డైలీ సీరియల్

యాజ్ఞసేని-71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పాండవులకు ఒక స్ర్తి గతి అయింది’’ అని భీముడు మనస్సులో వ్యధతో అనుకొన్నాడు.
ద్రౌపది మాటలు విన్న ధృతరాష్ట్రుడు ద్రౌపది గుణాలకు, ధర్మ పరిజ్ఞానానికి సంతోషించాడు. యుధిష్ఠిరుని, అతని తమ్ములతో కూడా రప్పించి
‘‘యుధిష్ఠిరా! నీవు సర్వసంపదలూ, నీ రాజ్యం తీసికొని ఎప్పటిలాగా ఇంద్రప్రస్థానికి వెళ్లి సుఖంగా జీవించుము. నీకు మేలు కలుగుతుంది. పెద్దల సేవించి అన్ని ధర్మాలు తెలిసికొన్నావు. నా కొడుకు జ్ఞానశూన్యుడై నీకు కీడు చేశాడు. ఈ అపకారాన్ని మరచిపో. నీకు నేనింకేమీ బోధించనక్కరలేదు.
నేను బుద్ధిలేక జూదాన్ని ఉపేక్షించాను. స్వల్పబుద్ధిగల ముసలివాణ్ణి నన్నూ, మీ తల్లియైన గాంధారినీ తలంచి దుర్యోధనాధులు చేసిన చెడ్డపనులు మనస్సులో పెట్టుకోవద్దు. అన్ని శాస్త్రాలు తెలిసిన విదురుడు మంత్రిగా, అన్ని ధర్మాలు తెలిసిన నీవు రక్షకుడుగా ఈ కురువంశానికి శుభం కలుగుతుంది’’ అని పలికి పాండురాజు రాజ్యాన్ని ధర్మరాజుకు సమర్పించాడు. తదుపరి ధర్మరాజు నుద్దేశించి
‘‘అజాతశత్రూ! నీలో ధర్మం, అర్జునునిలో ధైర్యం, భీమసేనునిలో పరాక్రమం, పురుషోత్తములైన నకులసహదేవులలో శ్రద్ధ, గురు శుశ్రూష ఉన్నాయి. నీకు మేలు జరుగుతుంది. నీవు ఖాండవప్రస్థానానికి వెళ్లి దుర్యోధనాది సోదరులతో స్నేహంగా ఉండుము. మనసు ధర్మంమీద నిలుపుము’’ అని అన్నాడు.
ధృతరాష్ట్రుడు అలా పలికిన తరువాత యుధిష్ఠిరుడైన ధర్మరాజు పెద్దల అనుమతితో, సోదరులతో కలిసి నిష్క్రమించాడు. తదుపరి మేఘాలవలె ధ్వనించే రథాలపై ద్రౌపదీ సమేతులై కూర్చొని ప్రసన్నమనస్కులై ఇంద్రప్రస్థానికి బయలుదేరి వెళ్లారు.
పాండవులు ఇంద్రప్రస్థానికి వెళ్లటానికి ధృతరాష్ట్రుడు అనుమతించాడని తెలిసికొన్న దుశ్శాసనుడు వెంటనే అన్న దగ్గరకు పోయాడు. అమాత్యులతో కలిసియున్న దుర్యోధనుని సమీపించి...
‘‘మహారథులారా! మనం కష్టపడి సంపాదించిన ధనాన్నంతా ఈ ముసలి అంతా నాశనం చేశాడు ధనాన్ని అంతా శత్రువులపాలు చేశాడు. గ్రహించండి’’ అని అన్నాడు.
అప్పుడు దుష్టచతుష్టమైన దుర్యోధన, శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు పాండవులపైన ప్రతీకారం తీర్చుకొనటానికై ఆలోచించారు. ఆపై తొందరగా ధృతరాష్ట్రుని వద్దకు వెళ్లి మాట్లాడారు.
దుర్యోధనుడు తండ్రితో పాండవ మధ్యముడైన అర్జునుని గూర్చి, అతడు చేసిన సాహసకృత్యాలనన్నింటినీ ఏకరవు పెట్టాడు.
‘‘తండ్రీ! వినుము. అర్జునుడు ద్రుపదుని నగరంలోనూ, ద్రౌపది స్వయంవర సందర్భంలోనూ ఇతరులకు అసాధ్యమైన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అర్జునుడు కోపించిన రాజులందరికీ చూచి ఎక్కడివారినక్కడనే నిలువరించి తానొక్కడై జయించాడు. అంతేగాక, కర్ణుడు మొదలైన రాజులందరితో యుద్ధం చేసి గెలిచి పరాక్రమ బలంతో ద్రౌపదిని పొందాడు. అంతేగాక, అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్లి సౌందర్యవతి అయిన నాగకన్య ‘‘ఉలూపిని’’ (ఉలూచి) పరిణయమాడాడు. గోదావరీ, వేణ్ణా, కావేరీ నదులలో స్నానమాడి సముద్రంలోని కుమార తీర్థానికి పోయిన తన పరాక్రమం ప్రదర్శిస్తూ మకర రూపాలను ధరించిన అయిదుగురు ‘‘అప్సరసలను’ అపూర్వంగా ఉద్దరించాడు. ద్వారకకు పోయి శ్రీకృష్ణుని ఆదేశంతో ‘సుభద్ర’ను పొందాడు. రథంపై కూర్చొనబెట్టుకొని తన నగరానికి వెళ్లిపోయాడు’’ అని అర్జునుని సాహసకృత్యాలనేకం వివరంగా చెప్పి
‘‘రాజా! కలలోగూడా అర్జునుని చూచి బెదరిపోతున్నాను. అర్జునుడు అంటే నాకు చాలా భయంగా ఉన్నది తండ్రీ! అర్జునుని వలన తప్ప మరే శత్రువన్నా నాకు భయం లేదు. కాబట్టి అర్జునునతో యుద్ధమంటే సర్వనాశనమే’’ అని అనగా ధృతరాష్ట్రుడు
‘‘నాయనా! అర్జునుడు మహాపరాక్రమశాలి అని నాకు తెలుసు. అతనిని ఎదురించటం చాలా కష్టం. కాబట్టి అర్జునునికి నచ్చని పని ఏదీ చేయవద్దు. జూదమైనా, శస్తయ్రుద్ధమైనా, దుర్భాషలైనా ఎప్పుడూ చేయవద్దు. స్నేహంతో ప్రవర్తించుము’’ అని అన్నాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము