డైలీ సీరియల్

వ్యూహం-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జెంటుగా డాక్టర్స్ కాన్పరెన్స్ హాల్‌కు రమ్మని డాక్టర్ లోహితకు ఫోన్ చేశాడు కాశి.
కాన్ఫరెన్స్‌హాల్‌కు వెళ్లింది.
అప్పటికే అందరూ డాక్టర్లు వచ్చి కూర్చున్నారు.
టేబుల్‌మీద డాక్టర్ వౌర్య ఫొటో పెట్టివుంది. ఆ ఫోటోకు డాక్టర్ అరవింద్ గులాబీ పూల మాల వేశాడు. లోహితకు సైగ చెయ్యడం ఆమె వెళ్లి కుందులలోని వొత్తులు సరిచేసి దీపారాధన చేసి వౌర్యకు నమస్కరించింది.
‘‘ఫ్రెండ్స్ డాక్టర్ వౌర్య మన గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్‌లో దాదాపు పది సంవత్సరాలు పనిచేశారు. ఎఫిషియంట్ డాక్టరుగా పేరు తెచ్చుకున్నారు. మరో రెండు నెలలు ఆగితే ఆయనను మన మేనేజింగ్ ట్రస్టీలో పార్ట్‌నర్‌గా తీసుకునేవారు. మంచి రైపెన్డ్ స్టేజిలో వున్నపుడు అకస్మాత్తుగా స్విమ్మింగ్ పూల్‌లో ప్రాణాలు వదలడం అందరినీ నివ్వెర పరుస్తూ వుంది. మై డీపెస్ట్ కంటోలెన్స్ టు ద డిపార్టెడ్ సోల్ అండ్ టు ద బిలీవడ్ ఫ్యామిలీ మెంబర్స్.. రేపు నేను వౌర్య స్వగ్రామం వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్‌ను కలిసి పది లక్షల చెక్ ఇచ్చివస్తాను’’ అన్నాడు డాక్టర్ అరవింద్.
అందరూ లేచి నిలబడి రెండు నిమిషాలు వౌర్య ఆత్మశాంతికి నిశ్శబ్దం పాటించారు.
కాన్పరెన్స్ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ‘‘ఆయనకు బాగా స్విమ్మింగ్ వచ్చు.. స్విమ్మింగ్ పూల్‌లో నీళ్ళలో మునిగిపోవడం ఏమిటి?’’ అనుమానం వ్యక్తపరిచాడు డాక్టరు.
‘‘ఈమధ్య డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. ఆ మత్తులో స్విమ్మింగ్ పూల్‌లో దిగి వుంటాడు.. మునిగిపోయి వుంటాడు.. మనిషి జీవితం ఎంత? నీటి బుడగలా ఒక్క క్షణం.. నదిలో నావ వెళ్తున్నపుడు నీటి చార కొన్ని క్షణాలు కన్పిస్తుంది. ఆ తరువాత నావ వెళ్లిన గుర్తే వుండదు. నీటిమీద రాత రాసి నావ వెళ్లిపోయినట్లుగా మనిషి జీవితం కూడా అంతరించిపోతుంది’’ వేదాంత ధోరణిలో పడిపోయాడు మరో డాక్టర్.
***
డాక్టర్ లోహిత పనిచేస్తున్న హాస్పిటల్ చూడాలనిపించింది స్కందకు.
ఆ హాస్పిటల్ మాఫియా గ్యాంగులు నిర్వహిచేదని అతనికి తెలుసు. హాస్పిటల్లో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని కూడా తెలుసు.
వాళ్ళ ఆట కట్టించాలంటే ఆధారాలు కావాలి.
శత్రువు బలమైనవాడు.. వాళ్ళ ఆలోచనలు నికృష్టమైనవి.. పేదలకు వైద్యం అనే ముసుగులో అమాయకుల శరీరభాగాలు అమ్ముకుంటున్నారు. వాటిని బయటపెట్టాలంటే ఎంతో చాకచక్యంగా ఇనె్వస్టిగేషన్ కొనసాగించాలి. బలమైన శత్రువు కోటలోకి అడుగుపెట్టినపుడు ఎంతో జాగరూకతతో వుండాలి!
తను ఎవరో వాళ్ళకు తెలిస్తే తన ప్రాణాలు తీసేయడానికి వెనుకాడరు. పటిష్టమైన వ్యూహంతోనే తను ముందడుగు వెయ్యాలి!
లోహిత ఉండే కాటేజ్‌కు వెళ్లి కాలింగ్ బెల్ నొక్కాడు.
డోర్ తీయగానే ఎదురుగా కన్పించిన స్కందను చూసి ‘‘వాటై సర్‌ప్రైజ్! ఉదయానే్న ప్రత్యక్షమయ్యారు’’ అంది లోహిత.
కాఫీ కప్పు ఇస్తూ ఏదో మాట్లాడబోయింది లోహిత.
మాట్లాడవద్దన్నట్లు సైగ చేశాడు.
అతని చూపులు టెలిఫోన్ వున్న టేబుల్ క్రిందివైపు, సీలింగ్‌పైన, గోడలవైపు మళ్ళాయి.
ఆమెను కాటేజీలోనుంచి బయటకు తీసుకువెళ్ళాడు. చెట్టు క్రింద నిలబడ్డారు.
‘‘నీ ఫోన్ టాప్ చేశారు.. నువ్వు ఎవరితో మాట్లాడినా హాస్పిటల్ విషయాలు మాట్లాడకు!’’
అదెలా కుదురుతుంది? నర్సులు, ఇతర డాక్టర్లు నాతో మాట్లాడుతూ వుంటారు హాస్పిటల్ సంగతులు’’ అందామె.
‘‘నా ఉద్దేశ్యం అది కాదు.. హాస్పిటల్లోని లోటుపాట్లు, అవకతవకల గూర్చి ఇతరులతో చర్చించకు. నీ క్వార్టర్‌లో నువ్వు ఎవరితో మాట్లాడినా సర్వైలెన్స్ రూములో వున్న టేపుల్లో రికార్డు అవుతాయి. హాల్లో సిసిటివి కెమెరా కూడా వుంది. నీ గదిలోకి ఎవరు వస్తున్నారో వాళ్ళకు తెలిసిపోతుంది’’ అన్నాడతను. మొదటిసారిగా భయపడిందామె. ప్రజలకు సేవ చేసే హాస్పిటల్లో సిసి టివి కెమెరాలు ఎందుకు? టెలిఫోన్ టాప్ చెయ్యాల్సిన అవసరం ఏముంది?
పులి గుహలోకి వచ్చినట్లుగా వొణికిపోయింది.
‘‘అధైర్యపడాల్సిన అవసరంలేదు. హాస్పిటల్లో జరిగే వ్యవహారాలు గమనిస్తూ వుండి.. వ్యక్తిగతంగా కలిసినపుడే వివరాలు నాకు చెప్పాలి! టెలిఫోన్‌లో నాతో మాట్లాడొద్దు!.. మరోచోట మళ్లీ కలుద్దాం!’’ అన్నాడతను.
హడావుడిగా వెళ్లిపోయాడు స్కంద.
***
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అర్థరాత్రి దాటేకా కారులో వెళ్ళాడు స్కంద.
అతని తల్లి మానస న్యూజెర్సీలో డాక్టరు. ఆమెను రిసీవ్ చేసుకోవడానికే ఎయిర్‌పోర్టుకు వెళ్లాడతను. తెల్లవారు జామున మూడింటికి వచ్చింది ఫ్లయిట్. చెకింగ్ పూర్తి అయి బయటపడేసరికి మరో గంట పట్టింది.
ఎరైవల్ గేటు దగ్గర కన్పించిన కొడుకును చూడగానే ఆమె ఉద్వేగంతో ఊగిపోయింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అతడిని హత్తుకుపోయింది.
‘‘పెద్ద టయోటా కారు తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చావా? లగేజ్ అంతా సర్దుకు వచ్చేశాను.. మళ్లీ అమెరికా వెళ్ళను’’ అంది మానస కన్నీళ్ళు తుడుచుకుంటూ.
‘‘అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారీ మళ్లీ వెళ్ళనని చెబుతావ్. ఆరు నెలలు కాగానే ఇక్కడ ఎండలకు తట్టుకోలేకపోతున్నాను.. అమెరికా వెళ్ళిపోతున్నానని అంటావ్’’ అన్నాడతను, ఆమె చేతిలోని లగేజ్ ట్రాలీని తీసుకుని ముందుకు నెట్టుతూ.
‘‘ఈసారి అలా కాదు.. నాలుగైదు తరాలకు సరిపడా ఆస్తిపాస్తులు సంపాదించాను. అందరికి దూరంగా ఎన్నాళ్లని అక్కడ వుంటాను’’ అందామె.
నవ్వొచ్చింది ఆమె మాటలకు.
‘‘మీది సంపన్న కుటుంబం. నాన్నగారిది సంపన్న కుటుంబం. పెళ్లి చేసుకుని సంవత్సరం తిరక్కముందే విడిపోయారు. సుఖంగా వుండటానికి అవసరమైనవి కనుక్కోవడానికి సంపద ఉపయోగపడుతుంది గాని, సంపద సంతోషాన్ని కల్గించదు’’ అన్నాడతను.
స్కంద తండ్రి ప్రస్తావన తీసుకురావడం నచ్చలేదామెకు.
- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ