డైలీ సీరియల్

యాజ్ఞసేని -- 81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరిచ్చట చాలాకాలంనుండి ఉండుటచేత ఈ అడవిలో ఫలాలు, పుష్పాలు, చెట్లు తరిగిపోయాయి. అందువలన ఇక్కడి జంతువులకు ఆటంకంగా వున్నది. అదీగాక ఒకచోట చాలాకాలం ఎవరైననూ ఉంటే ప్రీతి సన్నగిల్లుతుంది. కాబట్టి మీరు వేరొక అడవికి వెళ్ళటం మంచిది’’ అని చెప్పి పాండవలులను వీడి వెళ్లిపోయాడు.
ఒకనాడు ద్వైతవనంలో నిద్రిస్తున్న యుధిష్ఠిరునకు కన్నీళ్ళతో మృగాలు కలలో దర్శనమిచ్చాయి. చేతులు జోడించి భయంతో వణుకుతున్న జంతువులను చూసి ధర్మరాజు ‘‘మీరెవరు? మీకు ఏమి కావాలి? మీరు చెప్పదలచుకున్నదేదో చెప్పండి!’’ అని అడిగాడు. అప్పుడు ఆ మృగాలు-
‘‘్భరతా! రాజా! ద్వైతవనంలో చావగా మిగిలిన మృగాలము మేము. మేము ఇక చావలేం. మీరు మీ నివాసాన్ని మార్చుకొనండి. మీ సోదరులందరూ శూరులు. అస్తవ్రిద్యా విశారదులు. ఆ అడవిలో మీ నివాసంచే మా జంతువులను కొద్దిగా మిగిల్చారు. మహామతీ! బీజప్రాయంగా కొద్దిమంది మాత్రమే మేము మిగిలి ఉన్నాము. మహారాజా! మీ అనుగ్రహంతో వృద్ధి పొందగల్గుతాము. మీకు శుభమగుగాక! మామీద దయ చూపండి’’ అని అన్నాయి.
యుధిష్ఠిరుడు ఎంతో చింతించాడు. సర్వప్రాణుల మేలును ఆశించే ఆ రాజు ‘‘అలాగే! మీరు చెప్పినట్లే చేస్తాను’’ అని అన్నాడు.
మరునాడు సోదరులతో, చావగా మిగిలిన మృగాలు నా కలలో కనపడి ‘‘మేము మా జాతులలో దారపుపోగువలె మిగిలాము. మీకు శుభమగుగాక! మా మీద దయ చూపండి’’ అని అన్నాయి. కనుక మనం ‘తృణబిందు ఆశ్రమం’లోని సరోవరం సమీపంలో అనేక మృగాలతో ఆనందంగా ఉండే ఉత్తమమైన కామ్యకవనానికి వెళదాం. అది మరుభూమికి సమీపంలోనున్నది’’ అని అన్నాడు.
పాండవులు ద్రౌపదితో, అక్కడ తమతో కలిసి నివశిస్తున్న బ్రాహ్మణులతో ఇంద్రసేనుడు మొదలైన పరిచారకులతో అందరూ కలిసి స్వచ్ఛమైన జలంతో నిండి పవిత్రాశ్రమంగల సరస్వతీ నదీ గట్టున ఉండే కామ్యకవనాన్ని దర్శించారు (ఇది రెండవసారి. మరుభూమి = ఇప్పటి రాజస్థాన్ ప్రాంతం). అప్పటికి పాండవులు పదకొండు సంవత్సరాల వనవాసాన్ని గడిపారు.
ఇట్లుండ కొంతకాలానికి పాండవుల వద్దకు రోమశ మహర్షి వచ్చాడు. రోమశ మహర్షి చెప్పిన విధంగా పాండవులు తీర్థయాత్రలు చేస్తూ, పుణ్య క్షేత్రాలను దర్శిస్తూ, పవిత్ర తీర్థాలలో స్నానాలనాచరిస్తూ ఇంద్రలోకం నుండి వచ్చే అర్జునుని చూడటానికై గంధమాదన పర్వతానికి బయలుదేరారు.
పెక్కు రంగురాళ్ళతో, పక్షులతో, పలు జంతువులతో సుందరమైన గంధమాదన పర్వత ప్రాంతానికి దగ్గరలో చేరారు. అక్కడినుండి పూర్వం ‘‘నరనారాయణులు’’ అనే ఋషులు తపస్సు చేసిన పుణ్యస్థలమైన గంగ ఒడ్డున గల (అలకనందానది) ‘బదరీవనం’ చేరారు.
41
ఒక రోజు భీమసేనుడు ద్రౌపదీ సమేతుడై గంధమాదన పర్వత సానువులలోని రత్నాల అరుగులమీద విశ్రాంతి తీసుకుంటూ విహరించారు. అలా సంచరిస్తుండగా మనోహరమైన వేయి రేకులు గల తామరపువ్వు ఒకటి మిగుల సొంపులీనుతూ గాలివాటున వారి ఎదుట వచ్చిపడింది.
సౌగంధికాపహరణం
అందమైన ఆ సౌగంధిక కమలాన్ని చూచిన ద్రౌపది భీమసేనునితో-
‘‘రాజా! ఇటువంటి అందమైన పుష్పాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఆ పువ్వులోని నెత్తావి మరే వేరే పూవులలో కనిపించదు. ఆహా! ఇది ఒక్క పువ్వు మాత్రమే అయినా ఇంతవరకు ఎప్పుడూ ఎక్కడా ఇంతగా మనసుకు విందు, కళ్ళకు పండుగ కల్పించిన పుష్పం కనిపించలేదు గదా! ఇటువంటి పువ్వులు మరికొన్ని లభిస్తే ఎంత బాగుంటుంది. ఇవి సమీపాన ఉంటే తెచ్చి ఇచ్చి నా మనసుకు ఆహ్లాదాన్ని కల్పించుము.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము