డైలీ సీరియల్

యాజ్ఞసేని-74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుధిష్ఠిరుడు ప్రారబ్దానికి లోనయ్యాడు. భీష్మద్రోణ విదురయుయుత్స కృపసంజయ, గాంధారి పృథభీమార్జుననకుల సహదేవులు. వికర్ణుడు, ద్రౌపది, అశ్వత్థామ, సోమదత్తుడు, బాహ్లికుడు అందరూ వద్దని వారిస్తున్నా ధర్మరాజు జూదం నుండి మరలలేదు.
ఆ తరువాత శకుని పాచికలను విసరి ‘‘నేనే గెలిచాను’’ అని ధర్మరాజుతో అన్నాడు.
పరాజితులైన పాండవులు వనవాస దీక్షను స్వీకరించారు. మృగచర్మాలను ఉత్తరీయంగా ధరించారు. రాజ్యాన్ని పోగొట్టుకొని వనవాసానికి బయలు దేరారు. అప్పుడు ఆ పాండవులను చూచి దుష్టుడైన దుశ్శాసనుడు
‘‘మా అన్న దుర్యోధన మహారాజు యొక్క తేజస్సు పెరిగి రాజ్యం ఏకఛత్రాధిపత్యమయింది. పాండుపుత్రులైన మీరు రాజ్యలక్ష్మిని కోల్పోయి చిరకాలమూ దుఃఖనరకంలో పడిపోయారు. మా వంటి మగవారు లేరని విఱ్ఱవీగిన మీరు కాలవైపరీత్యం వలన నిర్వీర్యులైనారు’’ అని అవహేళన చేసి ద్రౌపదిని చూసి
‘‘్ధమంతుడైన ద్రుపదుడు నిన్ను పాండవుల కివ్వటం తగిన పని కాదు. నీ భర్తలు నపుంసకు లయ్యారు. యాజ్ఞసేనీ! పలుచని మేలి వస్త్రాలు ధరించవలసిన నీ భర్తలు, జింక చర్మాలను ఉత్తరీయాలుగా వేసికొని ప్రతిష్ఠాహీనులై ఆరణ్యంలో తిరుగుతుంటే నీకు ప్రీతియేలా కలుగుతుంది. మరెవరినైనా నీ కిష్టమైన వాడిని వరించుము. కౌరవులందరూ శమదమాలుగలవారు. ధన సంపన్నులు. వీరిలో ఎవరినైనా భర్తగా వరించుము. ఈ కాలవైపరీత్యం నిన్ను పీడించదు’’ అని నీచంగా అన్నాడు.
ఆ దుశ్శాసనుని మాటలకు కుపితుడైన భీమసేనుడు దుశ్శాసనుని సమీపించి
‘‘క్రూరుడా! పాపాత్మునివలె నీచంగా మాట్లాడుతున్నావు. యుద్ధంగానీ మర్మస్థానాలను బ్రద్ధలు చేస్తూ నీ మాటలను నీకు గుర్తు చేస్తాను. నీ గుండెలు చీల్చి నెత్తురు త్రాగుతాను. ధార్తరాష్ట్రులందరినీ యుద్ధంలో చంపి శాంతిని పొందుతాను’’ అని అంటుండగా దుర్యోధనుడు భీమసేనుని నడకను అనుసరించి చూపించగా
‘‘మూర్ఖుడా! దుశ్శాసనుని నెత్తురు త్రాగటంతో నా పని పూర్తిగాదు. నిన్ను సబాంధవంగా యమ లోకానికి పంపుతాను. నీవు చేస్తున్న హేళనను గుర్తు చేస్తాను. బదులిస్తాను’’ అని దుర్యోధనుని నిందించాడు.
తదుపరి యుధిష్ఠిరుని వెనుక నడుస్తూ కౌరవసభలోనున్న వారిని చూచి భీమసేనుడు ‘‘నేను దుర్యోధనుని చంపుతాను. అర్జునుడు ‘‘కర్ణుని చంపుతాడు’’. ఈ జూదరి ‘శకుని’ని సహదేవుడు యమపురికి పంపుతాడు’’. అంతేగాక యుద్ధంలో ఈ దుర్యోధనుని గదతో కొట్టి రణభూమిలో పడద్రోసి చంపి తలను కాలితో తన్ని నిలబడతాను’’ అని అన్నాడు.
అప్పుడు అర్జునుడు కలుగజేసుకొని ‘‘మనలో తప్పులను చూస్తూ, మన బాధలను చూచి ఆనందిస్తూ, కౌరవులకు సలహాలనిస్తూ ప్రగల్భాలు పలుకుతున్న ఈ వాచాలుని కర్ణుని నీ ఆజ్ఞతో రణరంగంలో చంపుతాను’’ అని ప్రతిజ్ఞ చేశాడు. అలా అర్జునుడు అనగా సహదేవుడు బాహువులను పైకెత్తి,కళ్ళెఱ్ఱజేసి, పాములా బుసకొడుతూ శకునిని చూస్తూ ‘‘మోసకారి! గాంధారుల కీర్తిని నాశనం చేస్తున్న మూఢుడా! అవి పాచికలని అనుకొంటున్నావు. యుద్ధాన్ని నీ అంతట నీవే ఎన్నుకొన్నావు. భీమసేనుడన్న మాటను తప్పక చేసి చూపిస్తాను. ఆత్మరక్షణకు అన్ని ఏర్పాట్లు చేసుకో’’ అని అన్నాడు. నకులుడు సభలోని దుర్యోధనుని, అతడి తమ్ములను చూస్తూ
‘‘ద్యూత సభలో యాజ్ఞసేనుని పుత్రిక అయిన ద్రౌపదిని అనరాని మాటలు అన్నారు. కాలప్రేరితులై చావగోరుతున్న వారందరినీ యమ లోకానికి పంపిస్తాను. త్వరలో ఈ భూమి ధార్తరాష్టర్రహితంగా చేసి ధర్మరాజుకు ప్రీతి కలిగిస్తాను. ద్రౌపదికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను’’ అని అన్నాడు.

..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము