డైలీ సీరియల్

వ్యూహం-67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూస్ ఛానల్స్ వాళ్లు వొచ్చి పోలీస్‌స్టేషన్ దగ్గర వాలిపోయారు. వేటకు వెళ్లితే చేపలు దొరికినట్లు వాళ్లకు మ్యాటర్ దొరికింది. రెండ్రోజుల నుంచి చేపల వేటకు వెళ్లకుండా పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్న సింహాద్రి దొరికాడు.
శవాన్ని చూసిన దగ్గర్నుంచి రిక్షావాడికి డబ్బులు తనే ఇవ్వాల్సి వొచ్చిందన్న విషయం వరకు పూసగుచ్చినట్లు చెప్పాడు.
డాక్టర్ అరవిందకు మాఫియా గ్యాంగుకు సంబంధం వుందన్న వార్త తెలిసేసరికి, ‘నది ఒడ్డున దొరికిన శవం’ వార్త మరింత సంచలనాన్ని సృష్టించింది.
***
టీవీ ముందు కూర్చుని సావేరి, లోహిత పనస తొనలు తింటున్నారు. సావేరి అన్ని ఛానల్స్ మారుస్తూ వుంది.
‘‘గోదావరి నది ఒడ్డున ధవళేశ్వరం దగ్గర్లో వున్న గ్రామానికి చెందిన పల్లెకారుడు వో శవాన్ని గుర్తించాడు. పోలీసు విచారణలో ఆ శవం డాక్టర్ అరవిందదని తేలింది. గుడ్ సమారిటన్ హాస్పిటల్లో జరుగుతున్న అక్రమాలు వెలుగులోకి వొస్తున్న నేపథ్యంలో డాక్టర్ అరవింద్ శవంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు అంతా ఆ కేసుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. డాక్టర్ అరవింద్‌కు ముంబాయిలోని అరిఫ్ గ్యాంగుకు సంబంధాలు వున్నాయనే వార్తలు వొస్తున్నాయి.. ‘నది ఒడ్డున దొరికిన శవం’ వార్తపై ప్రత్యేక కథనం విన్పిస్తూ వుంది టీవీ యాంకర్.
టీవీలో ఆ వార్త చూడగానే కడుపులో దేవినట్లయ్యింది.
సావేరికి చెప్పింది ఆ డాక్టరూ తానూ వొకే హాస్పిటల్లో పనిచేసినట్లు.
స్కందకు ఫోన్ చేసింది లోహిత.
‘‘మీరు వచ్చి డాక్టర్ అరవింద్‌గారికి అంత్యక్రియలు జరిపిస్తే బాగుంటుంది!’’ అంది లోహిత.
‘‘ముఖ్యమైన పనిమీద వున్నాను.. చివరి అంకంలో వున్నాం.. ఈ పని పూర్తి అయ్యేక వొచ్చేస్తాను.. ఈలోపు పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా వొచ్చేస్తుంది.. శవాన్ని మార్చురీలో వుంచుతారు. అమ్మను తీసుకు వొస్తాను’’ అన్నాడు స్కంద.
అతని గొంతు జీరబోవడం గమనించింది లోహిత.
***
డిజిపి ఆఫీసులో ఉన్నత పోలీసు అధికారుల సమావేశం జరుగుతూ వుంది. బీహారు, మహారాష్ట్ర పోలీసు అధికారులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.
స్కంద, ఐపిఎస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ వున్నాడు.
గుడ్ సమారిటన్ హాస్పిటల్స్ ఎక్కడెక్కడ వున్నాయి, వాటిని నడిపిస్తున్న మాఫియా ముఠాలు, కిడ్నీ, లివర్, ఇతర శరీర అవయవాల మార్పిడి కుంభకోణాలు, డాక్టర్ వౌర్య, డాక్టర్ ఫణి ఏ ఏ కారణాల మూలంగా హత్య చేయబడింది, ఆ హత్యల వెనుక ఎవరున్నారు? పోలీసులకు దొరికిన డ్రగ్స్ సరఫరా చేస్తున్న అరిఫ్ ముఠాకు చెందినవాళ్ళు ఆ వివరాలన్నీ చెప్పాడు.
కొన్ని సిడిలు కూడా డిస్‌ప్లే చేశాడు.
అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు
ఒక్కసారిగా అరిఫ్ గ్యాంగ్ స్థావరాలపై దాడులు చేయాలి, అందరిని అరెస్టు చేయాలి, పారిపోయే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళపై ‘లుక్‌అవుట్’ నోటీసులు జారీ చేయాలి! అరిఫ్‌ను అరెస్టు చేసి అతని పాస్‌పోర్టు సీజ్ చెయ్యలి!
వాటికి సంబంధించిన మెమోలు జారీ చేశాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్.
***
అరిఫ్‌ను, అతని అనుచరులను అరెస్టు చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు స్కంద.
ఆ విషయాలన్నీ డిజిపి గారితో మాట్లాడలేక, వెళ్ళబోయే ముందు డిజిపిగారితో ముఖ్యమైన విషయాలు చెప్పాడు స్కంద.
‘‘సర్.. డాక్టర్ అరవింద్ కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు. అతన్ని పిస్టల్‌తో కాల్చి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. శవాన్ని గోదావరి నదిలో పడేశారు.. ధవళేశ్వరం దగ్గర శవం దొరికింది.
అరవింద్ మా నాన్నగారు సర్.. మా అమ్మ గర్భంలో నేను ఉండగానే మా నాన్న మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ విడాకులు తీసుకుని మొన్నటిదాకా అమెరికాలో వుండిపోయింది. షి ఈజ్ ఆల్సో ఏ డాక్టర్.
మీరు అనుమతిస్తే మా నాన్నగారి అంత్యక్రియలు నేను చేస్తాను. రేపు మనం చేపడుతున్న అరిఫ్ ముటా అరెస్టు కార్యక్రమం అయ్యేక ధవళేశ్వరం వెళతాను. గోదావరి ఒడ్డున నాన్నగారికి అంత్యక్రియలు నిర్వహిస్తాను’’ అన్నాడు స్కంద.
‘‘నా పర్మిషన్ దేనికి? అది నీ లెజిటిమేట్ డ్యూటీ. కొడుగ్గా నీ బాధ్యత నువ్వు నిర్వహించాలి! డాక్టర్ అరవింద్ బ్రతికి వున్నట్లయితే అరిఫ్‌తోపాటు అరవింద్‌ను కూడా నువ్వు అరెస్టు చేసి వుండేవాడివి... నువ్వు సిన్సియర్ ఆఫీసర్‌వని నాకు తెలుసు!’’’ అన్నాడు డిజిపి స్కంద భుజం తట్టి.
***
జుహూ బీచ్ హోటల్లో అరిఫ్‌ను అరెస్టు చేశారు పోలీసులు.
‘‘నన్ను అరెస్టు చేసే దమ్ము ఎవరికి వుంది?’’ అంటూ వీరంగం వేశాడు అరిఫ్. తనకు పరిచయం వున్న మంత్రులకు ఫోన్ చేశాడు.
అతను చెప్పింది విన్నారుగాని పోలీసు అధికార్ల మీద వొత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదు. అరిఫ్ మీద వున్నది నాన్‌బెయిలబుల్ అరెస్టు వారంట్.. ఎన్నో క్రిమినల్ కేసులు అతని మీద వున్నాయి.
అతని చేతికి బేడీలు వేసి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్తున్న దృశ్యాలు టీవీ చానళ్ళవాళ్లు రోజంతా చూపిస్తూనే వున్నారు. అరిఫ్ పాస్‌పోర్టు కూడా సీజ్ చేశారు. అతని స్థావరాలపై, అనుచరులపై ఏకకాలంలో వివిధ రాష్ట్రాల పోలీసులు దాడులు నిర్వహించారు. కోట్ల విలువైన డ్రగ్స్, పిస్టల్స్ దొరికాయి.
***
సిమ్లాలోని ఒబెరాయ్ ప్యాలెస్ హోటల్లో బాడీ మసాజ్ చేయించుకుంటున్నాడు కాశి.
‘‘మీకు ఫోన్ వచ్చింది’’ అంటూ సెల్‌ఫోన్ తెచ్చి ఇచ్చింది రోషిని.
కొత్త సెల్‌ఫోన్ నెంబరు స్కందకు తప్పితే ఎవరికీ తెలియదు. అతనికి ఎవరి దగ్గరినుంచి ఫోన్ కాల్స్ రావు.
ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ