డైలీ సీరియల్

వ్యూహం-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువూరు వెళ్ళాడు. అక్కడ అతని అమ్మమ్మ ఉంది. ఆమెకు ఎనభైయ్యేళ్ళు. కళ్ళు సరిగ్గా కన్పించవ్.. వినబడదు కూడా.. కొడుకులు ముగ్గురూ ఎక్కడో దూరంగా వుంటున్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ. ఒకటే కూతురు. ఆమె చనిపోయి ఐదేళ్ళు అవుతూ వుంది. ఆమె కొడుకే శేషగిరి.
మనవడిని గుర్తుపట్టింది చూపు సరిగ్గా ఆనకపోయినా.
‘‘మీ అమ్మ చనిపోయినప్పుడు రాలేదేం?’’ అడిగిందామె.
ఎక్కడొస్తాడు? జైల్లో వుంటే..
అక్కడ కూడా ఓ సమస్య వచ్చిపడింది.
ఆ ముసలావిడ పేరుమీద పెంకుటిల్లు, ఎకరం పొలం వున్నాయి. అవి అమ్మేయాలని ఆమె కొడుకుల ప్రయత్నం... ‘‘నా తదనంతరం మీకే కదా ఆ ఆస్తి వచ్చేది.. చివరి రోజుల్లో నన్ను ఇబ్బంది పెట్టకండి.. ఇల్లు, పొలం లేకపోతే నేను ఎలా బ్రతికేది.. ఎవడి పంచలోనో చేరి చివరి రోజులు గడపాల్సిన అవసరం నాకు.. నేను ఇక్కడ మట్టిలో కలిసిపోవాలి.. మీ ఇళ్ళకు రాను!’’ అందామె.
‘‘మేం చేస్తున్నవి చిన్న చిన్న వ్యాపారాలు.. పెట్టుబడి పెడితే ఇంకా బాగా లాభాలు వస్తాయి.. ఇప్పుడు ఆస్తి అమ్మి ఆ డబ్బు మాకిస్తే మేం నిలదొక్కుకుంటాం. మాకు రోగాలు వచ్చి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నాం గాని, నువ్వు మాత్రం గుండ్రాయిలా గట్టిగానే వున్నావ్.. నీ కళ్ళముందే మేమే ఎప్పుడో గుటుక్కుమంటాం!’’ అన్నాడు ఆమె చిన్నకొడుకు.
‘‘అవేం మాటలురా! సర్లే అమ్ముకోండి’’ ముసలమ్మ మెత్తబడిపోయి అంది.
శేషగిరి అడ్డుపడ్డాడు.
‘‘ఏవో మాయమాటలు చెప్పి ఆస్తి అమ్మేసి సొమ్ము ఎగరేసుకుపోదాం అనుకుని ప్లాను వేస్తున్నారు. ఆ తరువాత మీ అమ్మని గుమ్మం తొక్కనివ్వరు.. గంజి కూడా పొయ్యరు.. మీ ముగ్గురితోపాటు నాక్కూడా ఈ ఆస్తిలో హక్కు వుంది. మా అమ్మక్కుడా వాటా వుంటుంది కదా! నా ఇష్టం లేకుండా మీరు పొలం, ఇల్లు అమ్ముకోలేరు.. నా సంతకం కావాలి, ఆస్తి మరొకరి పేర రిజిస్టర్ కావాలంటే!’’ మేనమామలకు ఎదురుతిరిగాడు.
‘‘ఇదెక్కడి పితలాటకం.. మీ అమ్మ బ్రతికి వున్నన్పప్పుడు ఒక్క రోజు కూడా వచ్చి పలకరించలేదు.. ఆమె బ్రతికివుందో చనిపోయిందో పట్టించుకోనివాడికి ఇప్పుడు అమ్మమ్మకు వత్తాసు పలుకున్నావా?’’
మాటల యుద్ధం తరువాత నెత్తురు కారేదాకా కొట్టుకున్నారు. పోలీసు స్టేషన్, కోర్టులు చుట్టూ తిరిగారు. ఊళ్ళో వాళ్ళు ముసలమ్మ తరఫున మాట్లాడిన శేషగిరికి మద్దతు ఇచ్చారు.
కోర్టులు, పోలీసు స్టేషన్లు శేషగిరికి కొత్తేమీ కాదు. మేనమామలే బెంబేలు ఎత్తిపోయారు. రాజీకి వచ్చారు. తిరువూరు మిల్క్ ప్రొడక్ట్స్‌లో చిన్న ఉద్యోగం సంపాదించాడు శేషగిరి. రెండు సంవత్సరాలు గడిచిపోయాయి.
ముసలమ్మ చనిపోవడం, మిల్క్ ప్రాజెక్టులోని ఉద్యోగం ఊడిపోవడం ఒక్కసారే జరిగాయి. ఇక అక్కడ ఉండబుద్ధి కాలేదు. అమ్మమ్మ ఆస్తిలో భాగం కోసం ప్రాకులాడకుండా భద్రాచలం వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు.
రోడ్డుమీదకు వచ్చాడు రెండ్రోజులనుంచి తిండి తినడంలేదు. ఎంతో ఆప్యాయంగా వున్న అమ్మమ్మ చనిపోవడం అతన్ని కుదిపేసింది. చివరి దశలో ఆమెకు సేవ చేస్తుంటే ఆమె అన్న మాటలు గుర్తుకొచ్చాయి.
నామీద ప్రేమతోగాని, ఆస్తికోసం నువ్వు నా దగ్గరకు రాలేదని నాకు తెలుసు.. మీ అమ్మను చూడటానిక్కూడా వచ్చేవాడివి కాదు. మేం ఎలా వున్నామో ఎప్పుడూ పట్టించుకోలేదు. జీవితం నీకు ఏవో పాఠాలు నేర్పి వుంటుంది. నీ తప్పుల్ని తెలుసుకున్నావ్. చేసిన పాపాలు కడిగేసుకోవడానికి మళ్లీ నా దగ్గరకు తిరిగి వచ్చావ్.. మంచంమీద నుంచి లేవలేని స్థితిలో నేను వుంటే పసిబిడ్డను సాకుతున్నట్లు నాకు సేవలు చేస్తున్నారు. నీకు మంచి బుద్ధి వచ్చింది. నీకు మంచి రోజులు తప్పకుండా వస్తాయి నీకు దూరం అయినవాళ్ళంతా నీ చెంతకు చేరుతారు’’ చనిపోయే ముందు దీవిస్తూ అన్నాడు శేషగిరి తండ్రి.
శేషగిరి నిలబడ్డ చోటికి ఓ కారు వచ్చి ఆగింది.
‘‘ భద్రాచలం వైపు వెళ్తున్నాం.. లిఫ్ట్ ఇస్తాం.. కారు ఎక్కు’’ అన్నాడు కారులోని వ్యక్తి డోర్ తెరుస్తూ.
ఆకలితో నకనకలాడుతున్నాడు శేషగిరి అప్పటికే. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, మరో ఆలోచన లేకుండా కారు ఎక్కాడు.
‘‘తినడానికి ఏమన్నా వున్నాయా? ఆకలి వేస్తోంది’’ అడిగాడు శేషగిరి.
కార్లో వున్న ముగ్గురు వ్యక్తులకు ఒళ్ళు మండింది. అతన్ని కారు ఎక్కించుకుని అతని దగ్గర ఉన్న డబ్బు కాజేయ్యాలని వాళ్ళ ఆలోచన. వెనుక సీట్లో కూర్చున్న తను శేషగిరి మీద పడి జేబులన్నీ వెతికాడు. రూపాయి బిళ్ళ కూడా దొరకలేదు. మెళ్ళో గోల్డ్ చైన్ కానీ, కనీసం చేతికి వాచిగాని కన్పించలేదు.
‘‘వీడెవడో నిష్ట దరిద్రుడిలా వున్నాడు.. కారు ఆపు బయటకు తోసేద్దాం’’ అన్నాడతను కారు నడిపే వ్యక్తితో.
శేషగిరిని రోడ్డుమీదకు నెట్టేసి వెళ్లిపోయారు వాళ్ళు.
రోడ్డుమీద పడిపోయిన అతన్ని ఎవరో హాస్పిటల్లో చేర్చారు. మంచి ఉద్దేశ్యంతో కాదు.. శేషగిరి కిడ్నీ అమ్మేయాలనే ఉద్దేశ్యంతో హాస్పిటల్లో చేర్పించాడు.
హాస్పిటల్‌లో కూతురు కన్పించడంతో శేషగిరి ఆనందానికి అవధులు లేవు. బాధలన్నీ మర్చిపోయాడు.
***
కాశి దగ్గరకు వెళ్లింది లోహిత.
‘‘ఈ రోజు ఓ విచిత్రం జరిగింది.. జీవితంలో మళ్లీ చూడలేనేమో అనుకున్న వ్యక్తి కన్పించాడు.. ఎంతో సంతోషంగా వుంది నాకు’’ అంది లోహిత.
రెండు కొబ్బరి బోండాలు తెప్పించాడు కాశి.
లోహిత వచ్చి ఎదురుగా కూర్చుంటే అతనికి ఎంతో సంతోషంగా వుంటుంది. మనస్సులోని అలజడి క్షణాల్లో మటుమాయమవుతుంది.
నేను కూడా మీకు ఓ విచిత్రమైన సంఘటన చెబుతాను. చనిపోయాడనుకున్న వ్యక్తిని డాక్టర్ అరవింద్‌గారి రూములో చూశాను’’ అన్నాడు కాశి.

- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ