డైలీ సీరియల్

యాజ్ఞసేని 53

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘటోత్కచుడు తానెవరో తెలియపరచి, పాండవుల వివరాలను ధర్మరాజు గొప్పతనాన్ని విభీషణునికి వివరించగా సంతోషించిన విభీషణుడు ఘటోత్కచుని సత్కరిస్తాడు. ధర్మరాజు రాజసూయయాగానికై ఘటోత్కచుని పగడాలను, మణులను, రత్నాలను, బంగారుపాత్రలను, సువర్ణమయాలైన పల్లకీలను, అనేక ధనరాశులను కానుకగా ఇచ్చాడు.
ధనరాశులతో, రాక్షసులతోగూడి సహదేవుడు ఇంద్రప్రస్థపురంలో ప్రవేశిస్తాడు. ధర్మరాజుకు తాను సేకరించి తెచ్చిన ధన వస్తు కనక మణిమయ రాశులను సమర్పించాడు.
నలుకుడు
నకులుడు ససైన్యంతో పశ్చిమ దిక్కుకు బయలుదేరి వెళతాడు. ఈ పశ్చిమ దిక్కు శ్రీకృష్ణవాసుదేవుని ఆధీనంలోనున్న దిక్కు. రోహితకము అనే పర్వత ప్రాంతానికి చేరాడు. అక్కడ మత్త, మయూరకుడు అనే రాజులతో ఘోర సంగ్రామము సల్పుతాడు వారిని జయించి ముందుకు సాగాడు. మరుభూమిలో (నేటి రాజస్థాన్ ప్రాంతం) ప్రవేశించి ఆ భూమి శాసకుడైన అక్రోశుని జయించి, శైరీషకాన్ని, మహోత్దదేశాలను కూడా జయిస్తాడు. పిమ్మట దశార్ణదేశాన్ని వశపరచుకుంటాడు. శిబి, త్రిగుర్త, అంబష్ఠ, మాళవ, పంచకర్పట, మాధ్యమిక (మధ్య దేశాలు) దేశాలను అన్నింటినీ జయించాడు. వాటదాన దేశీయులను వశపరచుకొని, పుష్కరారణ్య నివాసులను (నేటి రాజస్థాన్‌లోని) ఉత్సవ సంకేతులను కూడా వశపరచుకుంటాడు. సముద్ర తీరంలో నివసించే మహాబలవంతులైన ‘గ్రామీణీయులు’ అనే పేరుగల క్షత్రియులను, సరస్వతీ నదీ తీరానగల శూద్రా భీరగణాలను వశపరచుకుంటాడు. సప్తమ పంచ దేశాలను (నేటి పంజాబ్ రాష్ట్రం- పంచనదులు సట్లెజ్, రావి, బియాస్, చీనాబ్, జీలం -ఇవి సింధునదికి ఉపనదులు)- అమర పర్వతం, ఉత్తర జ్యోతిషం, దివ్యకటకం,ద్వారపాలనగరం అనే ప్రదేశాలను జయించాడు. ఆమఠ, హర, హూణ, పశ్చిమ వనరాధీశులను ఓడించాడు. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాడు. అతని అనుగ్రహాన్ని సంపాదించాడు. శాకల దేశాన్ని గెలిచి అక్కడ నుండి మద్ర దేశంలోనికి ప్రవేశించాడు. మద్ర దేశాధిపతి అయిన తన మేనమామ శల్యుని ప్రేమకు పాత్రుడయ్యాడు. శల్యుడు కానుకగా రత్నాలను ఇచ్చాడు. నానా దేశాలనుండి గ్రహించిన కానుకలను, కప్పాలను ధనాన్ని, వివిధ వస్తు వాహనాలతో బయలుదేరి ఇంద్రప్రస్థడపురానికి చేరుకున్నాడు. తాను తెచ్చిన ధనరాశులను ధర్మరాజుకు సమర్పించాడు.
30
రాజసూయం
యుధిష్ఠిరుని కోశాకారం పూర్తిగా వృద్ధి చెందింది. హితైషులందరూ వేరువేరుగా, అందరూ కలిసి ‘‘్ధర్మరాజా! మీరు రాజసూయయగం చేయటానికి తగిన సమయం ఆసన్నమైంది. దానికి కావలసిన ప్రయత్నం చెయ్యండి’’ అని పలికారు.
హితులందరూ అలా విన్నవిస్తున్న సమయంలోనే శ్రీకృష్ణవాసుదేవుడు కూడా వచ్చాడు. పురాణపురుషుడు, నారాయణఋషి, వేద స్వరూపుడు అయిన శ్రీకృష్ణవాసుదేవుడు ఎన్నో కానుకలను ధర్మరాజు కొరకై తెచ్చాడు. సేనతో సహా సహాయంగా వచ్చాడు. ధర్మరాజు మిక్కిలి ప్రసన్నడై శాస్త్ర మర్యాదలతో తమ్ములతో కలిసి స్వాగత సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నలను వేశాడు. విశ్రాంతి తీసుకొని సుఖాసీనుడయిన తరువాత శ్రీకృష్ణుని వద్దకు ధౌమ్యుడు, శ్రీకృష్ణ ద్వైపాయనుడు, ఋషులు, ధర్మరాజు తన నలుగురు సోదరులతో వచ్చారు. అప్పుడు ధర్మరాజు వారితో
‘‘మీ దయవలన మీ సేవ కొరకు భూమండలమంతా నా అధీనంలోనికి వచ్చింది. మీ అనుగ్రహంతో ధనరాశులు నన్ను చేరాయి. దేవకీనందనా! నీచే అనుజ్ఞ పొంది ఉత్తమ యాజ్ఞదీక్షను గ్రహిస్తాను’’ అని వినయంతో అన్నాడు.
‘‘రాజసింహమా! నీవు చక్రవర్తివి అవటానికి అర్హుడవు. గొప్ప యజ్ఞదీక్షను గ్రహించుము. నీవు దీక్షను స్వీకరిస్తే మేమందరమూ కృతకృత్యులం కాగలము. నేను నీకు ఎల్లప్పుడూ శుభం చేకూర్చ సంసిద్ధుడను. నాకు తగిన పనిలో నన్ను నియమించుము. నేను మీ అందరి ఆజ్ఞలను పాలిస్తాను’’ అని అన్నాడు శ్రీకృష్ణుడు. రాజసూయయాగానికి కావలసిన వ్యవస్థ సర్వం పూర్తి అయింది.
ప్రధాన ఋత్విజుడుగా వేదవ్యాస మహర్షి తన శిష్యగణాలతో (పైల జైమిని సుమంత వైశంపాయనులతో), ఋత్విజులతో వచ్చాడు. వ్యాస భగవానుడు స్వయంగా బ్రహ్మత్వాన్ని అంగీకరించాడు. యాజ్ఞవల్క్యుడు యజ్ఞానికి శ్రేష్ఠతముడైన ‘అధ్వర్యుడు’ (యజుర్వేద తంత్రాన్ని నడిపేవాడు). వీరి పుత్రులూ, శిష్యులూ, వేదవేదాంగ నిష్ణాతులందరూ సప్తహోత్రగులు అయినారు. నారదాది బ్రహ్మర్షులు సదస్యులయ్యారు. వారందరూ పుణ్యాహవాచనం చేసి యజ్ఞశాల నంతటినీ పవిత్రం చేసి యజ్ఞానికి అనువుగా చేశారు.

ఇంకా వుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము