డైలీ సీరియల్

యాజ్ఞసేని - 73

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు వంశమే నాశనం కావలసి వస్తుంది. శాంతి, ధర్మం, నీతి వీటితో కలిసిన తమ బుద్ధిని అంతే నిలుపుకోండి. పొరపాట్లు చేయకండి.క్రౌర్యంతో కూడి ప్రౌఢి, ప్రౌఢిమతో సాధించిన లక్ష్మి పుతపౌత్ర పరంపరగా సాగుతోంది’’ అని పరిపరి విధాల ప్రాధేయపడి వేడుకొంది.
అందుకు పుట్టు అంధుడైన, స్వార్థం నరనరాన నింపుకొన్న ధృతరాష్ట్రుడు సాధ్వి, పతివ్రత భర్త కోసమై తానూ అంధత్వాన్ని పాటిస్తున్న గాంధారి మాటలను పెడచెవిని బెట్టి ఆమెతో
‘‘గాంధారీ! ఈ వంశం నాశనమైనా సరే నేను దుర్యోధనుని వారించలేను. వీరు కోరుకున్నట్లే జరగనీ! పాండవులు తిరిగి రావలసిందే. నా కుమారులు ఆ పాండవులతో మరలా జూదమాడవలసిందే’’ అని తన అభిప్రాయాన్ని కుండ బ్రద్దలు గొట్టినట్లుగా చెప్పాడు.
గాంధారిమాత భర్తకు ఎదురు చెప్పలేక, రాబవు అరిష్టాన్ని వూహించినదే దుఃఖిస్తూ అక్కడ నుండి నిష్క్రమించింది.
పిమ్మట చాలా దూరం వెళ్లిపోయిన యుధిష్ఠిరుని ధృతరాష్ట్రుని ఆదేశం మేరకు ప్రాతికామి సమీపించి ‘‘రాజా! యుధిష్ఠిరా! సభ మరలా సమాయత్తమై ఉన్నది. తమకై నిరీక్షిస్తున్నది. తమ తండ్రి ధృతరాష్ట్రుడు తమను మరలా వచ్చి జూదమాడమని ఆదేశిస్తున్నాడు’’అని చెప్పగా ధర్మరాజు
‘‘ప్రాణులు విధి ప్రేరణ ననుసరించి శుభాశుభాలను పొందుచున్నారు. వాటిని తప్పించే అవకాశం లేదు. మరలా నేను ఆడవలసిన విధి ఉన్నట్లున్నది. వృద్ధుడైన ధృతరాష్ట్రుని ఆదేశాన్ననుసరించి జూదాన్ని మరలా ఆదేశించడం వంశనాశనకరం. అది తెలిసి కూడా అతిక్రమించలేక పోతున్నాను. బంగారు జంతువు అసంభవమని తెలిసి కూడా శ్రీరాముడు బంగారు లేడి కోసం వెంకటబడ్డాడు. పతపనమో, పరాభవమో సంభవించనున్నప్పుడు ఎవరి బుద్ధి అయినా విపరీతంగా ఆలోచిస్తుంది’’ అని పలుకుతూ యుధిష్ఠిరుడు సోదరులతో సహా వెనుదిరిగాడు. హస్తినకు వచ్చాడు.
సభ మరలా పునఃప్రారంభమయింది. భరతశ్రేష్ఠులైన మహారథులు మళ్లీ సభలో ప్రవేశించారు. అది చూసి మిత్రుల మనస్సులు కలతచెందాయి. ప్రారబ్దానికి వసులైన కుంతీపుత్రులు సర్వలోక వినాశన హేతువైన జూదం ఆడటానికి వచ్చారు. సభలో ఆశీనులైనారు. అప్పుడు శకుని
‘‘్ధర్మరాజా! వృద్ధుడైన ధృతరాష్ట్ర మహారాజు మీ ధనమంతా మీకు తిరిగి ఇచ్చి మంచిపని చేశాడు. జూదానికి ఒక్కటే పందెం. దానిని వినుము. మీరు జూదంలో గెలిస్తే మేము పండ్రెండు సంవత్సరాలు మృగ చర్మాలను ధరించి ఆరణ్యవాసం చేస్తాం. పదమూడవ సంవత్సరం మనుష్యుల మధ్యనే ఉంటూ అజ్ఞాతంగా గడుపుతాం. మేము మిమ్ములను ఓడిస్తే ద్రౌపదితోపాటు పండ్రెండు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలి. అజ్ఞాతవాసం భంగపడితే మరలా పండ్రెండు యేంట్లు ఆరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలి. అజ్ఞాతవాసం భంగపడితే మరలా పండ్రెండుయేండ్లు ఆరణ్యవాసం, ఒకయేడు అజ్ఞాతవాసం గడపాలి. పదమూడవ సంవత్సరం ముగిస్తేమీరైనా మేమైనా యధోచితంగా స్వరాజ్యాన్ని తిరిగి పొందవచ్చును. యుధిష్ఠిరా! ఈ నిర్ణయంతోరా! మరలా పాచికలు వేసి జూదమాడుము’’ అని అన్నాడు.
అది విని సభ్యులంతా ఉద్విగ్న చిత్తులై కలవరపాటుతో ‘‘ఈ యుధిష్ఠిరునకు తనమీదకు వస్తున్న ప్రమాదాన్ని బంధువులైనా తెలియజేయడం లేదు. ఇతడికి స్వబుద్ధితో విషయం అర్థమవుతున్నదో? లేదో?’’ అని అన్నారు.
వారి మాటలు వింటూ గూడా ధర్మరాజు మొగమాటం వలన ధృతరాష్ట్రుని వచన పాలన అనే ధర్మదృష్టి వలన మరలా జూదానికి సిద్ధపడ్డాడు.
‘‘ఈ కురుకుల వినాశనం సమీపించింది’’ అని జూదానికి శకునితో సమాయత్తమయ్యాడు.
‘‘శకునీ! స్వధర్మపాలనలో ఆసక్తిగల నావంటి రాజు జూదానికి పిలవబడి మరలి పోతాడా! నేను నీతో ఆడుచున్నాను’’ అని అన్నాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము