డైలీ సీరియల్

యమహాపురి 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాణి, డిగ్రీ స్టూడెంట్’’ అంది వసంత.
దర్వాన్ ఫోన్‌లో ఏదో మాట్లాడాడు. వసంత పేరు చెప్పాడు. ఎలా కనిపిస్తోందో వర్ణించి చెప్పాడు. తర్వాత వసంతవైపు తిరిగి, ‘‘మీరు వెళ్ళొచ్చు మేడమ్’’ అన్నాడు.
‘‘లేడీస్ హాస్టల్లో ఈ మాత్రం జాగ్రత్త ఉండాలి’’ అనుకుంటూ లోపలకు వెళ్లింది వసంత.
భవనంలో అడుగిడగానే చిన్న హాలు. ఓ సోఫా. సోఫాలో ఓ నడివయస్కురాలు కూర్చుని ఉంది. వసంతని చూడగానే లేచి నిలబడి, ‘‘మీరేనా వసంత?’’ అంది.
‘‘ఊ’’
‘‘నేనీ హాస్టల్ వార్డెన్ సుభద్ర! మీరు రాణికి ఏవౌతారు?’’ అందామె.
‘‘అది రహస్యం. రాణికి కూడా తెలియకూడదు. ఎవరికీ చెప్పనంటేనే మీకు చెప్పగలను’’ అంది వసంత.
‘‘నాకు చెప్పాలి. చెప్పకపోతే మీరు రాణిని కలుసుకోలేరు. రహస్యమైతే తప్పక దాస్తాను. కానీ- రాణిని కలుసుకుందుకొచ్చి ఎందుకొచ్చిందీ ఆమెకే తెలియకూడదంటున్నారు. చిత్రంగా ఉంది..’’ అంది సుభద్ర.
‘‘ఇందులో చిత్రమేముంది? రాణికి ఇటీవల జగదానందస్వామి దీవెన లభించింది. ఆ ఫొటో పేపర్లో వచ్చింది. అది మా బంధువులబ్బాయి చూశాడు. రాణిని ఇష్టపడ్డాడు. పెర్సనల్‌గా కలుసుకుని ఆ అమ్మాయి విశేషాలు తెలుసుకోమని నన్ను కోరాడు’’ అంది వసంత.
‘‘అమ్మాయినిష్టపడితే తనే కలుసుకోవచ్చుగా. మిమ్మల్ని పంపడమేమిటి?’’ అంది సుభద్ర అనుమానంగా.
‘‘అతడిది సంప్రదాయ కుటుంబం. తనూ సంప్రదాయం పాటించే మనిషి. అపరిచితుడిగా ఓ అమ్మాయిని కలుసుకోవడం మర్యాద కాదనుకున్నాడు’’ అంది వసంత.
సుభద్ర మొహం ప్రసన్నంగా మారిపోయింది. ‘‘రాణి చాలా బుద్ధిమంతురాలు. అందంలో అప్సరస. ఫొటోల్లోకంటే కూడా బయట ఇంకా బాగుంటుంది. నాకే కొడుకుంటే తనని కోడల్ని చేసుకునేదాన్ని. ఈ మాట తనతో అనాలనుకునేదాన్ని. కానీ తను బాగా రిజర్వుడు’’ అంది.
‘‘రిజర్వుడు అంటే నా ముందు నోరు విప్పుతుందో లేదో! ఆయన చెప్పగానే - అదెంత పనీ అంటూ వచ్చాను’’ అనుకుంది వసంత. ‘‘ఐనా ఇదేం మొదటిసారి కాదు కదా! నా టాలెంటు ఇలాంటప్పుడే చూపించాలి’’ అని కూడా అనుకుని, ‘‘నేను వెళ్లొచ్చా?’’ అంది వసంత.
‘‘ఊ, అటు వెళ్లాలి’’ అంటూ దారి చూపించింది సుభద్ర.
రూం నంబర్ ఆరుకి వెళ్లి తలుపు తట్టింది వసంత.
తలుపు తియ్యగానే పోత పోసిన బంగారు బొమ్మలాంటి ఓ అమ్మాయి. చుక్కల నైటీలో ఉంది.
‘‘నేను వసంత. నువ్వు రాణి కదూ?’’ అంటూ లోపల అడుగెట్టింది వసంత. రాణి తలూపి తలుపు మూసింది.
చిన్న గది. సింగిల్‌కాట్. రెండు ప్లాస్టిక్ కుర్చీలు. ఓ బీరువా. అటాచ్డ్ బాత్.
ఇద్దరూ చెరో కుర్చీలో కూర్చున్నాక, ‘‘మీరెవరో నాకు తెలియదు’’ అంది రాణి.
‘‘నేను మిసెస్ శ్రీకర్. పేరు వసంత. నా భర్త పోలీసు ఇన్స్‌పెక్టర్’’ అంది వసంత.
రాణి భయపడింది. ‘‘పోలీసులకి నాతో ఏం పని?’’ అంది.
‘‘నేను పోలీసుని కాను. పోలీసు భార్యని’’ నవ్వింది వసంత.
‘‘పోనీ, మీకు నాతో ఏం పని?’’ అంది వసంత బింకంగా.
‘‘నాకు నీతో పనిలేదు. మా వారికే నీతో పని. తనొస్తే నలుగురూ తలోరకంగా అనుకుని నిన్నిబ్బంది పెడతారని నన్ను పంపారు’’ అంది వసంత.
రాణి కళ్లల్లో భయం. ‘‘మళ్లీ అడుగుతున్నాను. పోలీసులకి నాతో ఏం పని?’’
‘‘ఒక హత్య కేసులో నిన్ను విచారించాల్సి వుంది’’ అంది తాపీగా.
‘‘హత్య కేసా? నన్ను విచారించాలా? నేనేం చేశాను?’’ అంది రాణి కంగారుగా.
‘‘హత్య నువ్వు చెయ్యలేదు. రాజా చేశాడు. రాజా ఎవరని అడక్కు. అతడు నీకు తెలుసని నాకు తెలుసు’’
రాణి వెంటనే ‘‘ప్లీజ్, నాకేం తెలియదు. మీరు వెంటనే ఇక్కణ్ణించి వెళ్లిపోండి’’ అంది.
‘‘నువ్వు నేరస్థురాలివి కాకపోతే- నాకేం చెప్పినా నీకు ప్రమాదముండదు. నాకు నువ్వేం చెప్పకపోతే- ఇప్పుడే మావారికి ఫోన్ చేస్తాను. ఆయన సిబ్బందితో వస్తారు. నీకు, మీ హాస్టల్‌కి చెడ్డ పేరు. ఆలోచించుకో...’’
‘‘ఇది చాలా అన్యాయం. మీరు నన్ను బెదిరిస్తున్నారు..’’ అంది రాణి.
‘‘అది బెదిరింపు కాదు. నీకు అన్యాయం జరక్కూడదనే గుట్టు చప్పుడు కాకుండా పరిశోధనకు వచ్చాను. సహకరిస్తే నీకే మంచిది...’’
రాణి ఓ క్షణం మాట్లాడలేదు. తర్వాత నెమ్మదిగా, ‘‘ఏమడుగుతారో అడగండి’’ అంది.
‘‘రాజా ఎందుకు హత్య చేశాడు?’’ అంది వసంత వెంటనే.
ముందు రాజా ఎవరో తనకి తెలియదని దబాయించింది రాణి. అప్పుడు వసంత ఆమెపై సామదాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించింది. చివరికి- ‘‘అది హత్య కాదు, యాక్సిడెంట్’’ అంటూ దారికొచ్చింది రాణి.
వసంత ఆమెని ఎగాదిగా చూసింది. ‘‘ఒక మనిషికి విషాహారం పెట్టి- అది యాక్సిడెంటంటే నమ్మడానికి నేను పూలెట్టుకునేది చెవిలో కాదు, జడలో’’ అంది.
రాణి తడబడలేదు. ‘‘జరిగింది జరిగినట్లు చెబుతాను మేడమ్! నిజానిజాలు మీరే ఊహించుకోండి’’ అంది.
***
‘‘నా కోసం నా తరఫున ఓ దైవకార్యం చెయ్యాలి. అది నేనే చెయ్యొచ్చు. కానీ జగదానందస్వాసమి దీవెన పొందిన నీ చేత చేయిస్తే ఫలితం గొప్పగా వుంటుందని నా నమ్మకం’’ అంది జయమ్మ. అదేమిటంటే-
ఊరి చివర శివగిరి అనే ఎత్తయిన కొండపైన ఓ పురాతన శివాలయముంది. ఆలయంలో వెలసిన రామలింగేశ్వరుడు అసలు సిసలు భోభాశంకరుడనీ, భక్తుల కోరికలు ఇట్టే నెరవేరుస్తాడనీ ప్రతీతి.
‘‘రేపు నేను స్వయంగా నా చేతులతో గోధుమనూకతో ప్రసాదం చేసిస్తాను. నువ్వు రేపు ఉదయమే లేచి స్నానం చేసి ఆ ప్రసాదం తీసుకుని బయల్దేరు. నడిచి శివగిరికి వెళ్లు. ఆ కొండ మెట్లెక్కి వెళ్లి ఆలయంలో స్వామి దర్శనం చేసుకో.

ఇంకా ఉంది

వసుంధర