డైలీ సీరియల్

వ్యూహం-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండునెలల క్రిందట పాకిస్తాన్‌లో వున్న గుడ్ సమారిట్ హాస్పిటల్ మూతపడింది. అక్కడి ప్రభుత్వం ఆ హాస్పిటల్‌ను హేండోవర్ చేసుకుంది. పేదవాళ్ళ కిడ్నీలు, ఇతర అవయవాలు పెద్ద ఎత్తున మార్పిడి జరుగుతున్నాయనే విషయాలు బయటపడడంతో బోర్డు సభ్యుల్లో ఆందోళన పెరిగింది. అనాజ్‌ను చైర్మన్‌గా ఎన్నుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అరిఫ్ కొడుకు మీద ఒత్తిడి తెచ్చి వప్పించారు.
అరిఫ్‌కు మద్దతుగా ఐదుగురు మెంబర్లు వుండేవారు. అతను, అతని భార్య పాకిస్తాన్ హాస్పిటల్లో హెడ్‌గా పనిచేస్తున్న నవాజ్, పాట్నా సమీపంలో వున్న హాస్పిటల్లో హెడ్, మరో మెంబరు డాక్టర్ అరవింద. పాకిస్తాన్‌లో వున్న నవాజ్ మీద క్రిమినల్ కేసులు వున్నాయి. జైల్లో వున్నాడతను.
జైల్లో వున్న నవాజ్ బోర్డు మెంబర్‌గా అనర్హుడని గుడ్ సమారిట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. మైనారిటీలో పడిపోయింది అరిఫ్ వర్గం. అనాజ్‌ను బోర్డు చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
ఆ ఎన్నిక చెల్లదని దుబాయి కోర్టులో కేసు వేశాడు అరిఫ్.
పరిస్థితులు అలావుంటే భద్రాచలం దగ్గర వన్న హాస్పిటల్ మీద ఆరోపణలు రావడం, పోలీసులు ఎప్పుడు డాక్టర్ అరవింద్ మీద క్రిమినల్ ఛార్జెస్ పెడతారోని హడలిపోతున్నాడు అరిఫ్.
భార్య కూడా కొడుక్కు సహకరిస్తుందేమోనన్న అనుమానం టెన్షన్‌లో పడిపోయాడు.
అడ్డు తగులుతున్న డాక్టర్ వౌర్య, డాక్టర్ ఫణిని హత్య చేయించాడు. ఆ హత్య కేసులు చుట్టుముడుతూ వున్నాయి.
ద్రాక్షారామం దగ్గర కారులో డ్రగ్స్ రవాణా చేస్తున్న అనుచరులు పోలీసులకు చిక్కారు. ఆ కేసుల్లో కూడా ఎ వన్‌గా అరిఫ్ పేరే వుంది.
డాక్టర్ అరవింద్‌కు ఫోన్ చేశాడు అరిఫ్.
‘‘నేను తరచూ ఇండియా రావడం క్షేమంగా లేదు. ఎప్పుడో ఒక రోజు నన్ను అరెస్టు చేసే ఉద్దేశంలో వున్నారు పోలీసులు. ఇంటర్‌పోల్ సహాయం కూడా తీసుకుంటారు. భద్రాచలం దగ్గర వున్న హాస్పిటల్ ముంబై సేఠ్‌కు అమ్మేద్దామనుకుంటున్నాను. నువ్వు వెంటనే హాస్పిటల్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకుని ముంబై వచ్చెయ్యి..’ అన్నాడు అరిఫ్ హిందీలో.
‘‘రెండు మూడ్రోజుల్లో వచ్చేస్తాను’’ సమాధానం ఇచ్చాడు అరవింద్.
***
డాక్టర్ లోహిత వుండే కాటేజ్‌కు వచ్చాడు కాశీ.
‘‘నీకో విషయం చెప్పాలి’’ అన్నాడతను.
రూములో మాట్లాడితే నిఘా విభాగం వాళ్ళకు వినబడుతుందన్న విషయం గుర్తుకువచ్చింది అతనికి.
రూముల్లో మైక్రోఫోన్స్ పెట్టడం, టెలిఫోన్ టాప్ చెయ్యడంలో అతను సిద్ధహస్తుడు. ఆ రూము బగ్గింగ్ చేసింది తనేనన్న విషయం గుర్తుకువచ్చి నవ్వుకున్నాడు. ఇప్పుడు తను మారిపోయిన మనిషి.
‘‘బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం!’’ అన్నాడతను.
అతను ఎందుకు ఆ మాట అన్నాడో అర్థం చేసుకుంది లోసిత.
బయట చెట్లక్రింద కూర్చున్నారు.
‘‘రేపు డాక్టర్ అరవింద్ ముంబై వెళ్తున్నాడు’’
‘‘ఎందుకు?’’ అని అడగలేదు.
అన్ని వివరాలు అతనే చెబుతాడు.
‘‘బ్రీఫ్‌కేసులో డాక్యుమెంట్లు, మరికొన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్లు.. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పేపర్లు కూడా వున్నాయి’’ అన్నాడతను.
‘‘ఆ విషయం మనకు ఎందుకులే!’’ అందామె ఆసక్తి లేనట్లుగా.
‘‘అరిఫ్ ఈ హాస్పిటల్ అమ్మే ప్రయత్నంలో వున్నాడు’’
‘‘మంచిదే కదా! మనం ఫ్రీబర్డ్స్ అయపోతాం! ఈ హాస్పిటల్లో పని చేస్తుంటే పేదలకు సేవ చేస్తున్నట్లు లేదు.. వాళ్ళ రక్తం పిండుతున్నట్లుగా వుంది’’
‘‘ఇక్కడ ఎన్నో అక్రమాలు చేసి దర్జాగా ఇక్కడనుండి చెక్కేస్తే ఎలా? వాళ్ళను పోలీసులకు పట్టి ఇవ్వాలి! ఆ డాక్యుమెంట్లు అరిఫ్‌కు అందకూడదు.. పోలీసుల చేతుల్లో పడాలి.. స్కందకు అందజేస్తే సగం పని అయిపోతుంది’’ అన్నాడతను.
‘‘ఎలా?’’ అడిగిందామె.
అటువైపు ఎవరో రావడంతో మాట్లాడుకోవడం ఆపేశారు. వాళ్ళు వెళ్లిపోయేక కాశి ఆమె చెవిలో ఏదో చెప్పాడు.
***
స్కంద తల్లి మానసకు ఎప్పటినుంచో శ్రీశైలం చూడాలని అనుకుంటూ వుంది. అమెరికాలో ఉన్నప్పుడు కూడా నాలుగైదుసార్లు అనుకుంది ఇండియా వెళ్ళగానే శ్రీశైలం కొడుకుతో కలిసి వెళ్లాలని కారులో బయల్దేరారు.
సిటీలిమిట్స్ దాటేక స్పీడు పెంచాడు స్కంద.
ఘాటు రోడ్డుకు చేరుకునేసరికి పనె్నండు అయ్యింది. ఆ రోడ్డు స్కందకు కొత్తేమీ కాదు. నాలుగైదుసార్లు కారులో ఆ రోడ్డుమీద ప్రయాణం చేశాడు.
టైము చూసుకున్నాడు. మరో గంట ప్రయాణం చేస్తే శ్రీశైలం చేరుకుంటాడు. అమెరికాలో తన మెడికల్ ప్రాక్టీసు గూర్చి చెబుతూ వుంది. అక్కడ సంపాదించిన డాలర్లతో ఇండియాలో ఎక్కడెక్కడ భూములు కొన్నది చెప్పింది.
ఆ కబుర్లు స్కందకు ఆసక్తి కల్గించలేదు.

ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ