డైలీ సీరియల్

ఎప్పుడె ప్పుడు?-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భార్యల విషయంలో కూడా ఇలానే జరుగుతుంది కారణాలు వేరైనా... కొత్తలో భర్త లేట్‌గా వచ్చినా మొహమాటమో.. కారణం ఏదైనా పట్టించుకోరు.. పోనుపోను ఇద్దరిమధ్య అపార్థాలు అపోహలు ఇగోలు అన్నీ కలిసి గొడవలకు దారితీస్తాయి. అలాంటి గొడవలు ఎలా వుంటాయో మనం చూద్దాం.. ఈరోజునుంచి మనం పెళ్ళై సంవత్సరం నిండిన దంపతులం.. మాగ్జిమమ్ గొడవ పడుదాం... ఒక్క సంవత్సరంలోనే గొడవలన్నీ పూర్తవ్వాలి... మిగిలిన జీవితమంతా పెళ్ళైన సంవత్సర కాలంలా హ్యాపీగా ఉందాం... ఒక్క మాటలో చెప్పాలంటే... వర్తమానాన్ని భవిష్యత్తుగా మార్చుకుందాం... భవిష్యత్తును వర్తమానంగా అనుభవిద్దాం.. అప్పుడు ఈ వర్తమానం మన భవిష్యత్తును హ్యాపీగా ఉంచుతుంది.. ఎందుకంటే.. మీతో జీవితకాలం హ్యాపీగా ఉండాలి.. అంతకన్నా నేను బ్రతికివున్న ప్రతీక్షణం మిమ్మల్ని సంతోషపెట్టాలి’’ నిహార్‌ను గట్టిగా హత్తుకుని చెప్పింది నిశ్చల.. సరికొత్త జీవితం ఆ రాత్రి మొదలైంది.
వర్తమానాన్ని భవిష్యత్తుకు బదిలీచేసి భవిష్యత్తును వర్తమానంలోకి ఆహ్వానించి సరికొత్త వైవాహిక జీవితాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఎప్పుడెప్పుడు అంటూ భవిష్యత్తులోకి బదిలీఅయినా వర్తమానం ఎదురుచూస్తోంది.
8
పొద్దునే్న అయిదుగంటలకే అలారం పెట్టుకుంది అలవాటుగా నిశ్చల. అలారం మోగడంతో లేచి భర్తవైపు చూసింది. హాయిగా ఆదమరచి నిద్రపోతున్నాడు. అతని మీదికి వంగి అతని నుదురుమీద ముద్దుపెట్టుకుంది. పక్కమీదనుంచి లేవబోతూ ఆగింది. రాత్రి తాలుకూ ఒప్పందం గుర్తొచ్చింది. ‘‘ఇప్పుడు తాము భవిష్యత్తును వర్తమానంగా మార్చుకున్నాం’’ అన్న విషయం గుర్తుకు తెచ్చుకుంది. సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో పావని చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి. పావని ఏం చేసిందో కిరణ్ నిహార్‌తో చెప్పిన విషయాలు గుర్తుచేసుకుంది.
‘‘అంటే తానిప్పుడు లేవకూడదు. కిరణ్ చెప్పిన థియరీ ప్రకారం అలాగే ముసుగుతన్ని పడుకోవాలి.’’ వెంటనే అలానే పడుకుంది. కానీ బాధగా వుంది. తాను త్వరగా లేచి నిహార్‌కోసం బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తేనే ఆనందం.. ఇలా బారెడు పొద్దెక్కేవరకూ ఉండడం ఇష్టం ఉండదు. అయినా తప్పదు. ఈ ప్రయోగం అనివార్యం... బలవంతంగా కళ్ళు మూసుకుంది.
* * *
బలవంతంగా కళ్ళు తెరిచాడు నిహార్. అలవాటుగా అతని కళ్ళు వెతుకుతున్నాయి. అతని చెవులు తనకిష్టమైన శబ్దం వినాలని తహతహలాడుతున్నాయి. తనకు అత్యంత ఇష్టమైన మెట్టెలసవ్వడి. తనకు సుప్రభాతంలా వినిపించే పట్టీల నేపథ్యసంగీతం. ఏదీ కనిపించదు..? ఏదీ వినిపించదు? ఈపాటికి గదిలోకి అడుగుపెట్టవలసిన తన ప్రియనెచ్చెలి ఎక్కడ?
తప్పనిసరిగా కళ్ళు తెరిచాడు.. ఎదురుగా కనిపించలేదు. కాస్త తలా బయటకు పెట్టి కిచెన్‌వైపు చూసాడు. ఊహూ.. లేదు.
ఆత్రుత స్థానంలో కొద్దిగా భయం.. క్రమక్రమంగా పెద్దదవ్వసాగింది.
ఒక్క ఉదుటున లేచి ‘‘నిశ్చలా..’’అని గట్టిగా పిలిచాడు. అతని వెనుకే పడుకుని ఇదంతా గమనిస్తోన్న నిశ్చలకు బాధేసింది. అతడిని వెనుకనుంచి అలాగే పట్టుకుని ‘సారీ ఇక్కడే వున్నాను’ అని చెప్పాలని అనిపించింది. కానీ చెప్పలేకపోయింది.
మరోసారి నిశ్చలా అని పిలువబోతూ ఆగిపోయాడు. తన వెనుకే పడుకుని వున్నా నిశ్చలను చూసి.. ఒక్క క్షణం రిలీఫ్‌గా ఫీలయ్యాడు. వెంటనే నిశ్చల నుదురుమీద చేయివేసి’’ ‘‘నిశ్చలా... ఆర్యూ ఆల్ రైట్?’’ అని కంగారుగా అడిగాడు.
ఆ మాటతో ఆమె కళ్ళు తడివాకిళ్ళు అయ్యాయి. కళ్ళు తెరిచి నిహార్ వంక చూసి కోపం రావడం లేదా?’’ అని అడిగింది.
‘‘ఇప్పటివరకూ లేవలేదు. మీరు పిలుస్తూ వున్నా పలుకలేదు... మామూలుగా అయితే ‘పిలిస్తే బెల్లం కొట్టినరాయిలా పలుకవేమి..? అని మీరు అరవాలి...’’ అంది నిశ్చల.
‘‘అలా ఎందుకు నీ హెల్త్ బాగోలేదని అనుకోవచ్చుగా... కాసేపు నిద్రపోవాలని ఉందని అనుకోవచ్చుగా...’’ నిహార్ అన్నాడు.
‘‘మీరు ఆఫీసుకు వెళ్ళడానికి టిఫిన్ రెడీ చేయలేదు. లంచ్ ప్రిపేర్ చేయలేదు కదా? కోపం రావడం లేదా?’’
‘‘ఈ ఒక్కరోజుకు హోటల్‌లో తింటేసరి...’’ అన్నాడు నిహార్.
‘‘రోజూ ఎందుకు చేస్తావు? పోనీ నేనే ప్రిపేర్ చేస్తాను.. ఎప్పుడో ఒకప్పుడు నువ్వే అర్ధంచేసుకుంటావు? నువ్వు ఈవేల్టికి రెస్ట్ తీసుకో.. నేను అయ్యర్ హోటల్‌నుంచి టిఫిన్‌తెస్తాను’’ నిశ్చలా తలను తన గుండెలకు అదుముకుని అన్నాడు.
అలా కుదరదు.. మనం ఈ విషయంలో గొడవపడాలి. గొడవ పడ్డప్పుడే ఎవరిని ఎవరు ఎంతవరకు అర్ధం చేసుకున్నారో.. ఎవరిదీ ఎంతవరకు కరెక్టో తెలుస్తుంది’’ అంది నిశ్చల.
అదికాదు నిశ్చలా? ఏదో చెప్పబోయాడు నిహార్.
‘‘ప్లీజ్ మన యాక్టింగ్ కంటిన్యూ అవ్వాలి..’’ అంది నిశ్చల.
ఒక్క క్షణం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నిహార్‌కు.. యాక్టింగే ఇంత కష్టమైతే మొగుళ్ళు పెళ్లాలను ఎలా తిట్టగలుగుతున్నారు? పాపం ఆ భార్యలు ఎలా భరిస్తున్నారు? అయినా తమ భవిష్యత్తు కోసం తమకు తాము ఏర్పాటుచేసుకున్న ఒప్పందం.. మంచో చెడో.. తాడో పేడో తేల్చుకోవాలి అనుకున్నాడు. అలా అనుకున్నాక కొద్దిగా తన పాత్రలో లీనమయ్యాడు.
గొంతు సవరించుకున్నాడు. కోపాన్ని గొంతులోకి ఒంపుకున్నాడు. అయినా గళం సహకరించడం లేదు. మాట వౌనమే నా భాష అన్నట్టు వుంది. గొంతు పెగుల్చుకున్నాడు.
‘‘నేను ఆఫీస్‌కు వెళ్లాలా? వద్దా? కనీసం మొగుడికి టిఫిన్ చేసిపెడదామన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఎలా? లేని కోపాన్ని, రాని ఆవేశాన్ని అరువు తెచ్చుకుని అరిచినట్టు మాట్లాడాడు. అలా మాట్లాడాక నిశ్చల మొహంలోకి చూడలేకపోయాడు.
బహుశా చూసి వుంటే ఈ నాటకానికి వెంటనే ఫుల్‌స్టాప్ పడి వుండేది.
ఒప్పందంలో భాగంగానే అతి కష్టంమీద బలంతంగా నిహార్ పరుషంగా మాట్లాడినా, అది కేవలం నటనే అని తెలిసినా తట్టుకోలేకపోయింది. ఆమె కళ్ళు కన్నీళ్ళతో స్నానం చేసాయి.
వెంటనే తానూ నటించడం మొదలుపెట్టి ‘‘ఏ.. మీరే లేచి చేయొచ్చుగా.. పెళ్లాం అంటే మీకు బానిస కాదు.. ఆఫీసుకు వెళ్లి మీరు ఒరగబెట్టేది ఏమిటో..? హాయిగా కబుర్లు చెప్పుకోవడం తప్ప’’ ఒక్కో అక్షరాన్ని కూడదీసుకుని అంది. అన్నాక నిహార్‌వైపు చూసే ధైర్యం చేయలేదు. చూసివుంటే వెంటనే అతడి గుండెలమీద పడి ఏడ్చేది.
వెంటనే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నిహార్‌కు.. ఒక విధమైన షాక్‌లో వున్నాడు. నిశ్చల గొంతులోనుంచి అలాంటి మాటలను అతను ఊహించలేదు.
***
ఇద్దరిమధ్య వౌనం
ఇద్దరిమధ్య నిశ్శబ్దం
ఇద్దరిమధ్య మాటలకు అందని భావం..
ఒక్కక్షణం ఈ ఆటకు గుడ్‌బై చెప్పేద్దామా అనిపించింది.. కానీ ఈ యుద్ధంలో ఏదో ఈ నీతి ఉన్నట్టు అనిపించింది.
స్ర్తి వ్యామోహం రామరావణ యుద్ధాన్ని, రావణుడి పతనానికి మూలమైనట్టు...
-సశేషం

-తేజారాణి తిరునగరి