డైలీ సీరియల్

యాజ్ఞసేని - 75

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తదుపరి ధర్మరాజు సభికులను చూసి ‘‘్భరత వంశస్థులందరి దగ్గర సెలవు తీసికొంటున్నాను. వృద్ధుడైన భీష్మ పితామహుడు, రాజైన సోమదత్తుడు, మహారాజైన బాహ్లికుడు, ఆచార్యుడైన ద్రోణుడు, పండితుడైన కృపుడు, అశ్వత్థామ, మహామహాత్ముడు, హితకారి అయిన విదురుడు, నా తండ్రి అయిన ధృతరాష్ట్రుడు, తమ్ముడు యయుత్సుడు, మంత్రి సంజయుడు మొదలైన సభాసదులందరి దగ్గర సెలవు తీసికొని వెళుతున్నాను. తిరిగి వచ్చి దర్శనం చేసికొంటాను’’ అని అనగా విదురుడు-
‘‘కౌంతేయులారా! రాజకుమారి అయిన ఈ ‘కుంతిదేవి’ అరణ్యాలలో ఉండదగదు. సుకుమారి, వృద్ధురాలు అయిన ఈమె ఇక్కడే మా ఇంట్లో గౌరవంగా వుంటుంది. మీరు ఆరోగ్యంగా వుండాలని కోరుకొంటున్నాను’’ అని అన్నాడు.
యుధిష్ఠిరుడు అరణ్యవాసానికై బయలుదేరగానే ద్రౌపది యశస్విని అయిన అత్తగారు అయిన కుంతీదేవిని సమీపించి దుఃఖిస్తూ పాదాలకు నమస్కరించి వనవాసానికి వెళ్లటానికి సెలవు తీసికొన్నది.
అక్కడనున్న ఇతర గౌరవింపదగిన స్ర్తిలకు కూడా తగిన రీతిలో నమస్కరించి సెలవు గైకొని వనవాసానికి వెళ్లదల్చుకొన్నట్టుగా చెప్పింది. అంత రాభవనంలో ఆర్తనాదాలు మిన్నంటాయి.
అప్పుడు దుఃఖిస్తున్న ద్రౌపదిని చూచి కుంతీదేవి- ‘‘అమ్మా! ద్రౌపదీ! ఈ విధంగా పెద్ద కష్టం కలిగిందని నీవు శోకించవద్దు. నీవు స్ర్తి ధర్మాలను ఎరిగినదానవు. శీలాచారాలు కలదానవు. భర్తల విషయంలో నీ కర్తవ్యాన్ని నీకు చెప్పనవసరం లేదు. నీవు సాధ్వివి, సద్గుణ సంపన్నవు. పుట్టినింటికి, మెట్టినింటికి శోభనిచ్చిన దానవు.
అమ్మా! ఈ కౌరవులు అదృష్టవంతులు. నీ కోపాగ్నికి దగ్ధమైపోలేదు. నీ మార్గానికి ఎట్టి అడ్డంకులు కలుగవు. మరొక మాట నా కుమారుని సహదేవుని- అరణ్యవాసంలో ఎప్పుడూ కనిపెట్టి ఉండుము. ఈ సహదేవుడు దుఃఖించగలడు’’ అని అనగానే ద్రౌపది దుఃఖాన్ని మ్రింగుతూ ‘అలాగే’ అని అన్నది.
అప్పుడు ద్రౌపది ఏకవస్త్ర. అది కూడా దుమ్ముకొట్టుకొని వున్నది. జుట్టు విరబోసుకొని ఉన్నది. అలానే నిష్క్రమించింది. ఆ ద్రౌపది కుంతి అనుసరించి వచ్చింది. ఆభరణాలు విలువైన వస్త్రాలు కోల్పోయి ఉన్న తన కొడుకులందరినీ చూసింది. ముఖాలు దించుకొని ఉన్నారు.
వారిని చూచి కుంతీదేవి-
‘‘పుత్రులారా! మీరు సద్ధర్మాన్ని పాటించేవారు. మీ ప్రవర్తనమే మీకు ఆభరణం. మీరు ఉన్నతులు. దృఢభక్తులు. దేవతారాధన తత్పరులు. అటువంటి మీకు గొప్ప విపత్తు కలిగింది. ఏమిటీ విధి వైపరీత్యం. ఇది నా దోషమే కావచ్చును. కష్టాలను అనుభవించటానికే మిమ్ముల కన్నాను కాబోలు. సంపదలను కోల్పోయి ఎలా జీవిస్తారు. అన్నీ ఉండి కూడా మీరు బలహీనులయ్యారు అని పరి పరివిధాలా విలపించింది’’. అని విలపిస్తూ కుమారులను ఆశీర్వదించి ధైర్యం చెప్పుతున్న తల్లి కుంతీదేవి పాదాలకు పాండవులు పాదాభివందనం చేశారు.
37
పాండవుల వనవాస ప్రస్థానం
అలా నమస్కరించి పాండవులు బరువైన హృదయాలతో బయలుదేరారు.
ధర్మసుతుడైన యుధిష్ఠిరుడు, భీమసేనార్జున నకుల సహదేవులతో అరణ్యవాసానికి బయలుదేరాడు. ఉత్తరదిక్కుగా పయనించారు. వారి వెంట ఇంద్రసేనుడు మొదలగు ముఖ్యులు పధ్నాలు వేల రథాలతో, సుభద్ర, అభిమన్యుడు, ప్రతివింధ్యుడు మొదలగు ఉప పాండవులు వెంబడించారు.
పాండవులకు ద్రౌపదివలన జన్మించిన ఉప పాండవులైన ప్రతివింధ్యుడు (్ధర్మరాజుకు), శ్రుతసోముని (్భమునికి) శ్రుతకీర్తిని (అర్జునునికి) శతానీకుని (నలుకుడికి) శ్రుతసేనుని (సహదేవునికి) దృష్టద్యుమ్నుడు తన వెంట బెట్టుకొనని కాంపిల్యానికి వెళ్ళాడు.సుభద్రాభిమన్యులు ద్వారకా నగరానికి వెళ్లారు.
ఇంద్రప్రస్థంలో యుధిష్ఠిరుడు ఇరువది మూడు సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు. శకుని మాయాజూదంలో సర్వసంపదలనూ, రాజ్యాన్ని కోల్పోయి కట్టుబట్టలతో, జింక చర్మాలు ధరించి తమ్ములతో, భార్య ద్రౌపదితో పండ్రెండేళ్ళు అరణ్యవాసం చేయటానికై కురువృద్ధుల అనుమతిని పొంది బయలుదేరి వెళ్ళాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము