డైలీ సీరియల్

యాజ్ఞసేని-50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ మాటలు వినిన భీమసేనుడు తదుపరి యుద్ధం మొదలుకాగానే జరాసంధుని ఆకాశంలోనికి ఎత్తి గిరగిరా త్రిప్పాడు. క్రింద పడవైచాడు. ఒక పాదాన్ని త్రొక్కిపట్టి మరొక పాదాన్ని పైకి లాగి జరాసంధుని శరీరాన్ని రెండుగా చీల్చి వ్యతిరేక (విపరీత) దిశలలో పడవేశాడు. అప్పుడు ఆ రెండు భాగాలు ‘జర’ అనే రాక్షసి సంధించినట్లుగా సంధింపబడక జరాసంధుడు మరణించాడు. అతడి మృతశరీరాన్ని రాజద్వారం దగ్గర విడిచి భీమార్జున శ్రీకృష్ణులు వెడలిపోయారు.
‘సౌందర్యవంతం’ అనే జరాసంధుని రథాన్ని ధ్వజాలతో అలంకరించి అందు శ్రీకృష్ణుడు భీమార్జునులను కూర్చుండబెట్టాడు.
కారాగారంలో బంధింపబడి వున్న రాజులను, బంధువులను, అందరినీ విడిచిపెట్టాడు.
గిరివజ్రపురం నుండి రాజులతో కలిసి బయలుదేరాడు.
అంతకుముందు జరాసంధుని మరణానంతరం అతడి కుమారుడైన సహదేవుని (మాగధ సహదేవుడు) మగధడు రాజుగా పట్ట్భాషిక్తుని చేశాడు. స్నేహితునిగా మన్నించాడు.
భీమార్జునులతో కలిసి శ్రీకృష్ణుడు ఇంద్రప్రస్థపురానికి చేరి ధర్మరాజుకు ఆనందాన్ని కలుగజేశాడు.
‘‘మన అదృష్టంవలన భీమసేనునిచే జరాసంధుడు చంపబడ్డాడు. రాజులందరూ కారాగారం నుండి విముక్తులయ్యారు. ఏ పీడలు, గాయాలు లేకుండా భీమాన్జునులు తిరిగి ఈ నగరానికి రాగలిగారు’’ అని అన్నాడు శ్రీకృష్ణుడు.
ధర్మరాజు శ్రీకృష్ణుని పూజించాడు. సంతోషంతో వారందరినీ విడివిడిగా కౌగిలించుకున్నాడు.
‘‘కృష్ణా! వాసుదేవా! నీ సహాయంవలన భీమసేనుడు బలాభిమదం చేత ఉన్మత్తుడయిన జరాసంధుని పడగొట్టాడు. ఇపుడు నిశ్చితంగా యజ్ఞాలలో శ్రేష్ఠమైన రాజసూయాన్ని చేస్తాను.
నీ బుద్ధిబలంతో అది నాకు సాధ్యమై, యాగం చేయటానికి అర్హుడనయ్యాను అని పలికిన ధర్మరాజు మగధనుంచి తెచ్చిన ఆ దివ్యరథాన్ని శ్రీకృష్ణునికి సమర్పించాడు. శ్రీకృష్ణుడు దానిపై అర్జునునితో సహా ఎక్కి కూర్చుండి సంతోషాన్ని పొందాడు. ఆ కానుకను గైకొన్నాడు.
జరాసంధుని చెరనుండి విముక్తులైన రాజులందరినీ ధర్మరాజు సోదరులతో కూడి కలిశాడు.
వారిని తగిన రీతిన సత్కరించాడు. వారి వారి రాజ్యాలకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఆ రాజులందరూ సంతోషంతో ధర్మరాజుకు మ్రొక్కి వారి వారి రాజ్యాలకు వెడలిపోయారు.
పాండవులచే పూజింపబడిన శ్రీకృష్ణుడు ధర్మరాజు అనుజ్ఞను పొంది ద్వారకకు బయలుదేరాడు. కుంతీదేవిని దర్శించి ఆమె పాదాలకు నమస్కరించి అనుజ్ఞను కోరాడు. కుంతీదేవి శ్రీకృష్ణునితో -
‘‘కృష్ణా! వాసుదేవా! నీవు ఇక్కడ వున్నంతకాలం నా హృదయం సంతోషంతో వుంటుంది. నీవు ఎల్లప్పుడూ పాండవుల హితాన్ని కోరుతావు. వారిని సదా కాపాడే భారం నీదే గదా! మరలా నిన్ను ఎప్పుడు చూడగలనో’’’ అని అనుజ్ఞ నొసంగింది. శ్రీకృష్ణుడు ద్రౌపదిని ప్రేమతో పలకరించాడు.
‘‘చెల్లీ! ద్రుపద రాజపుత్రీ! సౌభాగ్యవతివై సుఖసంతోషాలతో వర్థిల్లుము’’ అని ఆమె అనుమతిగొని బయలుదేరాడు.
చెల్లెలైన సుభద్రను కూడా చూచాడు. భీమార్జున నకుల సహదేవులను కౌగిలించుకున్నాడు.
ధౌమ్యుని అనుజ్ఞను కూడా పొంది వారందరినీ వీడ్కొని ఆ దివ్య రూపంలో దిక్కుల్ని ప్రతిధ్వనింపజేస్తూ ద్వారకకు బయలుదేరాడు. పాండవులు శ్రీకృష్ణునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. శ్రీకృష్ణుడు సంతోషంగా ద్వారకకు చేరాడు.
***
రాజసూయయాగం చేయ ధర్మరాజు సంకల్పించాడు. ముందుగా తన తమ్ములతో సంప్రదించాడు. అప్పుడు అర్జునుడు ధర్మరాజుతో-
‘‘రాజా! విల్లు, అస్త్రాలు, బాణాలు పరాక్రమం, సహాయకులు, రాజ్యం, కీర్తి, సైన్యం లాంటి దుర్లభమైనవన్నీ మనోవాంఛానుసారం పొందాను. ధన్యుడనయ్యాను. కోశాన్ని పెంచుకోవడం మన ప్రస్తుత కర్తవ్యం. రాజులను ఓడించి పన్నును తీసుకొని వస్తాను. మీ ఆజ్ఞ అయితే ఉత్తర దిక్కును జయించడానికి బయలుదేరుతాను. తిథి, ముహూర్త, నక్షత్రం, పవిత్రాలై ఉండాలి’’ అని అన్నాడు.

- ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము