డైలీ సీరియల్

యాజ్ఞసేని-47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను తిరిగి వెళ్లిపోతున్నానని విచారవదనుడై వున్న ధర్మరాజుతో శ్రీకృష్ణుడు-
‘‘మహాభాగా! నీవు ధర్మవేత్తవు. నీ సామర్థ్యం చేతనే నీ రాజ్యాన్ని నీవు స్వధర్మానుసారం పొందగలిగావు. తాతతండ్రుల రాజ్యం నీకెందుకు రాదు? దురాచారులైన ధార్తరాష్ట్రులు పాండవులను ఏమీ చేయలేరు. ధర్మభారం వహిస్తూ రాజ్యపాలన చేయుము. ధర్మమూర్తి! బ్రాహ్మణులను సేవింపుము. నారద మహర్షి ఇక్కడికి రాగలడు. అతడు చెప్పే వాక్యాలు శ్రద్ధగా విని రాజ్యపాలన చేయుము’’ అని ధర్మరాజును వూరడించి పలికి అత్త కుంతీదేవి వద్దకు వచ్చాడు. కుంతీదేవికి పాదాభివందనం చేశాడు. ప్రియ వచనాలతో అత్తతో-
‘‘అత్తా! నమోస్తుః! నాకు సెలవు నొసంగుము వెళ్లివస్తాను’’ అని అన్నాడు.
కన్నీళ్ళ పర్యంతమైన కుంతీదేవి శ్రీకృష్ణుని ప్రేమతో ‘‘శేవవా! నీవు ద్వారకకు వెళతానంటే నా మనసు చింతించుచున్నది. లక్షాగృహంలో పడిన కష్టాలలు నా తండ్రి కుంతి భోజునకు తెలియవు. గోవిందా! నీ సహయంచే గొప్ప సముద్రం వంటి కష్టాన్ని దాటాము. ప్రభూ! నీవు దీనులకు రక్షకుడవు. నీ దర్శనభాగ్యంతో మా కష్టాలన్నీ నశించాయి. దేవకీ సుతా! పాండవులను నీవెప్పుడూ మరువకుము. నీ చింతతో వారు సదా జీవించి వుంటారు’’ అని పలికింది.
పిమ్మట వాసుదేవుడు ద్రుపద రాజపుత్రి యాజ్ఞసేని వద్దకు వచ్చాడు.
‘‘సోదరీ! ద్రౌపదీ! ఇక నేను ద్వారకకు బయలుదేరుచున్నాను. భర్తల అనురాగాన్ని సదా పొందుచూ సుఖంగా వుండుము. అత్తగారిని సదా సేవిస్తూ కీర్తి గడించుము’’ అని అనగా ద్రౌపది దీనంగా వాసుదేవుని చూచి-
‘‘అన్నా! యదునందనా! నీవు ఎల్లప్పుడూ ధర్మపక్షపాతివి. వాసుదేవా! నీవలననే నేను ఇంతవరకు సుఖభోగాలను అనుభవించాను. నేడు పాండు పుత్రులను భర్తలుగా నీ దయవలననే పొందగలిగాను. ద్వారకావాసా! కౌరవులు క్రూరులు. అతి కుత్సితులు. వారు ఎల్లప్పుడూ పాండవులకు కీడుజేయ ప్రయత్నిస్తుంటారు. నాకు కూడా కీడుతలపెట్టరని భావింప వీలులేదు. నీ దయగలదేని మేము ఎన్ని కష్టలనుండి అయినా రక్షింపబడగలము. కృష్ణా! నీ ఈ సోదరిని ఎప్పుడూ మరువకుము. నీవే నాకు అన్ని విధాలా రక్షకుడవు’’ అని పాదాలకు నమస్కరించింది.
శ్రీకృష్ణుడు ద్వారకకు బయలుదేరాడు. రథాన్ని అధిరోహించాడు. ధర్మరాజు రథసారథి అయిన ద్వారకుని ప్రక్కకుబెట్టి తానే స్వయంగా పగ్గాలను పట్టాడు. భీముడు రథంపై గదను బట్టి నిలబడగా, అర్జున నకుల సహదేవులు వింజామరలు విసురుతుండగా శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థం నుండి కొంతదూరం వరకు పయనించిన తరువాత వారు రథాన్ని దిగి వీడ్కోలు పలికారు. శ్రీకృష్ణుడు ముందుకు సాగిపోయాడు. అతడి రథపు ధ్వజము, రథము కనులకు కనపడేటంతవరకు నిలబడి చూస్తూ రథం కనుమరుగయిన తరువాత బరువైన హృదయాలతో రాజధానికి చేరారు.
27
శ్రీకృష్ణవాసుదేవుడు బలరామ సహితంగా ద్వారకా నగరానికి చేరాడు.
శ్రీకృష్ణుడు వెళ్లిన తరువాత మరునాడు త్రిలోక సంచారి, దేవర్షి అయిన నారదముని ప్రీతితో ఇంద్రప్రస్థంలోని ధర్మరాజును చూడవచ్చాడు. అలా వచ్చిన నారద మహర్షిని చూచిన ధర్మరాజు ఎదురేగి గౌరవంగా ఆహ్వానించి తన ఆసనాన్ని మహర్షికి ఇచ్చాడు. ఆసీనుడైన మహర్షికి ధర్మరాజు స్వయంగా యధావిధిగా అర్ఘ్యాదులను ఇచ్చాడు. పూజించాడు. ప్రసన్నుడైన నారదుడు ధర్మరాజును ఆశీర్వదించాడు.
తదుపరి నారద మహర్షి ధర్మరాజుకు రాజ ధర్మాలను, ప్రజలను ఏ రకంగా రంజింపచేయాలో, వారిని ఎట్లు పాలించవలెనో తెలియజెప్పాడు. చతుర్వర్ణాలవారికి తగినట్లుగా రాజ్యపాలన చేస్తూ రాజ్యాన్ని ఎలా సురక్షితంగా వుంచాలో బోధించాడు. అంతేగాక ప్రజలపై పన్నులను ఏ స్థాయిలో, ఏ రూపంలో విధించాలో వివరించాడు.
రాజనీతిని అత్యంత ప్రామాణికగా ఎలా పాటించాలో వివరంగా బోధించాడు.
ధర్మరాజు నారద మహర్షి రాకను ద్రౌపదికి తెలియపరిచాడు. ద్రౌపదీదేవి పాండవులతో నారదుడు వున్నచోటికి వచ్చింది. మహర్షి పాదాలకు నమస్కరించింది. అతడు ప్రీతితో ఆమెను ఆశీర్వదించాడు. ద్రౌపది అక్కడినుండి వెళ్లిపోయింది.
ద్రౌపది వెళ్లిపోయిన తదుపరి నారదుడు ఏకాంతంలో పాండవులతో ‘‘కీర్తినివ్వగల ద్రౌపది మీకు ఒక్కతే ధర్మపత్ని. మీలో మీకు అకారణం వైరం పెరగకుండా వుండండి. మీకు శుభమగుగాక. మీ అయిదుగురి భవనాలలో పాపం లేని ద్రౌపది ఒక్కొక్క సంవత్సరం నివసించాలి.

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము