ్యన కూడా కమ్మరి కొలిములను ఏర్పర్చి రాగి ఆయుధాలను తయారుచేయిస్తున్నారు. అందువలన మనం కూడా ఆ ఆయుధాలను తయారుచేయించి వాటి వాడుకలో కూడ ఆమన వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి.
ఉప ప్రధాన పూజారి ఇలా అన్నాడు. ‘‘వాటని తయారు చేయడానికి,వాటిని ఉపయోగానికి శిక్షణ ఇవ్వడానికి మనం పూనుకోవాలి. ఇటువంటి పరిస్థితి వస్తుందని మనం ఎన్నడూ ఊహించలేదు. ఇంతవరకు మనం పుకార్లు వింటూ వచ్చాం. ఇప్పుడవి యధార్థమని రూఢి అయింది. అందువలన మన నగరాన్ని కాపాడుకునే వ్హూం రచించాలి.’’
అప్పుడు ఓ వర్తక ప్రముఖుడు ఇలా అడిగాడు.
‘‘మనం నగరాన్ని విడిచిపట్టి పారిపోలేము కాబట్టి మనం నగరాన్ని ఎలాగైనా రక్షించే ఉపాయం ఆలోచించాలి. గౌరవనీయులైన ప్రధాన పూజారిగారు దయచేసి ప్రస్తుతం మన కోశాగారంలో వున్న మొత్తంలో రాగి ఆయుధాలతో పోరాడగలిగే సైనిక బలగాన్ని సమకూర్చడం సాధ్యం అవుతుందా లేదా సెలవ ఇవ్వవలసిందని మనవి’.
ప్రధాన పూజారిగారు ఈ విధంగా జవాబు చెప్పాడు.
‘‘ఈ విషయం గురించి అంచనాలు వేయించా. రెండు వందల మంది ఆధునిక సాయుధ బృందానికి సరిపోయే సొమ్ము ఉంది కానీ దేవాలయం ఖర్చులకి, నగర సౌకర్యాలకీ ఆట్టే డబ్బు మిగలదు. అందుకు సైనిక బృందాన్ని సమకూర్చడానికి విరాళాలు సేకరించడం మంచిదనినా అభిమతం.
‘‘సరే వర్తకులమంతా విరాళాలు ఇస్తాం. కార్మికులు, వ్యవసాయదార్లు కూడా వాళ్ళ శక్తికొలది ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం’’ అన్నాడు హనోడా.
‘‘నగర ప్రముఖులు హనాడోగారు సెలవిచ్చినట్లు.. మేం వ్యవసాయదార్లమంతా శక్తివంచన లేకుండా విరాళాలు ఇస్తాం’’ అన్నాడు వ్యవసాయదార్ల ప్రతినిధి.
అప్పుడు కార్మికుల ప్రతనిధి కూడా ‘‘మేం మాకు వీలైనంత విరాళాలు ఇస్తాం. మరి ఇది మన నగర మనుగడకే ఏర్పడిన ముప్పుకాదా’’ అన్నాడు.
రక్షక భటుల నాయకుడు ఇలా అన్నాడు ‘‘మీ అందరిలో దేశ రక్షణ పట్ల ఉత్సాహం చూస్తూంటే మనను ఎవరూ జయించలేరనే నమ్మకం కలుగుతోంది.. గౌరవనీయులైన ప్రధాన పూజారగారు నాతో మనవి. నగరంలో, ఇరుగుపొరుగు ఊళ్ళల్లో యువకులను ఎంపిక చేసి వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికి తగు చర్యలు గైకొంటా. కానీ ఆయుధాల తయారీ పనిని మరెవరికైనా అప్పజెప్పవలసిందని వారికి నా మనవి’’ అన్నాడు.
‘‘ఔను. ఆ పని కమ్మరి కొలిముల అధికారికి అప్పచెప్పాలి. ఆ అధికారి ఎవరు అని ప్రధాన పూజారి అడగ్గా ఆ అధికారి లేచి నిలబడి వంగి దణ్ణం పెట్టి ‘‘ఆ పనిని చేయడానికి నేనూ, నా సిబ్బంది సిద్ధమే. కానీ నేనో మనవి చేయదలిచా- పడమటన దాడిచేసిన ఆ విదేశీయులు రాగి, ఖనిజాన్ని వాళ్ళే దక్కించుకని ఇతర జాగాలకు రాకుండా చేస్తున్నారు. నగలు, విగ్రహాల కోసం రాగి, ఖనిజం దొరక్క మన కమ్మర్లు ఇబ్బందుల పాలవుతున్నారు. ముడి రాగి ఖనిజాన్ని ఆయుధాల నమూనాలతో సహా మాకు అందజేస్తే మేం తప్పకుండా ఆయుధాలు తయారుచేస్తాం’’.
‘‘ఔను, మీరు చెప్పింది నిజమే. దీని గురించి ఓ బృందాన్ని ఇదివరకే ఏర్పాటుచేసి ఉన్నాం. అది విచారణ కొనసాగిస్తోంది.’’
దాంతో ఆ రోజు సమావేశం ముగిసింది. రాగి, ఖనిజం బృందం మనుషులను హడప్పాకు పంపి అక్కడ పరిస్థతులను కనుక్కుంది. కానీ రాగి ఖనిజం లభ్యంకావడం సాధ్యం కాదని తేలింది.
ఈలోగా నగర రక్షక భటుల బృందం నాయకుడు రక్షక భటుల చేత రోజూ రక్షణ అభ్యాసం చేయిస్తున్నాడు. వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆయుధాలు బరిసెలు, గొడ్డళ్ళు, చురకత్తులు, గదలు, విల్లు బాణాలు, వాటి ప్రయోగంతోనే శిక్షణ ఇవ్వడం వీలవుతుంది. కత్తి మాత్రం వాళ్ళకు తెలియని ఆయుధం.
మర్నాడు సాయంకాలం మాగీర్ ఇంటి నేల మాళిగలో ప్రేమికులు కలుసుకున్నారు.
‘‘ఇక్కడ కూడా అలా దూరంగా ఉంటావేమిటి? నే చెప్తేనే కాని నా పక్కన కూచోవా?’’ అన్నాడు అజోడా.
మోరీ పక్కన కూచుంది.
నేను అక్కను అమ్మా నాన్నలకి మన పెళ్లి గురించి నచ్చచెప్పమని వేడుకున్న. ఆమె, బావా వాళ్ళకు ఎంతలా నచ్చచెప్పినా వాళ్ళు ససమేమిరా అంటున్నారు - ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు