డైలీ సీరియల్

యమహాపురి 64

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఎవరి సరదాలు వాళ్ళవి’’ అనుకున్నాడు యోగి.
ఆ అమ్మాయి- అక్కడున్న ఆ ఇద్దరివంకా చిరాగ్గా చూసి, ‘‘అమ్మా, బామ్మా! ఏమిటి, బయటివాళ్ళ ముందు మీ గొడవ?’’ అని విసుక్కుని, యోగి వంక తిరిగి, ‘‘నేను అవినాష్‌గారమ్మాయిని. ఈ ఇంట్లో ఎవరి మాటైనా, ఆఖరికి మా నాన్నగారి మాటైనా- నా తర్వాతే! విషయం నాకు చెప్పండి’ అంది.
ఏమనుకున్నారో మిగతావాళ్లిద్దరూ అక్కణ్ణించి జారుకున్నారు. యోగి తను వచ్చిన పని చెప్పాడు.
‘‘నాన్న నిన్న ఊరెళ్లారు. ఏ ఊరో చెప్పలేదు. ఫోన్ తీసుకెళ్లలేదు. ఎప్పుడొచ్చేదీ చెప్పలేదు. చాలా ముఖ్యమైన ప్రోగ్రామని చెప్పారు. మీరు నాకు మీ నంబరిచ్చి వెడితే- ఆయన వచ్చేక ఫోన్ చేసి చెబుతాను’’ అంది.
యోగి ఆమెకి నంబరివ్వలేదు. ‘‘మరోసారి నేనే స్వయంగా వచ్చి ఆయన్ని కలుస్తానులెండి’’ అని ఆమె అమాయకత్వానికి చేతులు జోడించి సెలవు తీసుకున్నాడు.
తర్వాత సుధాకర్ ఇంట్లోనూ ఇంచుమించు అలాంటి సమాచారమే లభించింది యోగికి.
సుధాకర్‌ది పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నదమ్ముల్లో చివరివాడు సుధాకర్. ఇంట్లో అందరికీ అతడంటే అభిమానం, ముద్దు.
యోగి వెళ్లేసరికి సుధాకర్ ఇంట్లో లేడు. అతడి వదిన కాబోలు తలుపు తీసింది. అతడు సుధాకర్‌ని ఏదో ప్రోగ్రాం కోసం పిలవడానికి వచ్చాడని తెలియగానే ఆమె అతణ్ణి డ్రాయింగ్ రూంలో కూర్చోబెట్టి లోపలకెళ్లింది.
అతడిలా కూర్చున్నాడో లేదో బిలబిలమంటూ కొందరు పెద్దలు, పిన్నలు వచ్చి అతణ్ణి చుట్టుముట్టారు.
యోగి ఏదో అడగాలనుకునేలోగా, వాళ్లలో ఒకొక్కరూ- ‘‘మా సుధాకర్ ప్రావీణ్యం గురించి మీ అభిప్రాయమేమిటి?’’’ అనడిగారు.
‘‘అతణ్ణి ప్రోగ్రాంకి ఆహ్వానిస్తున్నానంటే నా అభిప్రాయం వేరే చెప్పాలా?’’ అందామనుకున్నాడు యోగి. కానీ అతడు నోరు విప్పేలోగానే- వాళ్ళు ఒకరి తర్వాత ఒకరుగానూ, ఒకోసారి కలగలుపుగానూ- సుధాకర్ గురించి తామే బోలెడు చెప్పేశారు.
సుధాకర్‌ని మంత్రుల దగ్గర్నుంచి సినీ నటులదాకా ఎందరో మెచ్చుకున్నారుట. ఇప్పటికే మిమిక్రీలో తమంతటి వారు తామనిపించుకున్న కొందరికి- అప్పుడే సుధాకర్ అంటే అసూయ మొదలైందిట. ఎంత పేరొచ్చినా సుధాకర్‌కి కించిత్తు గర్వం కూడా లేదుట. అన్నింటా ఆరితేరినా తను నేర్చుకోవలసిందింకా చాలా ఉందంటాడట. కనపడినప్పుడల్లా తన సీనియర్లకి పాదాభివందనాలు చేస్తాడట. ‘‘బాబాయి ఆల్బం తెచ్చి చూపించేదా?’’ అని ఉత్సాహపడ్డాడో కుర్రాడు. సుధాకర్ అన్నల్లో ఓ అన్న కొడుకై ఉండొచ్చనుకున్నాడు యోగి.
యోగికి విసుగనిపించింది. కానీ కార్యసాధకుడికి ఓపిక అవసరమని గుర్తుచేసుకుని- అక్కడున్న అందర్నీ మాటలతో ఎంతో కొంత సంతృప్తిపరచడానికి ప్రయత్నించాడు. అలా అరగంట గడిపేకగానీ అతడికి సుధాకర్ గురించి అడిగే అవకాశం రాలేదు. చివరికి- అతడు తెలుసుకున్నదిది.
సుధాకర్ నిన్న ఊరెళ్లాడు. ఏ ఊరో చెప్పలేదు. ఫోన్ తీసుకెళ్లలేదు. ఎప్పుడొచ్చేదీ చెప్పలేదు వెడుతున్నది చాలా ముఖ్యమైన ప్రోగ్రాంకని మాత్రం చెప్పాడు.
అవినాష్ ఇంట్లోలాగే ఇక్కడ కూడా యోగి తన ఫోన్ నెంబరివ్వకుండా ఏదో సాకు చెప్పి తప్పించుకున్నాడు...
తర్వాత రచయిత్రి ఉష ఇంటికి వెడితే-
ఆమె టూ బెడ్రూం అపార్ట్‌మెంట్లో వుంటోంది. ఆమెకు ముగ్గురు చెల్లెళ్లుట. ప్రస్తుతం ఆఖరి చెల్లెలు ప్రభ ఆమెతో ఉంటోంది.
యోగి తలుపు తట్టగానే- ప్రభే తలుపు తీసింది.
ఆమె వయసు ఇరవైకి లోపే. పెద్ద అంతగత్తె కాదు కానీ వయసు సొగసుల్లో ఆకర్షణీయంగానే ఉంది.
‘‘ఉషగారున్నారా?’’ అడిగాడు యోగి.
ప్రభ వెంటనే, ‘‘లోపలకు రండి’’ అంది.
లోపల పేము కుర్చీలున్నాయి. ఇద్దరూ చెరో కుర్చీలో ఎదురెదురుగా కూర్చున్నారు.
ప్రభ చురుకైనదిలా ఉంది. యోగిని చూడగానే ఆమె కళ్లు మెరిశాయి. అతడితో మాట్లాడాలని చాలా ఉత్సాహపడింది. ‘‘అక్క ఇంట్లో లేదు. కానీ నాతో మాట్లాడొచ్చు. ఏ కాలేజీలోనో అక్కడ ఉపన్యాసమివ్వాలి. పిలవడానికొచ్చారు. ఔనా?’’ అందామె.
ఆమె ఉత్సాహాన్ని పెంచాలని, ‘‘్భలే చెప్పారే, యు ఆర్ టూ ఇంటలిజెంట్’’ అన్నాడు యోగి.
‘‘బాగా కనిపెట్టారు. నా తెలివికి అక్క కూడా ఆశ్చర్యపోతూంటుంది. ఓ నవల తీసుకుంటే- మొదటి పేజీ చదివితే చాలు- ముగింపు చెప్పేస్తాను’’ అంది ప్రభ.
‘‘ఇప్పుడు రాసేవాళ్లలా రాస్తున్నార్లెండి. కథలే ఎందుకూ- మన సినిమాలే తీసుకోండి. బిగినింగ్ చూస్తే చాలు- తర్వాతొచ్చే మొత్తం కథంతా చెప్పేయొచ్చు. తీసేవాళ్లలా తీస్తున్నారు మరి’’ అన్నాడు యోగి- అదంతా పెద్ద విశేషం కానట్లు.
‘‘మీరు చెప్పేది తెలుగు సినిమాలూ, నవల్లూ గురించి. నేను చదివేవన్నీ ఇంగ్లీషు నవల్లు, చూసేవన్నీ హాలీవుడ్ పిక్చరు’’ అంది ప్రభ గొప్పగా. అవైతే అన్నీ ఒరిజినల్సు అన్న భావం ఆమె గొంతులో ధ్వనించింది.
‘‘ఐతే యు ఆర్ రియల్లీ టూ ఇంటెలిజెంట్. అసలు మీ మాటలు వింటుంటే, రచయిత్రి మీ అక్క కాదు- మీరనిపిస్తోంది. నిజం చెప్పండి. మీ అక్కయ్య మిమ్మల్ని దగ్గరుంచుకున్నది- మీ ఐడియాల కోసమే కదూ!’’ అన్నాడు యోగి.
ప్రభ కాదనలేదు, ‘‘ఐడియా ఇస్తే మాత్రం ఎవరికిచ్చానూ, అక్కకే కదా! దాని గురించి ఎక్కువ మాట్లాడ్డం నాకిష్టం లేదు’’ అంది.
‘‘ఇంతకీ మీ అక్కగారెప్పుడొస్తారు?’’ అన్నాడు యోగి.
‘‘తెలియదు’’
‘‘అసలామె ఎక్కడికెళ్లరు?’’
‘‘అదీ తెలియదు’’ నీరసంగా అందామె.
‘‘అదేమిటీ- మీరడగలేదా?’’ ఆమె చెప్పలేదా?’’ అన్నాడు యోగి.
ప్రభ సాలోచనగా, ‘‘అడిగానంటే అడిగాను. చెప్పలేదంటే లేదు..’’ అంది.
‘‘మీ అక్కగారేమో రచయిత్రి. మీరేమో- ఆమెకే ఐడియాలిస్తారు. మీరు నర్మగర్భంగా మాట్లాడితే- సామాన్యుణ్ణి- నాకెలా అర్థవౌతుంది.

ఇంకా ఉంది

వసుంధర