డైలీ సీరియల్

వ్యూహం-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేతిలోని గిఫ్ట్ ప్యాకెట్టు కింద పడింది.
ఆ ప్యాకెట్ మీదే కూలబడ్డాడు శేషగిరి.
ఎర్రబటన్ ప్రెస్ అయ్యింది.
ఒక్కసారిగా పెద్ద పేలుడుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
శేషగిరికి కాళ్లకు, నడుంకు తీవ్రమైన గాయాలు అయ్యాయి.
పెళ్లికి వొచ్చిన బంధువులు ఆ పేలుడు శబ్దం విని ఇంటి దగ్గరకు పరుగెత్తుకుంటూ వొచ్చారు. శేషగిరిని హాస్పిటల్లో చేర్చారు.
***
‘‘ఎవరు చేసి వుంటారు ఆ పనిని?’’ అడిగింది లోహిత స్కందను.
‘‘శత్రువర్గంలోని వాళ్లే!’’
‘‘మీకు శత్రువులు ఎవరున్నారు? అరిఫ్ గ్యాంగును జైల్లో పెట్టించారు గదా!’’
‘‘ఎన్నిసార్లు ఏరి పారేసినా, కలుపు మొక్కలు పెరుగుతూనే వుంటాయి.. సిన్సియర్‌గా పనిచేసే పోలీస్ ఆఫీసర్‌కు శత్రువులు ఎక్కువగానే వుంటారు.. దినదిన గండంగానే వుంటుంది నాబోటి వాళ్లకు! అయినా భయపడేది లేదు... నా దారి నాది.. భయపడిపోయి మరోదారి వెతుక్కోను!’’ అన్నాడు స్కంద.
‘‘దినదిన గండం అయినా భగవంతుడు మనకు నూరేళ్ల ఆయుష్షును తప్పకుండా ఇస్తాడు!’’ అందామె.
‘‘గిఫ్ట్ ప్యాకెట్‌లో వుంచింది శక్తివంతమైన బాంబు కాదు.. అందుకనే మీ నాన్న ప్రాణాలతో బయటపడ్డారు.. నాకు హెచ్చరిక ఇవ్వడానికే గిఫ్ట్‌ప్యాక్‌లో బాంబు అమర్చి తీసుకువచ్చారు’’.
‘‘మా నాన్న చేతిలో ఆ కుర్రాడు గిఫ్ట్ ప్యాకెట్ పెట్టడం, మా నాన్న ఆ ప్యాకెట్‌ను మా అమ్మకు ఇవ్వబోవడం మామయ్యగారు గమనించారట!’’ అంది లోహిత.
‘‘మీ నాన్న తీసుకోకపోయినా ఏ కుర్రాడి చేతిలోనే ఆ ప్యాకెట్ వుంచి వాడికో చాక్‌లెట్ ఇచ్చి స్టేజ్ మీదకు తీసుకువెళ్లి బటన్ నొక్కమని చెప్పేవాడు ఆ కుర్రాడు’’
‘‘నాకెందుకో ఆందోళనగా వుంది’’ అందామె చెమర్చిన కళ్లతో అతనివైపు చూస్తూ.
ఆమె తల నిమిరాడు.
‘‘్భయపడ్డావా?’’
‘‘ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే భయపడరా?’’
‘‘ఉయ్ ఆర్ సేఫ్.. ఉయ్ ఆర్ ఎలివ్.. బ్రతికే వున్నాం! ఇద్దరం కలిసే వున్నాం! ఈ క్షణాలు మనవి.. టైమ్ వేస్ట్ చెయ్యకు!’’ అంటూ ఆమెను తన కౌగిట్లోకి తీసుకున్నాడు
‘‘మరి రేపటి సంగతో?’’
‘‘ఆలోచించగూడదు.. ధైర్యంగా ముందడుగు వేయాలి! నువ్వే అన్నావుగా ‘దినదినగండం.. నూరేళ్ల ఆయుష్షు’ అని ’’ అన్నాడు ఆమె పెదాలపై మధురిమను జుర్రుకుంటూ.
ప్రపంచాన్ని మర్చిపోయింది లోహిత అతని వెచ్చని కౌగిట్లో.

(అయపోయంది)

అలపర్తి రామకృష్ణ