డైలీ సీరియల్

వ్యూహం-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాఫీ కప్పులతో అన్నపూర్ణమ్మగారు హాల్లోకి వచ్చేసరికి ఆ నవ్వులు ఆగిపోయాయి.
***
లోహిత వాళ్ళింటినుంచి తిరిగి వస్తున్నాడు స్కంద.
వనస్థలిపురం నుంచి కారు హైవే మీదకు వచ్చింది.
‘‘నాన్న పర్సనాలిటీ నాకు వచ్చిందా?’’ అడిగాడు స్కంద.
‘‘ఇప్పుడా విషయాలు ఎందుకు’’ అసహనంగా కదులుతూ అంది మానస.
‘‘మీ నాన్న రూపం నీకు వచ్చిందిరా మనవడా? కానీ ఆయన బుద్ధులు రాలేదు.. చాలా సంతోషం!’’ అన్నాడు తాతయ్య ఈమధ్య? అది నిజమేనా?
‘‘మనస్సు అందంగా వుండాలి.. ఆ సొగసు ఎప్పటికీ మాయదు.. బాహ్య రూపం శాశ్వతంగా ఒకేలాగా ఉండదు.. మీ నాన్నది క్రుకెడ్ మెంటాలిటీ.. బుద్ధి మంచిది కాదు.. సంపద మీదే ఆయన దృష్టి.. మనుషులమీద ఉండదు’’ అందామె.
‘‘మీ ఇద్దరికీ ఎక్కడ పరిచయం ఏర్పడింది? నాన్ననే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు కలిగింది?’’’
‘‘మంగళూరులో ఎంబిబిఎస్ చదివే రోజుల్లో పరిచయం ఏర్పడింది. నేను కన్నడ అమ్మాయిని.. మా నాన్నగారు బెంగుళూరులో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసి బాగా సంపాదించారు.. మాది సంపన్న కుటుంబమని తెలిసి పరిచయం పెట్టుకున్నాడు మీ నాన్న. పిజి కూడా అక్కడే చేశాం.. చదువు పూర్తి అయ్యేక అతనే ప్రపోజ్ చేశాడు పెళ్లి చేసుకుందామని.. ‘ఇద్దరం ఒకే ప్రొఫెషన్.. పెళ్లి చేసుకుంటే బాగుంటుందని’ అన్నాడు. సరేనన్నాను. పెళ్లి అయ్యేక ప్రతిదానికి విసుక్కునేవాడు కారణం లేకుండానే! అతని ప్రవర్తన నచ్చలేదు. విడాకులు తీసుకుందాం అన్నాడు. దానిక్కూడా ‘సరే’నన్నాను. మీ నాన్న నేను విడిపోయి ఇరవై ఎనిమిది సంవత్సరాలవుతుంది...’’ నిట్టూర్పు విడుస్తూ అంది మానస.
ఆమె మనస్సుకు నచ్చని విషయాలు కదిలించి బాధపెట్టాలని అతని ఉద్దేశ్యం కాదు.. తండ్రి వివరాలు తెలుసుకుందామనే అతని తాపత్రయం.. ఆయన స్వగ్రామం కొత్తగూడెం అని అమ్మ అంతకుముందోసారి మాటల్లో చెప్పింది.
తన ఇనె్వస్టిగేషన్‌కు ఆ వివరాలు అవసరం.
***
నాగులపాడులో పోలీస్ జీప్ ఆగింది.
‘‘డాక్టర్ వౌర్యగారి ఇల్లు ఎక్కడ?’’’ అడిగాడు జీప్ డ్రైవర్.
ఆ వూళ్ళో డాక్టరు చదువు చదివింది ఒక్కరే!
‘‘అదిగో బాబూ రామాలయం ఎదురుగా వున్న ఇల్లే! ఇంటి ముందు మర్రి చెట్టు కన్పిస్తుంది కదా! అదే ఇల్లు!’’ రోడ్డుమీద వెళ్తున్న వ్యక్తి డాక్టరుగారి ఇల్లు చూపించాడు.
మర్రి చెట్టు నీడలో జీప్ ఆపాడు.
జీపు దిగి ఇంట్లోకి నడిచాడు స్కంద.
వౌర్య భార్యను, తల్లిదండ్రులను పరామర్శించడానికి వచ్చిన బంధువులు హాల్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
‘‘దేవుడిలాంటి మనిషి.. ఆపదలో వున్నవాళ్ళను ఆదుకునేవాడు.. తనసొంత ఖర్చుతో ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాడు.. ఉద్యోగాలు ఇప్పించేవాడు.. పేదవాళ్ళకు ఆర్థిక సహాయం చేసేవాడు.. చేతికి ఎముక లేదు మహారాజుకు’’ వౌర్యను పొగుడుతూ వున్నాడు ఓ బంధువు.
ఆ మాటలు వింటుంటే వౌర్య భార్యకు మరింత దుఃఖం పొర్లుకు వచ్చింది.
హాల్లో అడుగుపెట్టిన స్కందకు ఎదురుగా గోడకు తగిలించిన వౌర్య ఫొటో కన్పించింది. గంభీరంగా హాల్లో వున్నవాళ్ళను ఆప్యాయంగా చూస్తున్నట్లు కన్పించాడు ఫొటోలో.
‘‘ఎవరు కావాలి బాబూ?’’ స్కందను అడిగాడు డెబ్భైయ్యేళ్ళ వున్న వ్యక్తి.
‘‘మీరు డాక్టర్ వౌర్యకు ఏమవుతారు?’ ఆ పెద్దాయన్ని అడిగాడు.
‘‘నా కొడుకే బాబూ! నా తలకు కొరివి పెడతాడనుకుంటూ వుండేవాడిని. వాడి తలకు నేను కొరివి పెట్టాల్సి వచ్చింది?’’
‘‘ఎలా చనిపోయాడు?’’
‘‘ఈత కొడుతూ నీళ్లల్లో మునిగి చనిపోయాడని హాస్పిటల్ వాళ్లు శవాన్ని తెచ్చి ఇంటిముంద వరండాలో పడేశారు.. వెంటనే దహన క్రియలు జరిపించమని నామీద ఒత్తిడి తెచ్చారు. మా అబ్బాయికి ఈత కొట్టడం బాగానే వచ్చు.. నీళ్ళలో ఎలా మునిగి చనిపోయాడో అర్థం కావడంలేదు’’ అన్నాడు వౌర్య తండ్రి.
‘‘నేను పోలీసు డిపార్టుమెంటు నుంచి వస్తున్నాను.. మీ అబ్బాయి మరణం అసహజంగానే తోస్తున్నది. మాకు ఏవో కొన్ని అనుమానాలు వున్నాయి.. వాటిని నివృత్తి చేసుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను.. మీ అబ్బాయి గూర్చి వివరాలు చెప్పాలి మీరు’’.
‘‘మేడ మీద మా అబ్బాయి గది వుంది.. అక్కడ కూర్చుదాంరా బాబూ!’’
మేడమీద గదికి స్కందను తీసుకువెళ్ళి వౌర్యకు సంబంధిచిన పుస్తకాలు, పేపర్లు, మెడికల్ జర్నల్స్‌లో అతను రాసిన వ్యసాలు చూపించాడు. అవన్నీ చూసేక మంచి బ్రిలియంట్ డాక్టరని అర్థమయ్యింది. మాఫియా గ్యాంగు చేతుల్లో పడి శలభంలా మాడిపోయాడని అనుకున్నాడు స్కంద.
‘‘మీ అబ్బాయికి డ్రగ్స్ అలవాటువుందా? మాదక ద్రవ్యాలు మత్తును కలిగించేవి తీసుకునేవాడా?’’’
‘‘లేవు బాబూ! సిగరెట్ కూడా తాగడు. కుటుంబ సమస్యలు కూడా లేవు. ఊళ్ళో మాది మోతుబరి కుటుంబం.. నాకు వాడొక్కడే కొడుకు.. నా భార్యకు ఆరోగ్యం సరిగా లేదు. కోడలు మా ఇంట్లోనే వుండి మాకు సాయపడుతూ వుంది.. మా అబ్బాయి వారం, పది రోజులకు వొచ్చిపోతూ వుండేవాడు.. కొడుకు, కోడలు ఎంతో అనోన్యంగా వుండేవాళ్ళు.. పిల్లల్లేరు వాళ్ళకు.. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876