డైలీ సీరియల్

యాజ్ఞసేని-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చుట్టూ మంచిగంధ, కస్తూరి కలిసిన నీళ్ళు చల్లిన జూదమాడే స్థలంలో పూలచేత పూజింపబడదిన పాచికలు అమర్చుకొని కూర్చున్న శకుని, చిత్రసేనుణ్ణి, వికర్ణుణ్ణి చూసిన ధర్మరాజు
‘‘వీరిలో ఎవడు నాతో జూదమాడుతాడు’’ అని అనగా దుర్యోధనుడు
రాజా! నేను రత్నాలను, ధనాన్ని ఇచ్చేవాడిని. నా కోసం నా మామ ఈ శకుని జూదమాడుతాడు’’ అని ధర్మరాజుతో అనగా
‘‘ఇతరుని కోసం ఇతరుడు జూదమాడటం విషమమని నాకు తోచుచున్నది. విద్వాంసుడా! దీనిని తెలిసుకో! ఇచ్చానుసారంగా జూదం ప్రారంభమగుగాక!’’ అని అన్నాడు యుధిష్ఠిరుడు.
జూదం ఆరంభమయింది. శకుని పక్షాన దుర్యోధనుడు అమూల్య రత్నాలతో చేసిన కంకణాలను పణంగా పెట్టగా ధర్మరాజు సముద్రపు సుళ్ళలో ఉద్భవించిన ఉత్తమమైన మణులతో చేసిన మణులను ఒడ్డాడు.
తనకిష్టమైన పాచికలు రూపొందించుకొని మోసగాడైన శకుని ధర్మరాజును జయించాడు
ధర్మరాజు క్రోధంతో పెచ్చుపెరిగి ఒకదాని వెంట ఒకటి ఒడ్డుతూ...
వేల కొలది వరహాలతో నిండి పదివ పదివేల సంఖ్య కలిగి పెక్కు కుండలతో ఒప్పచున్న బంగారు భాండాగారాలను, వజ్రవైఢూర్య మరకతాది పలు విధ స్వచ్చవిస్తార రత్నాలతో నిండిన రత్న భాండాగారాలను, నిధులను, మంలతో చిరుగజ్జెలతో అలంకరింపబడిన లెక్కలేనన్ని గుర్రాల సమూహాలను, బంగారుమోకులతో, చిత్రకంబళాలతో కూడుకున్న మదపుటేనుగుల సమూహాలను, రత్నాల సొమ్ములతో అలంకరింపబడిన వేలకొలదు స్ర్తిలను, నూరువేల మంది సేవకులను, గంధర్వజాతి అశ్వాలను, మేలిజాతి గుర్రాలను, మేకల, గోవుల, గేదెల, గాడిదల సమూహాలను ఒక్కోటి ఒడ్డాడు.
తన కిష్టమైన పాచికలను విసరి శకుని ‘‘నేనే జయించాను’’ అని అన్నాడు.
అలా ధర్మరాజు ఓడిపోవటం చూచిన విదురుడు ధృతరాష్ట్రునితో ‘‘రాజా! శకుని ఈ మాయాజూదాన్ని ఆపుము. వంశ నాశనానికి పాల్పవద్దు’’ అని అన్నాడు. అయినా ధృతరాష్ట్రుడు మాత్రం ఏమి అనకుండా మిన్నకున్నాడు. అప్పుడు విదురుడు దుర్యోధనుని నిందిస్తాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగుతుంది. అయినా జూదం మాత్రం ఆపబడలేదు.
అప్పుడు శకుని ధర్మరాజుతో ‘‘్ధర్మరాజా! ఉన్న సంపదనంతా ఓడిపోయావు. ఇంకా పందెం ఒడ్డటానికి నాకు ధనం చూపుము’’ అని అన్నాడు.
ధర్మరాజు తన రాజ్యాన్నంతా ఓడిపోయాడు. ఆ విధంగా దానాలుగా ఇచ్చిన భూములు తప్ప తక్కిన భూమిని బ్రాహ్మణులు తప్ప సామాన్య జనులందరినీ, రాజపుత్రులను ఒక్కొక్కరినీ ఒడ్డి ఓడిపోయాడు. అంతేగాక రాజకుమారులు, భీమాదులు ధరించియున్న కుండలాలు, పతాకాలు మొదలైన ఆభరణాలన్నీ పందెంగా ఒడ్డాడు.
శకుని పాచికలు విసరి ‘‘నేనే గెలిచాను. ఇంకా పందెం ఒడ్డడానికి ఏముందో చూపుము’’ అని అన్నాడు.
ధర్మరాజు అన్నాడు ‘‘శ్యామవర్గం గలవాడు, ఎర్రని కన్నులు కలవాడు, సింహమధ్యముడు, మహాభుజుడు అయిన ‘‘నకులుడే’’ నా పందెం. ఇతడినే ధనంగా భావించు’’ అని అన్నాడు.
శకుని పాచికలను విసరి ‘‘నేనే గెలిచాను’’ అని అన్నాడు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము