డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 77

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురోహితుడైన మహర్షి ధౌమ్యుడు ఒక ముహూర్తకాలం ఏకాగ్రచిత్తంతో ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించాడు. యుధిష్టిరునితో-
‘‘సమస్త ప్రాణులను రక్షించే అన్నం సూర్య రూపమైనదే. అతడే తండ్రి. రక్షకుడు. ధర్మాత్ముడా! అందువల్ల కర్మవిశుద్ధడవై నీవు కూడా తపస్సు చేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణులను పోషించుము’’ అని అతడికి నూటెనిమిది సూర్య నామాల్ని ఉపదేశించాడు.
ధర్మరాజు విశుద్ధాత్ముడై ఉత్తమమైన తపస్సు చేశాడు. పవిత్ర గంగాజలంలో స్నానమాచరించి సూర్యభగవానునికి అభిముఖుడై స్తుతించాడు.
‘‘అన్నపతీ! శ్రద్ధగా అందరికీ ఆతిథ్యమివ్వాలని ఆపత్కాలంలో వేడుచున్న నాకు ‘అన్నం’ ఇవ్వడానికి తగినవాడవు. శరణాగతుడనైన నన్ను రక్షించుము’’ అని ప్రార్థించగా-
లోకభవనుడు, భాస్కరుడు, దినకరుడు అయిన సూర్యభగవానుడు ప్రసన్నుడై మండుతున్న అగ్నివలె ప్రకాశిస్తున్న శరీరంతో ప్రత్యక్షమై ధర్మరాజుతో-
‘‘్ధర్మరాజా! నీవు కోరుకొన్నదంతటినీ నీవు పొందగలవు. ఈ పనె్నండు సంవత్సరాలు నీకు అన్నం నేనిస్తాను. ఈ ‘‘రాగి పాత్రను స్వీకరించుము. ఈ పాత్రలో మీ వంటింట్లో సంస్కరించిన ఫల మూలమిషకాలు, అన్నం మొదలగు చతుర్విధ పదార్థాలు (పాంచాలి భోజనం చేయునంత వరకు) అక్షయాలుగా ఉంటాయి. ఇప్పటినుండి పదునాల్గవ సంవత్సరంలో నీవు మరలా రాజ్యాన్ని పొందగలవు’’ అని చెప్పి సూర్యభగవానుడు అంతర్థానమయ్యాడు.
ద్రౌపది ప్రతిదినం సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ రాగి పాత్రలో వండిన శాకమూలాలు మిగుల రుచికరాలై భోజన పదార్థాలుగా మారి వారిని సంతృప్తిపరుస్తూ, ఎందరో బ్రాహ్మణోత్తములను చక్కగా పోషించగలిగాడు. అతిథి భుక్త శేషాన్ని పాండవులు భుజించేవారు. ద్రౌపది తన భర్తల భుక్తశేషాన్ని భుజిస్తూ ఉండేది.
38
రాజ్యాన్ని, సర్వ సంపదలనూ కోల్పోయి నారవస్త్రాలు, జింక చర్మలు ధరించి కామ్యకవనంలో అరణ్యవాసాన్ని గడుపుచున్న పాండవుల వద్దకు శ్రీకృష్ణవాసుదేవుని నాయకత్వంలో పాంచాల యదు వృష్ణి భోజాంధకులైన బంధువులు వచ్చారు. దుర్యోధనాదులను నిందించారు. కేకయ రాజ కుమారులు క్రోధంతో, అసహనంతో శ్రీకృష్ణుని ముందుంచుకొని ధర్మరాజు చుట్టూ చేరారు. పాండవులను ‘మేమేం చెయ్యాలి’ అని అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు-
‘దుర్మార్గులైన దుర్యోధన కర్ణ శకుని దుశ్శాసనులను చంపి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేద్దాం’’ అని అనగా అర్జునుడు శ్రీకృష్ణుని శాంతింపజేసి పరి పరి విధాల పొగిడాడు. అపుడు శ్రీకృష్ణుడు
‘‘అర్జునా! మనమిద్దరం నరుడు, నారాయణుడు అనే ఋషులం. వారిలో నీవు నరుడివి. నేను నారాయణుడిని. మనం గొప్ప శక్తిగలిగి మనుజలోకంలో అవతరించాం. శ్రీకృష్ణుడు, అర్జునుడు- తమకు భేదభావమే లేదనిన్నీ, తమలో ఒకరికి మిత్రులు ఇంకొకరికి మిత్రులనీ, అట్లాగనే ఒకరికి శత్రువులు ఇంకొకరికి శత్రువులేనన్నీ’’ అని ఇరువురూ మిత్ర సల్లాపాలు ఆడుకొంటుండగా -
వీరులైన దృష్టద్యుమ్నాది సోదరులతో కూడియున్న పాంచాలి క్రుద్ధురాలై రాజన్యులందరిచే చుట్టుకొనబడి సోదరుల మధ్యలో కూర్చుండియున్న శ్రీకృష్ణుని సమీపించింది.
క్రుద్ధురాలైన ద్రౌపది
‘‘కృష్ణా! వాసుదేవా! నీవే తొలి సృష్టి సమయంలో బ్రహ్మదేవుడివి. నీవే ప్రజాపతివి అని అసితుడైన దేవలుడు చెప్పాడు. నీవే నిత్య సత్యమయుడవైన యజ్ఞపురుషుడివి. ఇది కశ్యప ప్రజాపతి చెప్పినమాట. నీవు సర్వవ్యాపివి. నీ అవయవాల్లో విశ్వసృష్టి అమరియున్నది. ఇది నారదుడి వాక్కు. నీవు అక్షయజ్ఞాన నిధివి. ఇది సర్వ ముని ముఖ్యుల ప్రశంస.
ప్రభూ! స్వర్గలోకం నీ శిరస్సుతో నిండిపోయింది. భూమి నీ పాదాలతో నిండిపోయింది. ఈ లోకాలన్నీ నీ ఉదర స్వరూపమైనవి.
మధుసూదనా! నీ పట్లగల ప్రీతితో నేను నా కష్టాన్ని చెప్పుకొంటున్నాను. నేను అనుభవించిన పరాభవాన్ని నీకు తెలుపుతాను.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము