డైలీ సీరియల్

యాజ్ఞసేని-45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్రౌపదీ! నీవు మహాపతివ్రతల కోవకు చెందిన దానవు. ముందు ముందు నా కొడుకులు నీపట్ల అనుచితంగా ప్రవర్తించినా, బాధపెట్ట ప్రయత్నించినా నామీద గౌరవంతో వారిని ఎలాంటి శాపానికి గురి చేయవద్దని నిన్ను ప్రార్థించుచున్నాను. నా మాటపై గౌరవం వుంచుతావని నమ్ముచున్నాను’’ అని ఆవేదనతో నివేదించింది. ఆ మాటలు విన్న ద్రౌపది గాంధారితో-
‘‘మహారాణి! గాంధారి మాతా! నాకుగా నేను నీ పుత్రులకు ఎలాంటి కష్టాన్ని కలిగించను. నాపట్లవారు అసభ్యంగా, అనుచితంగా ప్రవర్తించి నన్ను క్షోభపెట్టినా నేను ఆగ్రహించనని నీకు మాట ఇస్తున్నాను. కాలమే వారికి ఎలాంటి శిక్ష విధించాలో నిర్ణయిస్తుంది. ఇక నాకు శలవు ఇప్పించండి. అనుజ్ఞ ఇవ్వండి’’ అని క్లుప్తంగా సమాధానమిచ్చింది.
గాంధారి ద్రౌపదిని ప్రేముడి కౌగిలించుకుని ‘అనుజ్ఞ ఇస్తున్నాను, క్షేమంగావెళ్లిరా’ అని అన్నది.
ద్రౌపది బరువెక్కిన హృదయంతో అక్కడనుంచి నిష్క్రమించింది.
తరువాత కుంతీదేవి గాంధారిని చూడవచ్చింది. గాంధారి పాదాలను నమస్కరించింది.
గాంధారి కుంతీదేవిని ఆప్యాయతతో చేతులను పట్టి ‘‘పాండుపత్నీ! క్షేమంగా వెళ్లిరా’’ అని అనుజ్ఞనిచ్చింది.

26
పాండవులు కుంతీదేవితో, పత్ని ద్రౌపదితో శ్రీకృష్ణుడు వెంటరాగా ఖండవప్రస్థానికి బయలుదేరారు.
వారి ననుసరించి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, జానపదులు, దాసదాసీజనం, పరిమిత కాల్బలము అనుసరించారు. అందరూ ఖాండవప్రస్థానికి చేరారు.
శ్రీకృష్ణుడు మనస్సులో దేవతలరాజైన ఇంద్రుని తలచుకొనగా ఇంద్రుడు వచ్చాడు.
శ్రీకృష్ణుని నమస్కరించాడు
‘‘వాసుదేవా! ఏమి ఆజ్ఞ! దానిని పాలించటానికి సిద్ధంగా ఉన్నాను’’ అని అన్నాడు.
‘‘దేవేంద్రా! పాండవులు ఇపుడు ఖాండప్రస్థానికి వచ్చారు. వీరికి ఒక నగరము, ఒక సభాభవనము అవసరం. అందుకోసం ఒక అద్భుతమైన సభా భవనాన్ని నిర్మించి ఇమ్ము’’ అని అన్నాడు.
మహేంద్రుడు వెంటనే ‘విశ్మకర్మ’ను తలంచాడు. విశ్మకర్మ (మయుడు/ మయాసురుడు) వచ్చాడు. ఇంద్రుడన్నాడు-
‘‘శిల్పాచార్యా! విశ్వకర్మా! బుద్ధిశాలీ! పాండుసుతులు ఖండవప్రస్థానికి వచ్చారు. వారికి ఒక నగరము అవసరము. నీవు వెంటనే ఖాండవప్రస్థ నగర నిర్మాణం చేపట్టాలి. ఆ నగరమే ఇక ‘ఇంద్రప్రస్థం’ అను పేర ప్రసిద్ధిచెందాలి’’ అని..
విశ్వకర్మ శ్రీకృష్ణునికి నమస్కరించాడు. ‘‘స్వామీ! మీ ఆజ్ఞను పాలిస్తాను’’ అని అన్నాడు.
‘‘మయాసురా! విశ్వకర్మా! కురురాజైన యుధిష్ఠిరునకు ఇంద్ర నగరం వంటి ఒక నగరాన్ని నిర్మించుము. రాబోయేకాలంలో అది ఇంద్రప్రస్థమనే పేరును గడించాలి’’ అని శ్రీకృష్ణుడన్నాడు.
విశ్వకర్మ శ్రీకృష్ణుని, దేవేంద్రుని అనుజ్ఞ గైకొని అదృశ్యమయ్యాడు.
పిమ్మట పవిత్రం, మంగళం అయిన ప్రదేశంలో శ్రీకృష్ణద్వైపాయనుని ముందుంచుకొని మహారథులైన పాండవులు శాంతికర్మను చేసి నగరనిర్మాణం చేయటానికి కొలిపించారు.
ఆ నగరానికి నలువైపులా సాగరసదృశాలు, అగాథాలు అయిన పరిఖలు త్రవ్వించారు. ప్రాకారాలతో ఆ నగరం ఆకాశాన్ని తాకేలా నిర్మించబడింది.
ఎతె్తైనగోపుర ద్వారాలతో నగరం సురక్షితమైనదిగా కన్పట్టుచున్నది.
నాలుగువైపులా విసరటానికి వీలైన లోహశక్తులు నిండుగా వున్నాయి. పదునైన అంకుశాలు, శతఘు్నలు, యంత్రజలాలతో, యుద్ధ సామగ్రితో నగరం నిండుగా వుండేటట్లు చేయబడింది.
విశాలమైన వీధులతో నాలుగువైపులా వెళ్ళటానికి వీలుగా నగరం ప్రకాశిస్తున్నది. ఆకాశ హర్మ్యాలతో నగరం నిండి ప్రకాశవంతంగా శోభిస్తున్నది.
ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని పేరుపెట్టారు.
ఆ నగరంలోని సుందర పవిత్ర ప్రదేశాలలో యుధిష్ఠిరుని నివాస గృహం నిర్మింపబడ్డది.
అన్ని భాషలు తెలిసినవారు, ధనార్థులైన వ్యాపారులు, శిల్పకళాకారులు, శ్రేష్ఠులైన పురుషులు, అసంఖ్యాక స్ర్తి పురుషులు ఆ నగరంలో నివసించటానికి వచ్చారు.
మాలాకారులు (పూలు కట్ట అమ్మేవారు), కోలికులు (పద్మశాలీలు, చేనేత కళాకారులు), తిలపిష్టులు (గాండ్లవారు. గానుగల నుండి రకరకాల నూనెలను తీసేవారు), బదయాత్రకులు / కానాకారులు (కంచు పనిచేసేవారు), తెసకారులు (మెఱుగుపెట్టేవారు), కుంభకారులు (కుమ్మరివారు) చర్మకారులు, గంధకులు, సువర్ణకళాకారులు (బంగారు పనులు చేసేవారు /స్వర్ణకారులు), వధకులు (వడ్రంగులు /కట్టె పనులు చేసేవారు), సెలవడికినులు (శిల్ప రాతి) కళాకారులు), కువిందులు (బట్టలు చేసేవారు) మొదలైన అనేక గ్రామీణ కళాకారులతో నగరము నిండుగా శోభిల్లినది.

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము