డైలీ సీరియల్

వ్యూహం-9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా రూపం ఆయనకు నచ్చదు. ఆయన ప్రవర్తనా నాకు నచ్చలేదు. మనస్ఫర్థలు వచ్చాయి.. విడిపోయాం! నా లైఫ్‌బుక్‌లో వివాహానికి సంబంధించిన పేజీలన్నీ చించేశాను. విడాకులు తీసుకున్న సమయంలో మూడు నెలల గర్భవతిని.. అబార్షన్ చేయించుకుందామనుకున్నాను.. మనస్సు ఒప్పుకోలేదు. నిన్ను కన్నాక నిన్ను పెంచే భారం మీ అమ్మమ్మ, తాతయ్యలకు వదిలేసి అమెరికా వెళ్లిపోయాను.. అమ్మా నాన్నలు పెద్దవాళ్ళయ్యారు.. వాళ్ళను చూసుకోవాలి. నీకు పెళ్లి చేసి మనవడు, మనవరాలితో ఆడుకుంటూ కాలం గడిపేస్తాను.. మీ నాన్నగారి ప్రస్తావన మళ్లీ తీసుకురావద్దు.. ఆయన రూపం నీ మనస్సులో పడకూడదని ఇంట్లో వున్న మా పెళ్లి ఫోటోలు చించేశాను. ఇంట్లో ఆయన ఫొటో లేకుండా చేశాను. ఆయన ఎక్కడ ఉన్నాడో? ఏం చేస్తున్నాడోనని నేనెప్పుడూ ఆలోచించలేదు.. అంత అసహ్యం కల్గింది కొన్ని నెలల వైవాహిక జీవితంలో.. ఆ విషయం వదిలెయ్యి గాని, ఓ అమ్మాయంటే ఇష్టపడ్డానని మొన్న ఫోన్లో చెప్పావ్.. నాకు ఆ అమ్మాయిని చూపించవా?’’ అడిగింది మానస.
‘‘ముందు కార్లో కూర్చో! ఇంటికి వెళ్ళేక మాట్లాడుకుందాం’’ అన్నాడు స్కంద.
***
దీపావళికి అతి కష్టంమీద నాలుగు రోజులు సెలవు మంజూరు చేయించుకుని హైదరాబాద్ వచ్చింది లోహిత.
‘‘సావేరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం’’ అంది లోహిత అన్నపూర్ణతో.
‘‘పెళ్ళంటే మాటలా? కట్న కానుకలు ఇచ్చుకోవాల్సి వుంటుంది. పైగా పెళ్లి ఖర్చులు పెట్టుకోవాలి.. కనీసం ఇరవై లక్షలన్నా లేనిదే ఆ ప్రయత్నం చేయలేము.. ముందు నీ పెళ్లి కాకుండా దానికి సంబంధాలు వెతుకుతుంటే నలుగురూ నాలుగ రకాలుగా అనుకుంటారు’’.
‘‘మా హాస్పిటల్ వాళ్ళు యాభై లక్షలదాకా లోన్ ఇస్తారు.. నిదానంగా నా జీవితంలో ఆ లోన్ అవౌంట్ మినహాయించుకుంటారు’’ అంది లోహిత.
‘‘అంటే ఆ హాస్పిటల్లోనే సంవత్సరాలపాటు పనిచేస్తావా? మా అందరికి దూరంగా నువ్వు అక్కడ పని చెయ్యడం నాకు ఇష్టం లేదు’’ అంది అన్నపూర్ణమ్మ.
‘‘నా పెళ్ళి ముందు జరగడం నాకూ ఇష్టం లేదు. అక్కడ పెళ్లి తరువాతే నా పెళ్లి.. లేదా ఇద్దరి పెళ్లిళ్ళు ఒకేసారి జరిగేటట్లు ఏర్పాటు చేసుకోండి.. నేను రెడీ..!’’ అంది సావేరి.
‘‘ఇది చూడవే అమ్మా! పెళ్లికి ఎంత తొందర పడుతుందో? దీనికి పెళ్లి చెయ్యడం ఆలస్యం అయితే నేను చేసుకోబోయే అబ్బాయి చేతే తనూ మూడు ముళ్ళు వేయంచుకునేటట్లు వుంది’’ అంది చెల్లెలు చెవి పట్టుకుని మెలిపెడుతూ.
‘‘అక్క ఎవరినో సెటప్ చేసుకున్నట్లుందే.. అందుకే నా పెళ్లి విషయం మాట్లాడుతూ వుంది’’ అంది చక్కలిగింతలు పెడుతూ.
‘‘ఏమిటా మాటలు.. పెద్దంతరం లేదు చిన్నంతరం లేదు’’.
ఇంటిముందు కారు ఆగిన శబ్దం విన్పించింది.
స్కంద, మానస లోపలికి వచ్చారు.
మానస తన చేతిలో ఫ్రూట్స్, స్వీట్లు వున్న ప్లాస్టిక్ సంచులను సావేరికి ఇచ్చింది లోపల పెట్టమని సైగ చేస్తూ.
‘‘తీసుకోవాలా? తిరిగి ఇచ్చెయ్యాలా?’’ అన్నట్లుగా అక్కవైపు చూసింది సావేరి.
అది గమనించి ‘‘పరాయివాళ్ళం కాదులే! అయినవాళ్ళమే! అంటే బాగా పరిచయం వున్నవాళ్ళమే! మీ అక్కకు మా అబ్బాయి సన్నిహితుడు’’ అంది మానస.
లోపలికి తీసుకువెళ్ళమని సైగ చేసి చెల్లెలు ప్రక్కకు వచ్చి ‘‘్ఫలహాహారాలు, కాఫీ ఏర్పాట్లు చూడు’’ అని చెల్లెలు చెవిలో ఊదింది లోహిత.
‘‘మా అమ్మగారు డాక్టర్ మానస.. మొన్నటిదాకా అమెరికాలో ప్రాక్టీస్ చేశారు. ఇండియా మీద గాలి మళ్లి వచ్చేసింది.. ఇక్కడే వుంటారు.. మా ఇల్లు జూబ్లీ హిల్స్‌లో వుంది ఆంటీ! మీరు మీ అమ్మాయిని తీసుకుని మా ఇంటికి రండి’’ ఇంతకుముందు పరిచయం వున్నవాడిలా అన్నపూర్ణమ్మగారితో మాట్లాడేశాడు స్కంద.
ఎదురుగా నిలబడ్డ లోహితను చూస్తూ వుండిపోయింది.
‘‘డాక్టర్ లోహిత.. భద్రాచలంకు దగ్గరలో వున్న ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తూ వుంది’’ అన్నాడతను లోహితను పరిచయం చేస్తూ.
‘‘రామ్మా.. వచ్చి కూర్చో’’ తన ప్రక్కన సోఫాలో కూర్చోమని చేతితో సైగ చేస్తూ అంది మానస.
తన ప్రక్కన ఆ అమ్మాయి కూర్చోగానే తలనిమిరి ‘గుడ్ సెలక్షన్... ముద్దమందారంలా వుంది’ అందామె కొడుకు వైపు తిరిగి చిరునవ్వు చిందిస్తూ.
అన్నపూర్ణమ్మగారు కూడా వంట గదిలోకి వెళ్లింది.
‘‘మీరు వస్తున్నట్లు ముందుగా చెప్పొచ్చు కదా!’’ అంది లోహిత స్కంద వైపు తిరిగి.
‘‘ముందుగా చెబితే ఏం ఏర్పాట్లు చేస్తావ్.. ముస్తాబై రెడీగా వుండేదానివా? నీకు ఏ అలంకరణ అవసరం లేదు.. ఏడు రంగుల హరివిల్లులా వర్ణశోభితంగా కన్పిస్తావ్’’ అంది మానస లోహితను దగ్గరకు తీసుకుని ముచ్చటపడి బుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ.
‘‘అది కాదండి.. ముందుగా తెలిస్తే అమ్మ ఏదైనా టిఫిన్ చేసి రెడీగా వుంచేది’’ అంది లోహిత.
‘‘్భజనం చేసి వచ్చాం.. ఇపుడు టిఫిన్ తినే పరిస్థితి లేదులే’’ అన్నాడు స్కంద.
ప్లేట్లలో ఫ్రూట్స్ ముక్కలు, స్వీట్లు తెచ్చి టీపాయ్ మీద ఉంచింది సావేరి.
‘‘మేం తెచ్చినవి మాకే పెడుతున్నావా?’’ నవ్వుతూ అంది మానస.
‘‘మా దగ్గర ఏం వున్నాయి ఇవ్వడానికి.. మా అక్క తప్ప’’
‘‘నాకు ఇంకో కొడుకు వున్నట్లయితే నిన్ను కూడా కోడలిగా చేసుకునేదాన్ని.. అక్కా చెల్లెళ్లు ఇద్దరూ కవల పిల్లల్లా కనిపిస్తున్నారు. ఏదన్నా ఛాన్స్ వుందేమో మావాడిని అడిగి చూడు.. మీ అక్కకు బదులు నువ్వు మా ఇంటి కోడలిగా వద్దువుగాని’’ అంది మానస.
పగలబడి నవ్వింది సావేరి.
‘‘లేదు.. లేదు.. లోహితకు ఆల్రెడీ కమిట్ అయిపోయాను.. నో ఛాన్స్.. రాముడిది ఒకే బాణం, ఒకటే మాట, ఒకటే పత్ని.. ‘ఏవండీ! ఆవిడ వచ్చిందని’ మా ఆవిడ అనడానికినో ఛాన్స్!’’ అన్నాడు స్కంద.
అందరూ నవ్వుకున్నారు. - ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876