డైలీ సీరియల్

యాజ్ఞసేని-48

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాభాగా! నీవు సమర్థుడవు. మేము నీ అధీనంలో వున్నాము. మహారాజా! త్వరలోనే రాజసూయయాగాన్ని పూర్తిచేయగలవు. ఇంక సంకోచించకుండా యాగంపై మనసు పెట్టండి’’’ అని అన్నారు.
ధర్మరాజు ధర్మబద్ధం, సాహపూర్ణం, అభీష్టం, శ్రేష్ఠం అయిన మంత్రుల మాటలను మనసారా స్వీకరించాడు. తదుపరి మహాత్ములైన ఋత్విక్కులతో, ధౌమ్యునితో, వేదవేదాంగ పారంగతుడైన వ్యాసమహర్షితో రాజసూయయాగాన్ని గురించి సంప్రదించి వారితో
‘‘రాజసూయమన్న ఈ ఉత్తమ క్రతువు ఏ సామ్రాట్లుకో తగినది.. నాకు దానిపై శ్రద్ధ కల్గుచున్నది. నా ఈ కోరిక ఎలా వున్నదో దయజేసి మీరు ఆలోచించి చెప్పండి’’ అని ప్రార్థించాడు. వారు కూడా ఆ సమయానికి తగినట్లుగా ధర్మరాజుతో
‘‘్ధర్మజ్ఞా! రాజసూయయాగానికి తగినవాడవు’’ అని అన్నారు.
పిమ్మట ‘‘నేన్కొడినే నిశ్చయించి యజ్ఞకర్మ నారంభించరాదు’’ అని భావించాడు. రాజసూయ కార్యనిర్ణయంలో శ్రీకృష్ణవాసుదేవుని అందరికన్నా మిన్నగా తలించాడు. ఆయన లోకరక్షణ కోసమే జన్మించాడు. ఆయనకు తెలియనది ఏమీయూ లేదు. చేయలేనిది కూడా ఏమీయూ లేదు. అని ఒక నిర్ణయానికి వచ్చి సర్వప్రాణులకూ గురువైన శ్రీకృష్ణుని దగ్గరకు ఇంద్రసేనుని దూతగా పంపాడు. దూతగా వచ్చిన ఇంద్రసేనుడు విషయాన్ని శ్రీకృష్ణునికి విన్నవించాడు.
ఇంద్రసేనుని సందేశాన్ని విన్న శ్రీకృష్ణుడు అతడితో కలిసి ఇంద్రప్రస్థనగరానికి వచ్చాడు.
ధర్మరాజు, అతడి సోదరులను భీమార్జున నకుల సహదేవులను ప్రీతితో కలిసి వారి పూజలను అందుకున్నాడు. విశ్రాంతి అనంతరం పాండవులందరూ శ్రీకృష్ణుతో సమావేశమయ్యారు. అప్పుడు యుధిష్ఠిరుడు-
‘‘కృష్ణా! వాసుదేవా! నేను రాజసూయాన్ని చేయ తలపెట్టాను. కానీ అది సంకల్పంతో అయ్యేది కాదు. దాని నిర్వహణ మార్గాలన్నీ నీకే తెలుసును. కానీ కృష్ణా! నీ మాటను బట్టే అంతిమ నిర్ణయం వుంటుంది. కొందరు స్వప్రయోజనం కోసం మాట్లాడుతారు. కొందరు తమకు హితమైనదే నాకు ప్రియమైనదని భావిస్తారు. కాబట్టి ఆ కారణాలన్నింటినీ పక్కకు నెట్టి ఈ లోకంలో నాకు సరిపోయిన దానినే చెప్పవలసిందిగా నిన్ను ప్రార్థిస్తున్నాను’’ అని అన్నాడు. అందుకు శ్రీకృష్ణుడు-
‘‘మహారాజా! సత్యమూర్తీ! నీవు సర్వగుణ సంపన్నుడవు. రాజసూయయాగం చేయదగినవాడవు. అయితే రాజా! ప్రస్తుతం మగధ దేశాధిపతి అయిన జరాసంధుడు సమస్త రాజుల సంపదను కొల్లగొట్టి సామ్రాట్టుగా ప్రసిద్ధి చెందాడు. అందరి రాజులపై ఆధిపత్యాన్ని వహించి తన బల పరాక్రమాలతో భయపెడుతున్నాడు. అంతేగాక మిత్రభేదాన్ని కల్పిస్తున్నాడు. అతడిని ఆశ్రయించిన చేదిభూపాలుడు ‘శిశుపాలుడు’ వున్నాడు. అతడికి సేనాధిపతి అయ్యాడు. వీరేగాక భగదత్తుడు, వంగ పుండ్ర, కిరాత దేశాధిపతి అయన పౌండ్రకుడు కూడా జరాసంధుని పక్షాన వున్నారు.
అందువలన జరాసంధుని వధించనిదే నీవు రాజసూయయాగము చేయటం బహుక్లిష్టమైన పని. కావున జరాసంధుని వధించే ఉపాయాన్ని ఆలోచించి సకల రాజన్యులను విడిపించితేగానీ రాజసూయయాగపు యత్నం పూర్తిగా సఫలం గాదు. జరాసంధుని బంధనలోనున్న రాజులందరినీ విడిపించితే వారంతా నీకు విధేయులై వుంటారు’’ అని శ్రీకృష్ణుడు అన్నాడు.
తదుపరి ధర్మరాజు భీమార్జున నకుల సహదేవులు శ్రీకృష్ణునితో చర్చించారు. జరాసంధుని వధను గురించి. శ్రీకృష్ణుని సలహాను అందరూ అంగీకరించారు. ధర్మరాజు అనుమతితో శ్రీకృష్ణ్భీమార్జునులు మగధకు బయలుదేరారు. జరాసంధుని ముఖాముఖి కలిశారు. శ్రీకృష్ణుని వ్యూహం ప్రకారం జరాసంధుడు భీమునితో యుద్ధం జేయ నిశ్చయించాడు. భీమ జరాసంధుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఒకరినొకరు బాధించుకున్నారు. బాహువులతో కలియబడ్డారు..
కార్తీకమాసపు మొదటిరోజున ఆ యుద్ధం తిండిలేక, విశ్రాంతి లేక రాత్రింబవళ్ళు జరిగింది. చతుర్ధశినాటి రాత్రి జరాసంధుడు అలసి యుద్ధం నుండి మరలాడు.
‘‘ఇతడు మొలకు బిగించిన వస్తక్రారణంగా ఈ పాపాత్ముని ప్రాణాలు హరించాలని నాకు తోచటంలేదు’’ అని భీమసేనుడు అనగా శ్రీకృష్ణుడు-
‘‘నీవు సర్వోత్కృష్టుడవైన దేవతవు. పైగా వాయుబలంతో కూడినవాడివై ఉన్నావు. ఆ బలాన్నంతటినీ జరాసంధునిపై మా యెదు ట ఈ రోజు చూపుము’’ అని అన్నాడు.

- ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము