డైలీ సీరియల్

వ్యూహం-69

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు పొగిడినా ఆ పొగడ్తలు నాకు చెందవు.. పోలీసు డిపార్టుమెంటుకు చెందుతాయి. మాఫియా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టమని చెప్పింది మా డిజిపిగారు.. వారి ఆఫీసులోనే ఒక ప్రత్యేకమైన సెల్ క్రియేట్ చేశారు అరిఫ్ ముఠా కార్యకలాపాలపై ఇనె్వస్టిగేషన్ చెయ్యమని చెప్పారు. నాకు ట్రాన్స్‌ఫర్ వచ్చినా అవి క్యాన్సిల్ చేయించారు హోమ్ మినిస్టర్.. ఎందరో పోలీసు అధికార్లు కష్టపడితేనే దేశ వ్యాప్తంగా వున్న అరిఫ్ గ్యాంగ్ తోకలు కత్తిరించగలిగాం!
ఆ మాటలు చెబుతున్నపుడు స్కంద హృదయం ఉప్పొంగిపోయింది గోదావరి వరదలా. అది తన ఒక్కడి కృషి కాదని, సమిష్టి కృషి అని స్పష్టంగా చెప్పాడు.
***
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ నుంచి మెమో వచ్చింది డాక్టర్ లోహితకు.
డాక్టరుగా ప్రభుత్వ సర్వీసులో నియామక ఉత్తర్వులు ఎప్పుడో వచ్చాయి. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు ఆమె చేరలేదు. ఉద్యోగంలో చేరడానికి గడువును పొడిగిస్తూ మెమో వచ్చింది.
‘‘గవర్నమెంటు డాక్టరుగా ఉద్యోగం బాగుంటుంది. పల్లెటూరి ప్రజలకు అందుబాటులో వుంటావు. అపుడు చేరమంటే జీతం ఎక్కువ వస్తుందని ప్రైవేటు హాస్పిటల్లో చేరి కష్టాలు కొని తెచ్చుకున్నావ్.. ఇప్పుడన్నా చేరతావా?’’ అడిగింది లోహితను అన్నపూర్ణమ్మ.
‘‘నాక్కూడా గవర్నమెంటు సర్వీసులో చేరాలనే వుంది.. ఒక్కసారి స్కందను అడిగి చెబుతాను’’ అంది లోహిత.
‘‘స్కంద పోలీసు డిపార్టుమెంటులో ఆఫీసర్ కేడర్‌లో వున్నాడు.. బావగారికి పట్టణాల్లో పోస్టింగ్ వుంటుంది.. నువ్వేమో గవర్నమెంటు డాక్టరుగా పనిచేస్తే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు. మీ ఇద్దరికి లంగరు ఎలా కుదురుతుంది? అడిగింది సావేరి.
చెల్లెలు అడిగిన ప్రశ్ననే స్కందను అడిగింది లోహిత.
‘‘ఉద్యోగరీత్యా మీరు పట్టణాల్లో తిరుగుతూ ఉంటారు. నా ప్రొఫెషన్ రోగులకు వైద్య సేవలు అందించడం.. పగలు వుండదు రాత్రి వుండదు.. రోగికి ప్రాణం మీదకు వస్తే పరుగెత్తాలి! మనిద్దరం భార్యాభర్తలు అయితే కుదురుతుందా’’ స్కందను అడిగింది.
‘‘మనస్సులు కలిసినపుడు అన్నీ కుదురుతాయి.. భార్యాభర్తలిద్దరికి లంకె వేసేది ప్రేమ, అనురాగం.. అవి వుంటే ఎప్పుడు కలవాలంటే అప్పుడు కలుసుకోవచ్చు! అమెరికాలో వుండే అబ్బాయి, అంగలకుదురులో వున్న అమ్మాయిని కలవడానికి వెనుకటి రోజుల్లోలాగా వారాలు, నెలలు అవసరం లేదు- ఇరవై గంటల్లో కలుసుకోవచ్చు.
‘‘ప్రేమ అంటే?’’ నవ్వుతూ అడిగింది లోహిత
ఆమె నడుం చుట్టూ చెయ్యివేసి దగ్గరకు తీసుకున్నాడు.
‘‘లవ్ ఈజ్ విండ్.. వుయ్ కెనాట్ సి ఇట్.. బట్ ఉయ్ కెన్ ఫీల్ ఇట్... నీ నడుం చుట్టూ చెయ్యి వెయ్యగానే నీ మనస్సు పరవశం చెందింది. నీ శ్వాస వేగం పెరిగింది. నీ శ్వాస నాకు కన్పించదు.. నీ అనుభూతి నాకు విశదం అవుతుంది. ప్రేమ కూడా అంతే! కన్పించదు గాలిలాగా!’’ అన్నాడతను ఆమె పెదవులపై వెచ్చటి ముద్రవేస్తూ.
అతని తియ్యటి ముద్దుకు పరవసించిపోయింది. మత్తు మందు చల్లినట్లు అతని ఛాతీమీద తల వాల్చేసింది.
***
‘‘మన పెళ్లికి ఓ షరతు’’ అంది సావేరి.
‘‘ఇపుడు షరతులు ఏమిటి? ముహూర్తాలు పెట్టేసుకున్నారు.. వచ్చే వారమే మన పెళ్లి! ఎంగేజ్‌మెంట్‌కు ముందు నువ్వు నీ షరతులు ఏమిటో చెప్పాల్సింది’’ అన్నాడు నిశాంత్.
పున్నమి వెనె్నల గిలిగింతలు పెడుతూ వుంది.
పూచిన మల్లెలు సౌరభాన్ని వెదజల్లుతూ వున్నాయి.
ఆమెకు దగ్గరగా జరిగి చెంపలు నిమరబోయాడు. దూరంగా జరిగి కూర్చుంది.
‘‘ప్రేమ ఎన్ని తమాషాలు చేస్తుందో చూశావా? అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ వుండేవాడిని.. నెల రోజులు సెలవు పెట్టి వచ్చాను.. ‘పెళ్లి చేసుకుని నీ భార్యను తోడుగా తీసుకువెళ్ళు! అమెరికాలో ఒంటరిగా ఎలా వుంటావ్?’’ అన్నాడు డాడీ.. సరేనన్నాను. నువ్వు పరిచయం అయ్యాక.. రెండు నెలలు సెలవు పొడిగించాల్సి వచ్చింది. లవ్ ఈజ్ ఫన్నీ థింక్స్ టు పీపుల్స్! పెళ్లి కుదిరేక ఇపుడు షరతులు అంటున్నావ్.. మరో రెండు నెలలు సెలవు పెట్టాలా? అక్కడ నా ఉద్యోగం ఊడిపోతుంది!’’ అన్నాడు నిశాంత్.
‘‘ఇండియాలో ఉద్యోగాలు దొరకవా?’’ అడిగిందామె.
‘‘అమెరికాలో మనకు వున్న విజ్ఞానాన్ని మెరుగుపర్చుకునే అవకాశాలు వున్నాయి’
‘‘కనీసం మీ విజ్ఞానాన్ని మెరుగుపర్చుకున్నాక తిరిగి వచ్చేస్తారా?’’
‘‘నీ షరతు అదేనా?’’ ఆమె మనస్సు పసిగట్టి.
‘‘అవును’’ అంది అతనికి దగ్గరగా జరుగుతూ
అతను నవ్వుకుంటూ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నిమిరాడు.

ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ