డైలీ సీరియల్

యాజ్ఞసేని-61

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందుకు ధర్మరాజు
‘‘యాజ్ఞసేని! హస్తిననుండి వచ్చిన ఆహ్వానాన్ని నేను తిరస్కరించలేను. ధృతరాష్ట్ర మహారాజాజ్ఞ తిరస్కరించి అవిధేయుడను కాలేను. క్రొత్తగా నిర్మింపబడిన సభాభవనాన్ని తిలకించటానికై ఆహ్వానం అందింది. కాదని ఎలా అనగలను. అందువల్ల కలుగబోయే అనర్థమేమి?
‘‘ప్రభూ! ఈ ఆహ్వానంలో ఏదో విపత్తు తప్పక దాగి ఉన్నది. మీరు ఏదో విషయాన్ని దాస్తున్నట్లన్నది. విదురమహాశయుడి ఈ ఆహ్వానం వెనుక దాగిన రహస్యమేదో మీకు చెప్పి ఉండవచ్చును. మీరు ధర్మమూర్తులు .మీకు చెప్పగలిగేటంతటి దానిని కాను. నాకూ మీ ఆజ్ఞ దాటరానిది. ఇది నా ఆవేదన. ఆపై నిర్ణయం మీదే’’ అని అన్నది ద్రౌపది.
మనం హస్తినకు పయనమవుచున్నాము. పోక తప్పదు అని ధర్మరాజు అనగా ద్రౌపది బరువైన హృదయంతో నిష్కృమించింది.
***
తమ్ముళ్లతో, దౌపదితో, ముఖ్య సేవకులతో, ధౌమ్యుడు మొదలైన పండితులు వెంటరాగా ధర్మరాజు హస్తినకు చేరాడు.
తన నూర్గురు కొడుకులతో, భీష్మద్రోణశల్యశకునిసోమదత్తులు మొదలైన వారితో కూడియున్న ధృతరాష్ట్రునికి తమ్ముళ్ళతో కూడి నమస్కరించాడు ధర్మరాజు. గాంధారి కూడా వారిని ఆశీర్వదించింది.
తరువాత ద్రౌపది కూడా గాంధారికి సవినయంగా మ్రొక్కింది. ఆమె ఆశీస్సులను పొందింది. అక్కడే ఉన్న గాంధారి కోడళ్లు ద్రౌపది అందాన్ని చూచి ఆశ్చర్యపడ్డారు.
‘‘బ్రహ్మదేవుడు సమస్త సౌందర్య కాంతి సమూహాన్ని ఈ ద్రౌపది కాంతగా నిర్మించినట్లున్నాడు. అందువల్లనే కాబోలు ఇంతటి కాంతి మరేఇతర కాంతల్లోనూ కానరాదు’’ అని గాంధారి కోడళ్లు అందరూ అసూయ చెందారు.
ఆ విధంగా అందరూ ఆ రోజంతా గడిపారు.
మరునాడా ధృతరాష్ట్రునిచే నిర్మింపబడిన నూతన సభాభవనంలో ప్రవేశించిన పాండవులందరూ గౌరవింపదగిన రాజులనందరినీ కలిసికొన్నారు.
అందరూ తివాచీలు పరిచిన విచిత్రమైన ఆసనాల మీద ఆసీనులయ్యారు. అప్పుడు సుబలసుతుడైన శకుని యుధిష్ఠిరునితో
‘‘రాజా! యుధిష్ఠిరా! సభలో పాచికల బల్లను పరిచారు. అందరూ నీ ఈ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆరంభింప సమయమైంది’’ అని అన్నాడు. ఆ మాటలకు ధర్మరాజు
‘‘రాజా! జూదం కపటపూరితం. పాపం. ఇందులో క్షత్రియ సంబంధమైన పరాక్రమానికి చోటు లేదు. నిశ్చితమైన నీతి లేదు.దీనిని సజ్జనులెవరూ ప్రశంసించరు. శకునీ! క్రూరునివలె అనుచితమైన మార్గంలో మమ్మల్ని జయించాలని అనుకోకు’’ అని శకునిని నిలదీశాడు. అందుకు
‘‘నీకు భయం ఉన్నట్లయితే జూదంనుండి తప్పుకో!’’ అని అన్నాడు శకుని.
‘‘రాజా పిలిచిన తరువాత వెనక్కి మరలను. ఇది నా నిశ్చయమైన వ్రతం. విధి బలీయము. విధికి లోబడి ఉన్నాను. నేను ఎవరితో జూదమాడాలి’’ అని అన్నాడు ధర్మరాజు.
జూదం ఆరంభం కాగానే రాజులందరూ ధృతరాష్ట్రుడు ముందు ఉంచుకొని సభలోనికి ప్రవేశించారు. భీష్మ ద్రోణ కృపాచార్య విదురులు అసంతుష్టమైన మనసుతోనే ధృతరాష్ట్రుని అనుసరించారు.
ఇంకాఉది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము