డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు? -- 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

6
భర్త వెళ్ళేక ఒక్క క్షణం అలా సోఫాలో కూర్చుండిపోయింది. ఏ పనీ చేయబుద్ధేయలేదు. పెళ్లి ఎంత మార్పును తీసుకువచ్చింది. నిన్నటి వరకు తన ఇల్లు వేరు.. తన ప్రపంచం వేరు.. తన ఆలోచనలు వేరు.. పెళ్లితో తన ప్రపంచంలో మరో ఫార్మేట్‌లోకి మారినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్ సినిమాలు సరదాలు అన్నీ మంత్రం వేసినట్టు మాయమయ్యాయి. అమ్మ కూడా గుర్తుకురావడం లేదు. అమ్మ గుర్తుకురానంత ప్రేమ తనకు నిహర్ దగ్గర దొరుకుతుందా? తాను మాత్రమేనా? ప్రతీ ఆడపిల్ల ఇలానే ఉంటుందా? ఇది తనిల్లు.. తాను జీవితకాలం ఉండేది భర్త దగ్గరే.. సృష్టి ఎంత చిత్రంగా వుంటుంది. అమ్మ కడుపులో తొమ్మిది నెలల ఇరవయ్యేళ్ల పెంపకం.. ఒక పెళ్లితో మరో వ్యక్తి జీవితంలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
ఆమె ఆలోచనలు కొనసాగుతుండగానే ఇంటినుంచి ఫోన్.. అమ్మా, నాన్న, బామ్మా.. ఒకరి తర్వాత ఒకరు.. కుశుల ప్రశ్నలు.. ఆరాలు.. బామ్మా అయితే మరీ..
‘‘ఏంటే నిశ్చలా.. ఏమిటీ విశేషం?’’ అనడిగింది.
‘‘నిశేషమా.. ఇప్పుడేమంటుంది బామ్మా?’’
‘‘నీ కడుపున కాయో పండో పడితే దానికి నా పేరో మీ తాతయ్య పేరో పెట్టి నేను మీ తాతయ్య దగ్గరికి వెళ్లిపోతానే’’
‘‘బామ్మా.. నీకు చాదస్తం ఎక్కువవుతోంది.. కామెడీ ఓవర్ అవుతుంది.. అప్పుడే కాయేమిటి? పండేమిటి? అయినా తాతయ్య దగ్గరికి వెళ్లడానికి తొందరేమిటి? తాతయ్యను కొంతకాలం మనశ్శాంతిగా ఉండనివ్వు’’ నవ్వుతూ అంది.
‘‘అదే కదా నా బాధ.. ఏ రంభతోనో, ఊర్వశితోనో పేకాడుతూ వుండి ఉంటాడు..’’ తానూ తక్కువ తినలేదన్నట్టు రిటార్టిచ్చింది బామ్మ.
చాలా అల్ట్రా మోడ్రెన్ బామ్మ.
అలా సమయం గడిచింది.
ఇల్లు సర్దుకుందామనుకునేలోగా రెండుసార్లు నిహార్ దగ్గరినుంచి ఫోన్.. ఎలా వున్నావంటూ..
నవ్వుకుంది... ఇష్టంగా.
సరిగ్గా అప్పుడే వచ్చింది పావని.
చేసే పనులు ఆపి పావనిని కిచెన్‌లోకి తీసుకువెళ్లింది కాఫీ కలిపి ఇచ్చి, కాఫీ తాగాక తన గదిలోకి తీసుకువచ్చింది.
మహాభారత యుద్ధానికి కురుక్షేత్రం వేదిక అయితే.. త్వరలో మొదలవ్వబోయే స్వీట్ వార్‌కు, సీరియస్ టాపిక్‌కు ఆ గది వేదికగా మారింది.
***
నిహార్ కిరణ్ వంక చూసి బయటకు పదమన్నట్టు సైగ చేసాడు. మెల్లిగా సర్దుకుని లేచాడు కిరణ్. ఇద్దరూ చెట్టుకింద నిలబడ్డారు. ‘‘చెప్పరా రాత్రి ఏమైంది?’’ అడిగాడు నిహార్.
సిగరెట్ తీసి వెలిగించి ‘‘పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం’ అన్నాడు నోట్లోనుంచి పొగ వదులుతూ కిరణ్.
‘‘ఒరే.. నేను అడిగిందేమిటి? నువ్వు చెప్పేదేమిటి?’’
‘‘మీ స్వంత తప్పిదంవల్ల కానీ..’’ ఇంకా థియేటర్‌లోని యాడ్‌ని చెప్పబోతుంటే..
‘‘అసలు విషయం చెప్పరా?’’ విసుక్కున్నాడు నిహార్.
‘‘నా చిన్నప్పట్నుంచి చూస్తున్నానురా.. థియేటర్‌లో వేస్తూనే వున్నారు. సిగరెట్ ప్యాకెట్‌మీద వార్నింగ్‌లు గుద్దుతూనే వున్నారు.. అయినా తాగడం మానారా?.. ఊహూ.. లేదే... దూల.. నాలుక దూల.. పెళ్లికూడా అంతేరా.. అదేమిటో అందరూ చెప్పేవాళ్ళే.. అయినా పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు..’’ కిరణ్ పొగను గాల్లోకి ఊది అన్నాడు.
‘‘నీకు రాత్రి మందు తాలూకు హ్యాంగోవర్ తగ్గలేదనుకుంటాను... అర్థరాత్రి మద్దెల దరువులా పావని ఫోన్ చేసిందిరా.. నేను తెగ కంగారు పడ్డాను’’ నిహార్ చెప్పాడు.
‘‘దానికి కారణం నువ్వేరా మిత్రద్రోహి’’
‘‘నేనేం చేసానురా.. పీకల్దాకా తాగించాను కదరా’’
‘‘మనం అసలు బార్‌కు వెళ్లామని ఎందుకు చెప్పావు?’’
‘‘మరి ఇరానీ హోటల్‌కు వెళ్లామని చెప్పాలా? అయినా మనం వెళ్లింది బార్‌కే కదరా?’’
‘‘నువ్వు చాలా డెవలప్ కావాలిరా.. బాస్‌తో అబద్ధం చెప్పినా పర్లేదు.. కాస్త ఓవర్‌టైం వర్క్ చేస్తే.. ఇట్స్ ఓకె అంటాడు. దేవుడితో అబద్ధమాడినా పర్లేదు.. చెంపలు వాయించుకుని, లెంపలేసుకుంటే క్షమించేస్తాడు. ఒక్క భార్యలు మాత్రం.. ఈ భార్యలున్నారు చూడూ.. మొగుళ్లను ఎప్పుడూ అర్థం చేసుకోరు.. నిజాలు చెబితే.. సాధిస్తూనే వుంటారు.. నిజాలను నమ్మని జాతి భార్య జాతి.. నిజాలను అర్థం చేసుకోని కోతి.. మన భార్యే అన్నది నీతి.. అర్థం చేసుకుంటే సుఖపడిపతావు.. కనీసం బాధలకు అలవాటుపడిపోతావ్.. లేదంటే.. అని గాల్లోకి మరోసారి పొగ వదలి.. ఇలా గాల్లోకి కలిసిపోతావు.. బ్రతుకు బాయిల్డ్ అయిపోతుందిరా..’’
‘‘‘ఎందుకురా ఇలా మాట్లాడుతావు.. భార్యాభర్తలు అన్నాక సర్దుకుపోవాలి’’
‘‘ఏంటి సర్దుకుపోయేది?’’
జీతమంతా భార్యలు ఫస్ట్ రాగానే సర్దేస్తారు.. మన ఆనందాలను స్ట్రా లేకుండానే పీల్చేస్తారు.. నోట్లో కోరలు కనిపించని డ్రాక్యులాలురా.. ఈ పెళ్లాలు- సిగరెట్ చివరకంటూ అయిపోవడంతో కిందవేసి కాలితో నలిపి.. నిహార్ వంక చసి.. ‘‘అలా నలపకపోతే.. మన పీకను సిగరెట్‌కన్నా అధ్వాన్నంగా చూస్తారు’’ అన్నాడు కిరణ్.
‘‘ఒరే నువ్వు ఫస్ట్రేషన్‌లో వున్నావురా’’ జాలిగా అన్నాడు నిహార్.
‘‘ఇది ఫస్ట్రేషన్ కాదురా.. డిప్రెషన్.. భార్య అనే ఒత్తిడికి గురై, సాధింపులు అనే టార్చర్‌కు అలవాటుపడి.. మొగుడనే జీవుడు సంసారమనే మూకుడులో ఫ్రై అవుతోన్న హిస్టరీరా..’’ కిరణ్ రెచ్చిపోతున్నాడు.
‘‘ఇవాళ నీ మూడ్ బాగోలేదురా.. తర్వాత మాట్లాడుకుందాం...’’ అన్నాడు అక్కడినుంచి కదులబోతూ..
‘‘హలో.. అదేం కుదర్దురా... నాలోని నిద్రపోతున్న అగ్నిపర్వతాన్ని అలారం పెట్టి మరీ లేపావు.. ఇపుడు వినకపోతే ఈ కార్చిచ్చు నిన్నూ కాలుస్తుంది. నిన్ను సేవ్ చేయడానికైనా నీకు కొన్ని నిజాలు చెప్పాలి..’’ నిహార్‌కు అడ్డుగా నిలబడి అన్నాడు.
‘‘పొరపాటున కదిలించానురా..’’ రెండు చేతులూ జోడించి అన్నాడు.
‘‘అవున్రా.. నన్ను కదిలించావు.. నాలోని బాధల వీణతో నా కష్టాల రాగాలు పలికించావు’’ డ్రెమటిగ్గా అన్నాడు.
‘‘అసలు నీ బాధేంట్రా..’’ అడిగాడు నిహార్.
‘‘హూ.. పెళ్లామే నా బాధరా.. పెళ్ళైన సంవత్సరం వరకూ బాగానే వుంటారు.. సారీ రా.. చిన్న కరెక్షన్.. బాగానే ఉన్నట్టు నటిస్తారు.. కాలం గడిచేకొద్దీ.. క్యాలెండర్‌లో రోజులు మారినకొద్ది అసలు విశ్వరూపం చూపించడం మొదలుపెడతారు..’’ అని ఆగి నిహార్ వంక చూసాడు.
‘‘విశ్వరూపమా.. ఒకటి పెద్ద ఎన్టీఆర్ చూపించాడు.. రెండు కమల్‌హాసన్ చూపించాడు.. మరి ఈ విశ్వరూపం ఏమిట్రా?
‘‘వాళ్ళు మహానుభావులు.. పాత్రకు ప్రాణం పోసిన మహానటులు.. కానీ భార్య అనే సహజసిద్ధమైన నటి.. పెళ్ళైన తర్వాత తన అసలు ఫేస్‌ను చూపిస్తుంది..’’
‘‘అదేమిట్రా.. అమ్మాయిలకు రెండు ఫేస్‌లు ఉంటాయా.. అప్పుడెప్పుడో నాలుకలు మొలుస్తున్నాయి.. కథలో బోల్డు నాలుకలు మొలచినట్టు చదివాను’’
‘‘ఇది కథ కాదురా.. లైఫ్.. పెళ్లికి ముందు తలొంచుకుని మనతో మూడు ముళ్లు వేయించుకుని, ఎస్.. బాస్ అన్నట్టు బిల్డప్ ఇచ్చి.. కొద్దిగా పాత బడ్డాక.. సిగ్గుని పాతరేసి మనల్ని ఉతికి ఆరేస్తారు.. అమ్మాయిలు అమ్మలు మంచివాళ్ళే.. పెళ్లాలే మహాగడుసులు.. మొగుళ్ళ కళ్ళలో నలుసులు..’’ నిహార్ భుజంమీద చేయి వేసి కొనసాగించాడు.

-సశేషం

-తేజారాణి తిరునగరి