డైలీ సీరియల్

వ్యూహం-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మా డాక్టరు చెప్పేక నీకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏమన్నా వుందా?’’ ఈ రోజే జాయిన్ అవ్వు.. జీతం, వర్కింగ్ కండిషన్స్ గూర్చి రేపు మాట్లాడుకుందాం!’’ అన్నాడు కాశి.
కాశీకి నమస్కారం పెట్టి రూము బయటకు వెళ్లి నిలబడ్డాడు లెనిన్.
‘‘కుటుంబం అంటూ అయినవాళ్ళు లేకపోవడం, ఒంటరిగా వుండటంతో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది మేడమ్.. ఏం చెయ్యమంటారు?’’ అడిగాడు కాశి.
‘‘వెంటనే పెళ్లిచేసుకోండి’’’ అందామె.
‘‘మనస్సుకు నచ్చిన అమ్మాయికేమో వయస్సు తక్కువ.. నాకంటే పాతికేళ్ళు చిన్నది.. పెళ్లి చేసుకోవడం కుదరని పని.. మనస్సులో దాచుకోలేక చెప్పాననుకోండి. నన్నో పిచ్చివాడిలా జమ కట్టి నవ్వుతుంది.. అందుకే ఆ అమ్మాయికి చెప్పదల్చుకోలేదు.. గుండెల్లోనే గుడికట్టి ఆ దేవతను పూజించుకుంటాను’’ అన్నాడతను.
‘‘దట్స్.. బెటర్.. ఆ అమ్మాయి మనస్సు నొప్పించగూడదనే మీ మంచితనాన్ని మెచ్చుకోకుండా వుండలేకపోతున్నాను.. మళ్లీ కలుసుకుందాం కాశీగారూ!’’ అనేసి వెళ్లిపోయింది డాక్టర్ లోహిత.
****
డాక్టర్ అరవింద్ ఎదురుగా కూర్చున్నాడు కాశి
‘‘కాశీ! నీకో కథ చెప్పమంటావా?’’
అరవింద్ మాటలకు ఆశ్చర్యపడలేదు కాశి.
అప్పుడప్పుడు అరవింద్ అలాగే మాట్లాడుతూ వుంటాడు. వైరాగ్యం ఆవహిస్తుందతన్ని. అప్పుడు నిజాయితీగా మాట్లాడుతాడు. ఆ వైరాగ్యం కొన్ని నిముషాలే!
‘‘కుక్కపిల్లకు మాంసం ముక్క దొరికింది. ఆ ముక్కని నోట కరచుకుని చెట్టు నీడలో కూర్చుని వెంటనే తింటే అయిపోతుందని నాకుతూ కూర్చుంది. ఆ మాంసం ముక్కను చూసి ఆనందపడిపోతూ వుంది. కళ్ళముందు కనిపిస్తే ఆనందం.. తినస్తే ఆ ముక్క కడుపులో చేరిపోతుంది.. కనిపించదు.. ఆనందేమి వుంటుంది?
అప్పుడే ఐదారు పెద్ద కుక్కలు అటుకేసి వచ్చాయి. కుక్కపిల్ల నోట్లో వ్రేలాడుతున్న మాంసం ముక్కను చూసి వెంట పడ్డాయి. కుక్కపిల్ల పరుగెత్తింది. దాన్ని తరుముతూ మీదపడి రక్కుతూ అరుస్తున్నాయి ఆ కుక్కలు. తన ప్రాణాలు తీసేస్తాయేమోనని భయపడింది కుక్కపిల్ల. మాంసం ముక్క అక్కడ పడేసి పరుగెత్తింది. కుక్కపిల్లను వదిలేసి ఆ మాంసం ముక్క కోసం పోట్లాడుకోవడం మొదలెట్టాయి పెద్దకుక్కలు.
సంపద కూడా అంతే! ఎవర్నీ ఎప్పుడూ సుఖపడనివ్వదు. ధనం సంపాదించాలంటే శ్రమపడాలి! ఆర్జించిన ధనాన్ని భద్రపర్చుకోవడం కూడా కష్టమే! ఆ సంపద ఎవరన్నా కాజేస్తారేమోనన్న భయం వెంటాడుతుంది.. నిద్రపోనివ్వదు..’’
కాశికి విసుగొచ్చింది.
‘‘ఆ విషయాలు నాకెందుకు చెబుతున్నారు.. నా దగ్గర ఆస్తి ఏం లేదు.. నేను సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తాను.. దానధర్మాలు చేస్తాను.. మీరు చెప్పిన భయాలు నాకేం లేవు’’ అన్నాడు కాశి.
‘‘నాక్కూడా సంపద మీద విరక్తి కలుగుతోంది కాశి.. కోట్లు, కోట్లు సంపాదించాను.. గుడ్ సమారిటన్ హాస్పిటల్‌లో నాకు పార్ట్‌నర్‌షిప్ వుంది.. వచ్చిన లాభాలన్నీ స్విస్ బ్యాంకులో జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా నా బ్యాంక్ అకౌంట్లు అన్నీ నేనే మెయిన్‌టెయిన్ చేసుకున్నాను. జీవితం ఏ క్షణంలో ముగుస్తుందో ఎవరికి తెలియదు.. నా ఎకౌంట్ నెంబర్లు, కోడ్ నెంబర్లు, డబ్బు ఎలా డ్రా చెయ్యాలో నువ్వూ తెలుసుకోవాలి!’’
‘‘మీ బ్యాంక్ ఎకౌంట్ల వివరాలు నాకెందుకు?’’’ సూటిగా ప్రశ్నించాడు.
‘‘నువ్వు నా బాల్య స్నేహితుడివి.. నాకు బంధువులు ఎవరూ లేరు.. నా పేరు మీద వున్న బిల్డింగ్స్ ఎక్కడెక్కడ వున్నాయో ఎవరికీ తెలియదు.. అకస్మాత్తుగా నేను చనిపోతే నా ఆస్తి ఏమవుతుంది? నా ఆత్మీయులే నా సంపద అనుభవించాలి! చెల్లాచెదరుకాకుండా ఆ ఆస్తికి వారసుడిని ఎంపిక చేసుకోవాలి నేను. అలా ఆలోచిస్తున్నపుడు నా మెదడులో నువ్వు మెదిలావ్.. నీకంటే నాకు ఆత్మీయులు ఎవరున్నారు.. యు ఆర్ ఫెయిత్‌ఫుల్ టు మి ఎవర్ సిన్స్ అవర్ చైల్డ్‌హుడ్.. అడ్వకేట్‌ను పిలిచి విల్లు రాస్తాను.. నా తదనంతరం ఆస్తిపాస్తులు నీకే చెందుతాయి..’’
‘‘నాకొద్దు.. నాకొద్దు.. అనాథాశ్రమాలకు రాసేయ్యండి...’’ అన్నాడు కాశి.
‘‘నిన్ను వేస్ట్‌ఫెలో అనేది అందుకే! చిన్నప్పటినుంచి నిన్ను నా స్థాయికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే నువ్వెప్పుడు సహకరించవు.. అదే నీతో వచ్చిన చిక్కు! నువ్వు ఆపదల్లో వున్నపుడు ఎన్నోసార్లు ఆదుకున్నాను.. కానీ నన్ను పూర్తిగా నమ్మవు.. నా మూలంగా నీకేదో ద్రోహం జరిగినట్లు భావిస్తావ్.. నాకు నువ్వు తప్పితే ఎవ్వరూ లేరు కాశీ!’’
అరవింద్ మాటలు నమ్మాలో లేదో అర్థం కాలేదు. మళ్లీ తనను మరో సుడిగుండంలోకి నెట్టేయ్యడు గదా!
జాగ్రత్తగా వుండాలి.. పెద్ద మేధావిననుకుంటాడు.. తనను ఎందుకు పనికిరాని వెధవని అతని అభిప్రాయం...
మైండ్ బ్లాంక్ అయ్యేటట్లు దెబ్బకొట్టాలి.. తనకూ ఓ అవకాశం తప్పకుండా వస్తుంది.. ‘కాశిని అండర్ ఎస్టిమేట్ వేశాను.. ననే్న బోల్తాకొట్టించాడు’ అని అరవింద్ అనుకునే రోజు వస్తుంది.
‘‘జాగ్రత్తగా విను. నాకు ఫారిన్ బ్యాంకులో కూడా ఎకౌంట్స్ వున్నాయి.. వాటి వివరాలు, అవి ఎలా ఆపరేట్ చేయాలో నీకు వివరంగా చెబుతాను.. కొన్ని బ్యాంకుల్లో మనిద్దరి పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాను.. ఇప్పటినుండే బ్యాంకులకు వెళ్లి నా పేరు మీద డిపాజిట్ అయ్యే మొత్తాలు చెక్ చేస్తూ వుండు’’ అంటూ ఓ పేపరు కాశీకి ఇచ్చాడు.
‘‘ఈ పేపర్‌మీద స్విస్ బ్యాంక్ ఎకౌంట్ ఎలా డీల్ చెయ్యాలో, మెయిల్ ట్రాన్స్‌పర్ ఎలా చెయ్యాలో వివరాలన్నీ రాశాను.. నీ దగ్గర సేఫ్‌గా వుంచు.. నిన్ను పూర్తిగా నమ్మి వివరాలన్నీ నీకు పూర్తిగా చెబుతున్నాను.. ఎవరికి నా బ్యాంక్ అకౌంట్ సీక్రెట్ కోడ్ నెంబర్లు వెల్లడించకు.. ఈసారి హైదరాబాద్ వెళ్లినపుడు నా ఎకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చెయ్యి! రెండు మూడు ట్రాన్సాక్షన్స్ చేస్తే నీకు నా కోడ్ నెంబర్లు నోటికి వచ్చేస్తాయి’’ అన్నాడు డాక్టర్ అరవింద్.
అతను చెప్పేది నిజమేనా?

- ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ