డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 80

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రోధం మానవుల వినాశనానికి, అవినీతికీ కారణమని తెలుసుకో. ఆపదలన్నింటియందు మానవుడు సహనం కలిగి ఉండాలి. క్షమ, శీలం వలననే మనుగడ సాగుతుంది. క్షమాశీలురైన వారి లోకాలు బ్రహ్మలోకంలో మిక్కిలి పూజింపబడుచున్నాయి. తేజోవంతుల తేజస్సు సహనం, తపస్సుల యొక్క తపస్సు సహనం. సత్యవ్రతుల సత్యం సహనం. సహనమే యజ్ఞం. సహనమే శాంతి. భూదేవితో సమానుడైన ఓర్పు కలవాడికి సదా విజయం లభిస్తుంది. క్షమావంతుడికి పరాక్రమం అన్ని సమయాలలోనూ కార్యసాధకమై రాణిస్తుంది.
పితామహుడు భీష్ముడు, దేవకీసుతుడు శ్రీకృష్ణుడు సహనాన్ని గౌరవిస్తారు. అందువల్ల దయా, సహనాన్ని నేను యధార్థ రూపంగా సహజంగా అనుసరిస్తున్నాను’’ అని సమాధానమివ్వగా ద్రౌపది యుధిష్ఠిరునితో-
‘‘ప్రభూ! కపటమైన జూదం సమయంలో మాత్రమే నీ బుద్ధి వక్రించి రాజ్యాన్ని, సంపదలనూ, ఆయుధాలనూ, సోదరులనూ చివరకు నన్ను గూడా జూదంలో ఒడ్డి ఓడిపోయావు. ఋజువర్తనుడు, మృదుస్వభావుడు, ఉదరుడు, సత్యవాది అయిన నీకు జూదమాడాలనే బుద్ధి ఎలా కలిగింది? ఇటువంటి భయంకరమైన విపత్తి నీకు కలగటం ఆలోచిస్తుంటే నా మనస్సు మిక్కిలి దుఃఖిస్తుంది.
ఈ శరీరం ఒక క్షేత్రం. ఈశ్వరునికి సాధనం మాత్రమే. దీని ద్వారా ఈశ్వరుడు ప్రాణుల చేత శుభాశుభ ఫల నిమిత్తమైన కర్మను చేయిస్తాడు.
నీవిలా విపత్తులో ఉండటం, సుయోధనుడు భోగభాగ్యాలలో ఉండటం చూసి నేను విధిని నిందిస్తున్నాను. సుయోధనుడు ధర్మం తప్పినాడు. ఆ సుయోధనునికి సంపదనిచ్చిన ఆ ఈశ్వరుడు ఏం ప్రయోజనం పొందగలడు? చేసిన పాపకర్మను అనుసరించకపోయినట్లయితే దానికి కారణం బలమే. అందువల్ల దుర్బలుడైనవారి గురించి బాధపడుతున్నాను’’ అన్నది. యుధిష్ఠిరుని బుద్ధిని, ధర్మాలను ఆక్షేపిస్తుంది. అందుకు-
‘‘యాజ్ఞసేనీ! నీవు మనోహరమైన చిత్ర చిత్రమైన పదాలతో కూడిన మాటను చెప్పావు. మేము దానిని విన్నాము. కానీ నీవు తెలియకుండానే నాస్తికత్వాన్ని ప్రతిపాదించావు. రాజపుత్రీ! నేను కర్మఫలాన్ని ఆపేక్షించి కర్మలను ఆచరించటం లేదు. దానం చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. యజ్ఞం చేయాలనే కర్తవ్య బుద్ధితో యజ్ఞం చేస్తున్నాను. కర్మఫలం ఉంటే ఉండును. లేకుంటే లేకుండుగాక. గృహస్థాశ్రమంలోని పురుషుడు చేయదగిన కర్మలను నేను యధావిధిగా నిర్వహిస్తున్నాను. ధర్మాన్ని ఆచరిస్తున్నాను. కానీ ఆ ధర్మఫలాన్ని ఆశించి కాదు.
మహీతపస్వి అయిన మార్కండేయ మహర్షిని నీ యెదురుగా వెళ్ళడం నీవు ప్రత్యక్షంగా చూచావుగదా! అతడు ధర్మపాలన చేతనే చిరంజీవి అయ్యాడు. వ్యాసుడు, వసిష్ఠిడు, మైత్రేయుడు, నారదుడు, లోమశుడు, శుకుడు, ఇంకా ఇతర మహర్షులంతా ధర్మంచేతనే శుద్ధ మనస్సు పొందగలిగారు.
ధర్మఫలం తొందరగా కనపడకపోతే అందుకు ధర్మాన్నిగానీ, దేవతలనుగానీ శంకించకూడదు. దోషదృష్టి లేకుండా యాజ్ఞం, దానం చేయాలి. కర్మఫలం తప్పక పొందబడుతుంది. అందువలన కృష్ణా! (ద్రౌపది) ధర్మం, ఈశ్వరుడూ అన్నీ సత్యమని నిశ్చయించుకొని, నాస్తిక్యభావాన్ని విడిచిపెట్టుము. ప్రాణులన్నింటి ధారణ, పోషణ చేసే భగవంతుని ఆక్షేపించకు. ఉత్తమమైన దైవాన్ని ఏ విధంగానూ అవహేళన చేయకుము’’ అని యుధిష్ఠిరుడు సున్నితంగా మందలించాడు.
తదుపరి భీమసేనుడు ధర్మరాజుకు కౌరవులపై ప్రతీకారాన్ని తీర్చుకొనుటకు ప్రేరేపిస్తాడు. కానీ ధర్మరాజు దానికి తగిన సమాధానంతో శాంతిపరుస్తాడు.
పాండవుల పుణ్య పరిపాకంవలన పరాశరుడి కుమారుడైన వ్యాస మహర్షి కుంతీపుత్రుల వద్దకు వచ్చాడు. పాండవులు మహర్షిని అర్చించారు. అప్పుడు మహర్షి ‘‘్భష్మ ద్రోణ కర్ణుడు మొదలైన వారిని యుద్ధంలో చంపటం మిక్కిలి భారమైన పని. అందువలన ఈ భారాన్ని తగ్గించటానికి అవసరమైన ప్రతిస్మృతి అనే విద్యను నీకు ఉపదేశిస్తాను. ఈ విద్యను సేవించటానికి అర్జునుని నియోగించుము. అర్జునుడు ఫలితాన్ని బడిసి చరితార్థుడౌతాడు అని చెప్పి ధర్మరాజును ఒక రహస్య స్థలానికి తీసికొనిపోయి ప్రతిస్మృతి అనే విద్యను ఉపదేశించాడు.
‘‘ఈ విద్యాశక్తివలన అర్జునుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరాది దేవతలను ఉపాశించి ఆ దివ్యాస్త్రాలను సంపాదించి శత్రువులను జయింపగలడు’’ అని చెప్పి మరలా ధర్మరాజుతో-
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము