డైలీ సీరియల్

యమహాపురి -67

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపం- నేనతణ్ణి అనవసరంగా అనుమానించాను సార్! బిచ్చగాడి చావుకి కారణం రాజా కాదు. ‘‘నరకపురిలో ఏదో జరుగుతోంది’’ అనగానే శ్రీకర్‌కి అక్కడ సుందరం బదులు వసంత కనిపించి ఉలిక్కిపడ్డాడు. తర్వాత తమాయించుకుని, ‘‘ఊళ్ళో మనకి తెలిసినవారు లేరు. వోల్వో బస్సు మన్ని తీసుకెళ్లదు. అక్కడికి వెళ్లడానికి డిపార్టుమెంట్ అనుమతి లేదు, రాదు. ఇంకేమైనా ఉపాయాలున్నాయేమో వెదకాలి’’ అన్నాడు.
‘‘ఏమిటో సార్! ఆంక్షలన్నీ పోలీసులకే! ఆ రాజాని చూడండి. మననించి తప్పించుకోవాలనుకున్నాడు. నరకపురి వెళ్లాడు. ఆ ఊరివాడు కాదు, పేరు ప్రతిష్ఠలున్నవాడు కాదు. డబ్బున్నవాడు కాదు. ఐనా వెళ్ళాడు. మనమేమో వెళ్లలేకపోతున్నాం’’’ నిట్టూర్చాడు సుందరం.
‘‘రాజా నరకపురి వెళ్లాడు- సరే! అక్కడేం చేస్తున్నాడంటావ్? ఎలా బ్రతికి బట్ట కడుతున్నాడంటావ్?’’ సాలోచనగా అన్నాడు శ్రీకర్.
‘‘అది తెలియాలన్నా మనం నరకపురి వెళ్లాలి’’ తనూ సాలోచనగా అన్నాడు సుందరం.
‘‘అప్పట్లో ఈశ్వర్ చెప్పాడు. తర్వాత నేనూ హైలెవల్లో కనుక్కున్నాను. నరకపురి వెళ్లడం పోలీసులకి శ్రేయస్కరం కాదని తేలింది. ఐనా ఇందాకా నున్వనట్లు- అక్కణ్ణించి ఏ ఫిర్యాదూ లేనప్పుడు మనకెందుకా ఊరిగోల?’’ అన్నాడు శ్రీకర్.
‘‘మరి శివగిరి బిచ్చగాడి హత్య కేసు?’’
‘‘ఆ కేసు పరిష్కరించమని మాత్రం పైనుంచి మనమీదైనా ఒత్తిడి ఉందా, చెప్పు! హత్య ఎవరిది- ఆఫ్టరాల్ ఓ బిచ్చగాడిది..’’ అన్నాడు శ్రీకర్.
సుందరం ఆశ్చర్యంగా, ‘‘ఏమిటి సార్! మీరేదో కొత్తగా మాట్లాడుతున్నారు. నరకపురి జోలికి వెళ్లొద్దని ఏమైనా హెచ్చరిక అందిందా?’’ అన్నాడు.
శ్రీకర్ ముఖం గంభీరంగా ఐపోయింది, ‘‘నన్ను బెదిరించేవారా? నేనెవర్ని? ఇన్స్‌పెక్టర్ భయంకర్!’’ అన్నాడు.
సుందరం మాట్లాడలేదు. శ్రీకర్ తనే మళ్లీ, ‘‘తమ సమస్యలతో ఎంతోమంది మన వెంటబడుతుంటే, వాళ్ల గురించి పట్టించుకోక మధ్య మనకీ నరకపురి లంపటం ఎందుకు చెప్పు?’’ అన్నాడు.
‘‘ఐతే మనం నరకపురి విషయం ప్రస్తుతానికి వదిలేసినట్లేనా సార్!’’ అన్నాడు సందరం నీరసంగా.
‘‘వదిలేయడమంటే మనం దాని వెంటపడం. అదే మన వెంటపడేలా చేద్దాం’’ నవ్వాడు శ్రీకర్.
‘‘నరకపురి మన వెంటపడుతుందా, ఎలా?’’ బుర్ర గోక్కున్నాడు సుందరం.
‘‘ఎలాగంటే- మనం రాజా వెంట పడ్డామా? అతడు పారిపోయి నరకపురి చేరాడు. చేరాక ఎన్నాళ్లుంటాడు? ప్రస్తుతం యమ విదేశయాత్రలో ఉన్నాడు కాబట్టి- రాణి సాయంతో కొన్నాళ్లు మానేజ్ చేస్తాడు. కానీ ఎప్పటికైనా వెనక్కి రావాల్సిందే కదా! వస్తే- అటు మేనత్త, ఇటు హత్య! మనవైపు రావాల్సిందేగా మరి! వచ్చినపుడు తీగలాగి డొంకంతా కదుపుతాను. నేనంటే ఏమిటో నరకపురి తెలుసుకునేలా చేస్తాను’’ అన్నాడు శ్రీకర్ ఆవేశంగా.
‘‘ఇది ఆవేశంలా లేదు పాలపొంగులా ఉంది. ఏదేమైనా ఆపరేషన్ నరకపురి ప్రస్తుతానికి వాయిదా పడ్డట్లే’’ అనుకున్నాడు సుందరం.
కానీ నరకపురే శ్రీకర్ వెంట పడనున్నదని, అప్పుడు సుందరానికే కాదు- శ్రీకర్‌కి కూడా తెలియదు.
13
మాత ఇచ్చిన సలహా పాటించి రాజా రెండు రోజులపాటు నరకపురి ఊరంతా తిరిగాడు. ఇంటింటికీ వెళ్లి ఒక్కొక్కరినే కలుసుకున్నాడు.
ఊళ్ళో ఎక్కువమంది యమ నిజంగానే దేవుడు. మిగతావాళ్లకి యమ అంటే భయం.
యమ సామాన్యుడు కాదు. ఎదుటివాళ్లని వశపర్చుకునే మంత్ర శక్తి ఏదో ఆయనలో ఉన్నది. అలాంటి శక్తిని మంచికి ఉపయోగించినవారు మహానుభావులౌతారు. చెడుకి ఉపయోగించినవారు పరమ దుష్టులౌతారు. యమ రెండో తరహాకే చెందుతాడు.
చిత్రమేమిటంటే- యమ ఊళ్లో ఎవరికీ తన అసలు రూపంలో కనిపించడు. ఎప్పుడూ యమధర్మరాజు మాస్కులో ఉంటాడు. ఆయన ఆహ్వానంమీద బయటివారెవరైనా ఊళ్లోకొచ్చినా వారికీ మాస్కుతోనే దర్శనమిస్తాడు. ఏటా రెండు నెల్లు ఆయన విదేశయాత్రలకి వెడతాడు. ఆధునిక ప్రపంచంలో వస్తున్న పరిణామాల్ని స్వయంగా ఆకళింపు చేసుకొస్తానని గుట్టు చప్పుడు కాకుండా ఊరొదిలి వెడతాడు.
ఏ పేరుతో ఏ రూపంతో ఏ దేశం వెడతాడో తెలియదు. తిరిగొచ్చాక రెట్టింపు ఉత్సాహంతో తన సామ్రాజ్యాన్ని ఏలుకుంటాడు.
యమ విదేశయాత్రకి వెళ్ళేముందు ఊళ్లో అమలు జరపాల్సిన శిక్షలు విధించి వెడతాడు. ఆయన తిరిగి వచ్చేదాకా ఊళ్ళో పాత శిక్షలు అమలు చెయ్యబడతాయి తప్ప కొత్త శిక్షలుండవు. కానీ ఆ ఊరి జనంలో చాలామంది ఆయన లేనందుకు నీరసపడిపోతారు. ఆయన ఎప్పుడొస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు. ఆయన రాగానే తామనుభవించిన, అనుభవిస్తున్న శిక్షలు తమకెంతో సంతోషాన్నిస్తున్నాయో విన్నవించుకుంటారు. అదీ ఆ ఊరిమీద ఆయనకున్న పట్టు. అదీ ఆయన వశీకరణ విద్య బలం.
మొదటిరోజు పర్యటనలోనే ఇదంతా తెలిసినా, రెండో రోజుకల్లా రాజాకిదంతా రూఢి అయింది.
నిస్సందేహంగా నరకపురి వాసులు కష్టాలుపడుతున్నారు. కానీ వారిలో అధిక సంఖ్యాకులు చాలా సంతోషంగా ఉన్నారు. మరి సంతోషంగా లేనివారి మాటేమిటి?
మెజారిటీ నిర్ణయాలు మిగతావారికి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా శిరోధార్యమైతే- అదే ప్రజాస్వామ్యం. మెజారిటీ అమాయకులు, నిరక్షరాస్యులైనా వారి నిర్ణయం అందరికీ శిరోధార్యమైతే అది భారత ప్రజాస్వామ్యం.
‘‘ఇలా ఎలా జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది?’’ అని రాజా ఓ రాత్రంతా ఆలోచించాడు.
లక్షల కోట్లు కాజేసినవారిని జైలుకి పంపితే అది కక్ష సాధింపు చర్య అంటున్నారు. ఆడపిల్లని బలాత్కరించి ఉరితీసి చెట్టుకి వ్రేలాడదీస్తే- మీ ఇంట్లోవాళ్లు బాగానే ఉన్నారు కదా- అంటున్నారు.
‘‘నేను అనవసరంగా నరకపురిని భూతద్దంలో చూస్తున్నానేమో’’ అని కూడా రాజాకి అనిపించింది.

ఇంకా ఉంది

వసుంధర