డైలీ సీరియల్

యాజ్ఞసేని-93

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే పాండవులు ఆయుధాలు ధరించి జయద్రథుడు వెళ్లిన మార్గాన్ని అనుసరించి వెంట పడ్డారు. వారికి సైన్యంలోని కాలి గిట్టల తాకిడికి ఎగిరిన ధూళి కనపడింది. కాల్బలం మధ్యలో ‘‘్భమసేనా! పరుగెత్తుకురా!’’ అని ఆక్రోశిస్తున్న ధౌమ్యుడు కూడా కనపడ్డాడు. అంత పాండవులు ‘‘ఇక మీరు నిశ్చితంగా వెళ్ళండి’’ అని ధౌమ్యుని ఓదార్చి జయద్రథుని సైన్యాన్ని వెనె్నంటి వెళ్ళారు. కొంత దూరంలో పాండవులకు ద్రౌపది ధిక్కారపూర్వకమైన మాటలు విన్పించాయి.
వెంటనే భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజుతో కలిసి జయద్రథుని అదిలించారు. అప్పుడు శత్రు సైనికులకు దిక్కుతోచకుండా పోయింది. ఆ పాండవుల ధ్వజాగ్రాలను చూచి ఉత్సాహమంతరించిపోయిన దురాత్ముడు జయద్రథుడు రథంలోనున్న యాజ్ఞసేనితో-
‘‘పద్మముఖీ! ఇదిగో ఆ మహారథాలు అయిదు వస్తున్నాయి. వారు నీ భర్తలనుకుంటాను. వారిని బాగా ఎరిగివున్న నీవు వారిని గూర్చి వరుసగా నాకు తెలుపుము అని అన్నాడు. అందుకు ద్రౌపది-
‘‘నీచుడా! నీ చావు దగ్గరపడింది. ఇపుడు నీవు పాండవుల గురించి తెలిసికొన్నా తెలిసికొనకపోయినా నీకు గత్యంతరమేమయినా వున్నదా? దురహంకారంతో చెడ్డ పనికి ఒడిగట్టి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నావు. ఇది స్వయంకృతాపరాథం. నీవు ప్రార్థించావు కాబట్టి చెపుతున్నాను, నీకు భయపడి కాదు. ధర్మరాజును చూచాను. నా యోగక్షేమాల గురించి ఇంకా నాకు చింతగానీ, భయంగానీ లేదు.
అడుగో! సన్నని, గుండ్రని శరీరం కలవాడు, బంగారం వంటి రంగుతో మిలమిలలాడే దేహకాంతి కలవాడు, యుద్ధంలో అప్రతిహతమైన పరాక్రమం కలవాడు అయిన యుధిష్టిరుడు అతడే! కురువంశ శ్రేష్ఠుడు. అజాతశత్రువు. నా మాటలు విని నీవు ఆ మహాత్ముని శరణు వేడుము. అతడు నీ తప్పు క్షమించగలడు. ఇది నీకు ఆఖరి అవకాశం’’.
అడుగో! గొప్ప వేగంగల గుఱ్ఱాలను పూన్చిన రథం, ఆ రథంపైన కన్పించే గొప్ప శరీరం కలవాడు. సాలవృక్షంవలె ఉన్నవాడు, పెదవి కొరుకుతున్న దంతాలతో భయంకరంగా ఉన్నవాడు వాయుపుత్రుడు భీమసేనుడు. యుద్ధాలలో అతి భయంకరుడు. ధర్మరాజుకు ప్రియమైనవాడు. ఎవరికినీ జయింప శక్యంగానివాడు. ఇతడు చేసే పనులు అతిమానుషాలు కాబట్టి ‘్భముడు’ అనే పేరు ప్రసిద్ధమైనది. ఇతడికి అపకారం చేసేవాడు మిగలడు.
అడుగో! ఆ పక్కనే ఉన్న అతడు దేవేంద్రుని కొడుకైన ‘అర్జునుడు’. ధనంజయుడు అనే పేరుగలవాడు నా భర్త. కోపతాపాలు అదుపు తప్పిన మనసును కలిగినప్పటికినీ ధర్మమార్గాన్ని ధ్వంసం చేసేటట్లు ప్రవర్తింపడు. ధనుర్థరులలో అగ్రగణ్యుడు. దేదీప్యమానమైన తేజస్సు కలవాడు. ధైర్యశాలి. జితేంద్రియుడు. శత్రువులను ఎదిరిస్తాడు. చండమార్తాండుడివలె వెలుగొందేవాడు.
అడుగో! అతడు నా భర్త ‘నకులుడు’. కుంతీదేవి ప్రేమకు పాత్రుడు. తన అన్నలను సేవించేవాడు. అన్నిటికంటే మిన్న భూమిపై ఉత్తమరూపం కలవానిగా పేరెన్నికగలవాడు. ఖడ్గ విద్యలో ఆరితేరినవాడు. చిత్రమైన హస్తవిన్యాసాలను చూపేవాడు. మిక్కిలి బుద్ధిమంతుడు. వీరుడు.
అక్కడ ఆపైనున్నవాడు నా భర్త ‘సహదేవుడు’. పాండవులలో అందరికన్నా చిన్నవాడు. కుంతీదేవికి తన కొడుకులందరిపైకంటె ఈ సహదేవుని మీదనే వాత్సల్యం మెండు. ఈ మహాత్ముడు సంతత సత్యసధుడు. భూమి కంపింపవచ్చును. అగ్ని చల్లబడవచ్చును. కానీ సహదేవుడు మాత్రం ధర్మనిష్ఠ వదలిపెట్టడు. బొంకడు. అద్వితీయ వీరుడు.
నీచుడా! దైత్యసేనలో ఇంద్రునివలె యుద్ధంలో అతడు పరాక్రమించడం నీవు నేడు చూద్దువుగాక!
పంచపాండవులు జయింపనలవిగానివారు. వీరి బారినుండి ఎవరూ తప్పించుకొనలేరు. ఇక నీవు సయితం ప్రాణాన్ని కోల్పోవడంగానీ, లేదా గౌరవాన్ని కోల్పోవడంగానీ తథ్యం! అని సైంథవుని ద్రౌపది హెచచరించింది.
అంతలోనే పాండవులు జయద్రథుడి సేనను చుట్టుముట్టారు. ఆకాశాన్ని క్రమ్మేటట్లుగా అమ్ములను ప్రయోగించారు.
అప్పుడు జయద్రథుడు తన సైనికులను ‘ప్రక్కకు కదలకండి. చుట్టుముట్టండి. ధైర్యంతో నిలబడండి. వేగంగా గ్రుచ్చండి’ అని ప్రోత్సహించాడు. ధర్మరాజ భీమార్జున నకుల సహదేవుల ధాటికి సైంధవుని సైన్యంలోనూ, శిబి, సౌవీర, సింధురాజుల మనసులలో కూడా విషాదం, భయం అలముకొన్నది.
శైబ్యమనే ఇనుముతో చేయబడిన గదను తీసుకొని భీమసేనుడు జయద్రథుడి వైపునకు వెళ్ళగా, కోటికాస్యుడు గొప్ప రథ సైన్యంతో ఎదుర్కొన్నాడు. భీమసేనుడు కోటికాస్యుని యొక్క గుఱ్ఱాలను చంపి, సారథిని ఒక్క క్షురం తలనరికి చంపాడు. సూతుడు లేని కోటికాస్యుని సమీపించి అతడిని ప్రాసమనే ఆయుధంతో చంపివేశాడు.
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము