డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతనికి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. కొలీగ్స్ బార్‌లోకి రావడంతోనే మందు ఆర్డర్ చేసాడు నిహార్. వెయిటర్ మందు బాటిల్స్ పెట్టడమే ఆలస్యం తానే మందును గ్లాస్‌లోకి పోసాడు. కొలీగ్స్‌కు మాట్లాడి అవకాశం ఇవ్వకుండా వాళ్ళనోటి ముందు గ్లాస్ పెట్టాడు. కనీసం పెగ్గుకు పెగ్గుకు మధ్య గ్యాప్ కూడా తీసుకోనివ్వలేదు.
పార్టీ జరుగుతున్నంతసేపూ చేతి వాచ్ వంక చూసుకుంటూనే వున్నాడు. మధ్యమధ్య భార్యకు ఫోన్ చేస్తున్నాడు. తను మాత్రం కూల్ డ్రింక్ మాత్రమే తీసుకున్నాడు.
‘‘తొందరగా తాగిచావండిరా’’ అన్నాడు. చివరికో తలా ఓ క్వార్టర్ బాటిల్ వాళ్ళ జేబులో పెట్టి దగ్గరుండి మరీ సాగనంపాడు.
‘‘ఒరే సెంటర్ జైలులో కూడా ఇలా చేయరురా... ఎవరైనా పార్టీ ఇస్తే కిక్కు ఎక్కుతుందిరా... నువ్వు పార్టీ ఇస్తే కిక్కు దిగుతుందిరా... పార్టీ ఇలా కూడా ఇస్తారని ఇపుడే తెలిసిందిరా...’ కిరణ్ ఉక్రోషంగా అన్నాడు.
‘‘మద్యపానం ఆరోగ్యానికి హానికరం రా...’’నిహార్ తాపీగా అన్నాడు.
రెండు చేతులు జోడించి ‘‘నీకో దండంరా... నన్ను ఇంటి వరకు దిగబెట్టాలా? అడిగాడు కిరణ్.
‘‘నీకు మందెక్కువయిందిరా... దిగేటెట్టేది నేను’’ అన్నాడు బైక్ దగ్గరికి వచ్చి.
అపుడే కిరణ్‌కు ఫోన్ వచ్చింది. జేబులో నుంచి ఫోన్ తీసి ‘చెప్పు పావని... నేనా... ఇరానీ హోటల్‌లో టీ తాగుతున్నాను. నిహార్‌కు తలనొప్పిగా ఉందంటే... హోటల్‌కు వచ్చాం. ఆఫీస్‌లో వర్క్ కాస్త ఎక్కువైంది... డిన్నరా.. వద్దు కడుపులో అనీజీగా వుంది. పాలు తాగి పడుకుంటానులే... ఓకే ఓకే నీ వాయిస్ కట్టవుతుంది...’’ అంటూ ఫోన్ కట్ చేసాడు.
నిహార్ అలానే చూస్తూ వుండిపోయాడు.
‘‘ఎన్ని అబద్ధాలురా... ఇపుడే కదరా మందు కొట్టి చికెన్ బిర్యానీ పీకల్దాకా తిన్నావు... పాపంరా’’ అన్నాడు నిహార్.
‘‘అమాయక ప్రాణి... ముందుముందు నీకే అర్థమవుతుంది... అయినా అబద్ధాలు ఆడని మొగుడు, నిజాలు చెప్పి పెళ్ళాం ఈ చరిత్రలో ఉన్నట్టు దాఖలాలు లేవు’’ కిరణోపదేశం చేసాడు.
నిహార్ బైక్ స్టార్ట్ చేసాడు.
***
నిశ్చల అద్దం ముందు నిలబడి తనను తానూ చూసుకుంది. తనకు తానూ కొత్తగా కనిపిస్తోంది. పెళ్ళైతే అమ్మాయిలు మరింత అందంగా కనిపిస్తారా? బహుశా అందమైన మనసున్న మొగుడు వస్తే అందంగా తయారవుతారేమో... నిహార్ గుర్తుకు వచ్చేసరికి ఆమె బుగ్గలు గోరింట పెట్టినట్టు ఎర్రబడ్డాయి.
ఇష్టంతో కూడిన సిగ్గు గోరింటకన్నా అందంగా ఉంటుందేమో... మెడలో నిహార్ కట్టిన మంగళసూత్రం... పాదాలకు మెట్టెలు... తనకు మరింత అందాన్ని ఇచ్చినట్టు అనిపించింది. గోడ గడియారం వంక చూసింది. ఏడున్నర దాటింది. ఈపాటికి బయల్దేరి ఉంటాడు. భర్త జ్ఞాపకం ఆమెను అమాంతం చుట్టేసింది.
భార్యాభర్తల బంధం ఇంత గొప్పగా... ఇంత ఎమోషనల్‌గా ఉంటుందా? ఇద్దరు వ్యక్తులు పెళ్లి అనే బంధం ద్వారా ఒక్కటైతే ఇంత బావుంటుందా? అందుకే వివాహ వ్యవస్థ సృష్టిలోఅందంగా ఉంటుంది. భర్తకోసం ఇష్టమైనవన్నీ వండింది.
ప్రతీ ఆడపిల్ల పెళ్లికోసం కలలు కంటుందో లేదో తెలియదుకానీ తను మాత్రం ఒకేఒక కల కన్నది.
ప్రేమించే భర్త అనుక్షణం తన మనసును అట్టిపెట్టుకునే భర్త కావాలనుకుంది.
ఒంటరిగా వున్నా ఎన్నో ఆలోచనలు. పక్కనే భర్త లేకున్నా ఎన్నో భావాలు..అన్నింటికీ కేంద్ర బిందువు భర్తే...
అప్పుడే మొబైల్ రింగ్ అయ్యింది.
***
కిరణ్‌ను దింపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు నిహార్... కారణం... నిశ్చలకోసం పువ్వులు తీసుకుందామని. కిరణ్‌ని తీసుకువస్తుంటే దారిలో బుట్టలు ఎత్తుకుని దారిపొడవునా అమ్ముతున్న సన్నజాజుల వాసన మొదటిసారి అతడిని ఎక్కడికో తీసుకువెళ్ళింది.
కిరణ్ ముందు పువ్వులు తీసుకోవడం ఇష్టంలేక కిరణ్‌ను దింపి వెనక్కి వచ్చాడు.
బైక్ ఆపాడు. ‘‘రండి బాబు సన్నజాజులు...’’ అంటూ అరుస్తున్నారు. బుట్ట నిండుగా పూలమాలలు... పువ్వులు విచ్చుకుని తన నిశ్చల నవ్వుల్లా మెరుస్తున్నాయి. ఆ పరిమళాలు తన నిశ్చల జ్ఞాపకంలా వున్నాయి.
ఫస్ట్ టైం... ఊహ తెలిసాక ఎపుడు పూలు కొనలేదు. కొద్దిగా ఇబ్బందిగా, మరికొద్దిగా సిగ్గుగా అన్పించింది. జంటలు వస్తున్నాయి. కొందరు పూలు కొని జడలో తురుముకుంటూ ఉంటే తను నిశ్చలను ఇక్కడికి తీసుకువస్తే బావుందనిపించింది.
‘‘మీటర్ ఎలా అడిగాడు? పూలు అమ్మే ఆవిడను.
ఆవిడ వయసు అరవైకి పైగా ఉంటుంది.
‘‘మీటర్ పువ్వులు ఎలా అవ్వా? అమాయకంగా అడిగాడు.
‘‘కొత్తగా పెళ్లయిందా బాబు’’ ఆ అవ్వకు అర్థమైంది. తన కొడుకును చూస్తున్నట్టు వుంది.
గతుక్కుమన్నాడు నిహార్’’ అదేమిటి...మీటర్ అంటే ఎక్కువా? వెంటనే మొబైల్ తీసి భార్యకు ఫోన్ చేసాడు.
***
‘‘నిశ్చలా పూలు ఎన్ని మీటర్లు తేవాలి?
నిశ్చలకు వెంటనే అర్థం కాలేదు. అర్థమైన వెంటనే చిన్నగా నవ్వి ‘‘మీటర్ కాదు మూర... మూడుముళ్లు వేసారుగా మూడు మూరలు తీసుకురండి’’ అంది.
నిహార్ ఫోన్ పెట్టేసి ఆ అవ్వ దగ్గరికి వెళ్ళాడు. కాస్త సిగ్గుగా అనిపించింది.
‘‘ఎన్ని మూరలు ఇవ్వను బాబూ’’ అడిగింది అవ్వ.
‘‘మూడు మూరలు’’ చెప్పాడు నిహార్.
అవ్వ మూడు మూరలు ఇచ్చి బుట్టలోవున్న అప్పుడేవిచ్చుకున్న పింక్ కలర్ గులాబీలు కొన్ని ఆకులు పూలమాలతో పాటు కట్టి ఇచ్చింది.
***
కిరణ్ ఇంట్లోకి అడుగుపెట్టడంతోనే పావని ‘ఎక్కడినుంచి వస్తున్నారు?’ అని అడిగింది.
‘ఆఫీస్ నుంచి’ తడుముకోకుండా చెప్పాడు కిరణ్.
ఆఫీసులు ఈమధ్య ఏడుగంటల వరకూ కూడా పనిచేస్తున్నాయా? వ్యంగ్యంగా అడిగింది పావని.
‘‘్భర్యల నోళ్లు ఇరవై నాలుగు గంటలూ పనిచేయగా లేనిది ఆఫీసులు ఏడు వరకు పనిచేస్తే వింతేముంది?’’ రిటార్టిచ్చాడు కిరణ్.
‘‘ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదూ’’ అంది కోపంగా పావని.
‘‘ఆఫీసునుంచి అలిసిపోయిన మొగుడు ఇంటికి రాగానే తిట్ల పారాయణం వినిపించే పెళ్లానికి సిగ్గులేనపుడు, గొడ్డులా కష్టపడే మొగుడికి సిగ్గెందుకు’’ మత్తులో కక్కేసాడు.
‘‘నోరుతెరిస్తే అబద్ధాలు.. మీ బ్రతుకంతా అబద్ధాలే.. నా బ్రతుకంతా దరిద్రాలే’’
‘‘ఏమిటో నీలో నువ్వే గొణుక్కుంటున్నావు. నాకేమీ వినిపించడంలేదు.. అయినా మొగుడు ఇంటికి రాగానే నవ్వుతూ ఎదురురావాలి.. కానీ నువ్వేంటీ అంతా రివర్స్...’’’ అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి మంచంమీద అడ్డంగా పడుకున్నాడు.
వెంటనే కిరణ్‌తోపాటు లోపలికి వెళ్లి ‘‘నిజం చెప్పు కిరణ్.. నువ్వు ఆఫీస్ నుంచి తిన్నగా ఇంటికే వచ్చావా?’’ అడిగింది నీలదీస్తున్నట్లు.

-సశేషం

-తేజారాణి తిరునగరి