డైలీ సీరియల్

యాజ్ఞసేని-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకనాడు ధృతరాష్ట్రుడు ఒంటరిగా శకుని, దుర్యోధనుల అభిప్రాయాలను విదురుడికి చెప్పాడు అది విన్న విదురుడు ఆశ్చర్యపడి కలియుగ ప్రవేశం దగ్గరపడటం, జూదం సర్వనాశజనకం కావటం తెలిసికొని ధృతరాష్ట్రుడితో-
‘‘ఇలాంటి పనికి నేను ఎన్నడూ ఏ మాత్రం అంగీకరించను. ఇది చెడ్డ అని అనకుండా నీ కొడుకుల్లో పాండవులకూ కౌరవులకూ విరోధం కల్పించటానికి ఎందుకు పూనుకున్నావు. నీ పుత్రులంతా ఒకరితో ఒకరు ఎలా కలిసి మెలిసి ఉంటారో అలా చెయ్యి. జూదం వైరాన్ని కల్గిస్తుంది. నీచేతనైన ప ద్ధతిలో శకుని దుర్యోదనుల చెడ్డ పనిని మాన్పించి కురుకులానిని రక్షించుము’’ అని అన్నాడు.
‘‘నీవు, నేను, భీష్ముడు ఉండగా కొడుకులకెందుకు విధం ఏర్పడుతుంది. అనవసరమైన అనుమానాలు ఎందుకు. నీవీ జూదానికి అంగీకరించుము. వెంటనే వెళ్లి ధర్మరాజును పిల్చుకొనిరా! అని ఆజ్ఞాపించాడు ధృతరాష్ట్రుడు.
(్ధృతరాష్ట్రుడు శకుని, దుర్యోధనులు చెప్పిన మాటలు విన్నాడు. మాయాజూదంలో పాండవుల సంపదనంతా పొందాలనే దుర్యోధనుని అభిప్రాయం తెలిసి కూడా ఏవేవో కుంటి సాకులతో విదురుని పాండవుల వద్దకు వెళ్ళి జూదానికి ఆహ్వానించమన్నాడు. దుర్యోధనునికంటే ధృతరాష్ట్రుడే దుర్మార్గుడు. పాండవుల ఐశ్వర్యాన్ని కాజెయ్యాలనే దుర్బుద్ధి బాగా ధృతరాష్ట్రుడికే కలదు. పైకి మాత్రం కనపడకుండా కణిక నీతిని పాటించాడు. ఇతడి దుచేష్టలు మున్ముందు బాగా బయటపడతాయి)
36
ఇంద్రప్రస్థం
ధర్మరాజు ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు.
విదురుడు అయిష్టంగానే ధృతరాష్ట్రుడు అనే విధాత ఆజ్ఞతో ఇంద్రప్రస్థపురానికి బయలుదేరి వెళ్ళాడు. దేవేంద్రునితో సమానమైనవాడు, చంద్రునివలె ప్రకాశించే కీర్తిగలవాడు, తమ్ములతో కూడియున్న ధర్మరాజును ప్రేమతో దర్శించాడు.
విదురుడు ధర్మరాజు పూజలను అందుకున్నాడు. పాండవుల క్షేమములనడిగి తన రాకకు గల కారణాన్ని చెప్పాడు. ధర్మరాజు ఒక్కింత ఆలోచించి
‘‘పుణ్యాత్మా! విదురా! ధృతరాష్ట్రుడు తన అపూర్వమైన సభను చూడటానికి ప్రేమతో నన్ను పిలుచుకొని రమ్మని నిన్ను పంపాడు. ప్రేమతో నీవు నా వద్దకు వచ్చావు. అట్టి అపూర్వమైన సభను చూడటానికి వచ్చి ‘జూదమాడటం తగునా చెప్పుము. ఈ జూదం కారణంగా మాలో మాకు వైర ఏర్పడక మానదు. నీ ఆజ్ఞ మాకెట్ల మీరరానిదో, ధృతరాష్ట్రుని ఆజ్ఞ కూడా అట్లే’’ అని అన్నాడు.
భార్యా, తమ్ముళ్ళతో కలిసి హస్తినకు రావటానికి అంగీకరించాడు.
ధర్మరాజు హస్తినకు బయలుదేర సర్వం సిద్ధం చేయించాడు.
విదురిని రాకను, ధర్మరాజు నిర్ణయాన్ని తెలిసికొన్న ద్రౌపది ధర్మరాజు వద్దకు వచ్చింది. ధర్మరాజుతో ‘‘ప్రభూ! విదురిని రాక ద్వారా ధృతరాష్టమ్రహారాజు ఆజ్ఞను పాటించి మీరు హస్తినకు బోవ నిశ్చయించినారటగా! ఇప్పుడు వారి పిలుపులో ఏదో మోసం తప్పక దాగి ఉంటుంది. క్రొత్తగా నిర్మించిన సభను చూడడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా అందు ఏదో విపత్కర పరిస్థితిని ఎదుర్కొనవలసి రావచ్చును. నాకు ఎందుకో అనుమానంగాయున్నది. నా కుడి కన్ను అదురుచున్నది. కావున హస్తిన ప్రయాణాన్ని కొంతకాలం నిలిపివేయండి. తరువాత దీర్ఘంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసికొనవచ్చును.’’ అని ప్రాధేయపూర్వకంగా విన్నవించింది.
ఇంకాఉంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము