డైలీ సీరియల్

యాజ్ఞసేని-79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్లుండ ఒకనాడు ఋషులతో కూడియున్న ధర్మరాజు వద్దకుదల్భుని కుమారుడైన బక మహర్షి (బకదాల్భ్యుడు) వచ్చాడు. ధర్మరాజు తన తమ్ములతో ఎదురేగి మహర్షిని తోడ్కొని వచ్చి అర్ఘ్యపాద్యాలతో పూజించాడు. మహర్షి ధర్మరాజును చూచి
‘‘యధిష్ఠిరా! బ్రాహ్మణుల పట్ల నీ హృదయభావం ఎల్లప్పుడూ ఉత్తమ మైనది. అందుచేత ప్రశస్తమైన నీ కీర్తి అన్నిలోకాలలోనూ ప్రకాశిస్తున్నది.’’ అని అన్నాడు. అక్కడ ఉన్న బ్రాహ్మణులంతా బక మహర్షిని పూజించారు.
వ్యాసుడు, నారదుడు, పరశురాముడు, పృథుశ్రువుడు, ఇంద్రద్యుమ్నుడు, భాలుకి, కృతచే తసుడు, సహస్రపాత్తు, కర్ణశ్రవనుడు, కృతవాక్కు,లవణాశ్వుడు, కాశ్యపుడు, హారీతుడు, బృహదశ్యుడు, విభావుసవు, ఊర్ధ్వరేతుడు, వృషామిత్రుడు, సుహోత్రుడు, హోత్రవాహనుడు మొదలగు మహర్షులు, మునులు అజాతశత్రువైన ధర్మరాజును అర్చించారు.
40
ఒక సాయంకాల సమయంలో ద్రౌపదితోపాటుగ శోక పరాయణులై పాండవులు కూర్చుండి మాట్లాడుకొంటూ ఉన్నారు.
ద్రౌపది యుధిష్ఠిరునిపై కోపగించుట
అప్పుడు ద్రౌపది యుధిష్ఠిరుడిని చూచి-
‘‘రాజా! క్రూరుడు, దుర్మార్గుడు, పాపి అయిన దుర్యోధనుడికి మనపట్ల కొంచెం గూడా విచారం లేదు. దుర్బుద్ధి అయిన అతడు నాతోబాటు నిన్ను కేవలం కట్టుకొన్న వస్త్రాలతో వనవాసానికి పంపి ఎటువంటి పశ్చాత్తాపం పడటంలేదు. నా గురించి అతి నీచంగా ఆ నిండు సభలో మాట్లాడాడు. అంతేగాక తన మిత్రులతో కలిసి ఆనందిస్తున్నాడు. స్వామీ! నారబట్టలు కట్టుకొని నీవు వనవాసానికి బయలుదేరినపుడు కేవలం నలుగురు పాపాత్ముల నేత్రాలనుండే అశ్రువులు రాలేదు. వారు దుష్టచతుష్టయమైన ఆ దుర్యోధన కర్ణ శకుని దుశ్శాసనులు. తక్కిన కురువంశీయులందరూ దుఃఖించారు. రాజా! ఇపుడు నేను నీ గురించి దుఃఖిస్తున్నాను. రత్న సింహాసనంమీద ఆశీనుడవయ్యే నిన్ను నేడు దర్భలతో చేయబడిన ఈ ఆసనాన్ని చూసి, రాజోచితమైన శయ్యపై పరుండే నిన్ను ఈ శయ్యపై చూసి నా హృదయం దహించివేస్తున్నది. ఇంద్రప్రస్థంలో రాజులందరితో గూడి ఉన్న నిన్ను చూసిన నేను ఈ స్థలంలో చూడలేకున్నాను. నాకు శాంతం లేదు. బంగారు పాత్రలో ఇష్టమైన, రుచికరమైన వంటలతో భుజించిన నిన్ను కందమూలాలతో తృప్తిపడుతుంటే చూడలేకుంకడా ఉన్నాను.
నీ సోదరులు నేడు నీతోపాటు కందమూల ఫలాలతో జీవించడం చూస్తున్నాను. ఇక హృదయానికి శాంతి ఎక్కడిది. ఇప్పుడు భీమసేనుని చూస్తున్న నీకు శత్రువులపైన కోపము ఎందుకు రావడంలేదు. ఎందుకు ఉపేక్షిస్తున్నావు?
ద్రుపదుని వంశంలో పుట్టి, మహాత్ముడైన పాండు రాజుకు కోడలినై, దృష్టద్యుమునికి సోదరినై, వీరపత్నిని, పతివ్రతను అయిన నన్ను వనవాసం చేస్తుండగా చూసి, నీవు శత్రువులను ఎందుకు క్షమిస్తున్నావు? నీ హృదయంలో శత్రువులపట్ల కోపం లేదు. నీ సోదరులను నన్నూ ఈ స్థితిలో చూసినా నీ మనస్సు బాధపడటంలేదు. ఈ లోకంలో కోపం లేని క్షత్రియుడవే నీవు!
ప్రభూ! నీవు ఏ విధంగానైనా శత్రువులను క్షమించకూడదు. పరాక్రమంతోనే వారు చంపశక్యవౌతారు అని ఇతిహాసమైన బలి- ప్రహ్లాదుల సంవాదాన్ని చెప్పి-
‘‘సహనంతో మృదువుగా ఉంటే లోకులు అవమానిస్తారు. కోపంతో ఉండేవాడికి అందరూ భయపడతారు తగిన సమయాలలో ఈ రెంటినీ ప్రయోగించడం తెలిసినవాడే రాజు!’’ అని తన ఆవేదనను కోపాన్ని తెలిపింది.
శూలాలలాంటి సున్నితమైన మాటలను విన్న ధర్మరాజు ప్రశాంత చిత్తుడై ‘‘యాజ్ఞసేనీ! ద్రౌపదీ! క్రోధం మనుషులను చంపుతుంది. క్రోధాన్ని నిగ్రహింపలేకపోతే ఆ క్రోధం అతనికి వినాశనానికి దారితీస్తుంది. కోపంవలన మూడు పురుషార్థాలైన ధర్మానికి, అర్దానికి, కామానికి కీడు వాటిల్లుతుంది.
ఇహలోక పరలోకాలు రెంటికీ చెడిపోతాడు. సదాచారి అయిన పురుషుడు ఎల్లప్పుడూ క్రోధాన్ని విడిచిపెట్టాలి
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము