డైలీ సీరియల్

యాజ్ఞసేని-96

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహదేవుడు అన్నాడు- ‘‘నేను విరాటుని కొలువులో గోవులను అదుపులో పెట్టుట, పాలు పిదుకుట, పరీక్షించుట అను పనులలో నేర్పు గలవాడినని తెలిపి చేరెదను. నేర్పుగల గోపాలకుడనగదును. ‘తంతిపాలు డు’ అను (తంత్రీపాలుడు) పేరుతో కొలువులో ప్రవేశింతును. పూర్వం ఎచటనుండివని అడిగినచో ధర్మరాజు వద్దనుంటినని చెప్పదును’’ అని.
అంత ధర్మరాజు ద్రౌపదిని చూసి ‘‘ఈమె మనకు ప్రియమైన భార్య. ప్రాణములకన్నా మిక్కిలి మిన్నయైనది. తల్లివలె పాలింపదగినది. అక్కవలె మన్నింపదగినది.
ఈ ద్రుపదుని బిడ్డ ‘కృష్ణ’ అచట ఏ వృత్తిలో తిరుగును? సాధారణ స్ర్తివలె కాదు. మృదువైనది. ఎల్లప్పుడూ వనె్నతరుగనిది. రాచబిడ్డ, కీర్తికెక్కినది. పతివ్రత, పుణ్యాత్మురాలు అయిన ఈమె ఎట్లు సంచరించును’’ అని అన్నాడు.
పైవిధంగా ధర్మరాజు పలుకుగా ద్రౌపది అన్నది-
‘‘లోకమున ‘సైరంధ్రులు’ పాలిందగినవారై దాసీవృత్తిలో ఉందురు. ఇతర స్ర్తిలు అట్లుగాదు. ఇది లోకమున ప్రసిద్ధమే. కావున నేను ‘సైరంధ్రి’నని చెప్పుదును. నేను పూర్వం ధర్మరాజు గృహమును ‘ద్రౌపదీదేవికి’ పరిచారికనై యుంటినని రాజడిగినచో చెప్పుదును. నన్ను నేను రక్షించుకొందును. ఆ విరాట రాజు భార్య పేరెన్నికగన్నది. అట్టి సుధేష్ణాదేవిని ఆశ్రయించి ఉందును. నన్నామె రక్షించును’’ అని.
తదనంతరం ధర్మరాజు విరాటరాజు కొలువులో రహస్యముగా వీలును బట్టి కలియుటకు రహస్య నామములను ఏర్పరచినాడు. వరుసగా జయుడు (్ధర్మరాజు), జయంతుడు (్భమసేనుడు), విజయుడు (అర్జునుడు), జయత్సేనుడు (నకులుడు), జయద్భలుడు (సహదేవుడు) అని.
పిమ్మట వారు ఏర్పరచుకొన్న విధముగా విరాట నగరమున పదమూడవ యేట అజ్ఞాతవాసం గడుపుటకు బయలుదేరి, దశార్ణదేశానికి ఉత్తరాన, పాంచాల దేశానికి దక్షిణాన, శూర శాల్వ దేశాలలో ప్రవహించే యమునానది ఒడ్డు వెంబడి పశ్చిమంగా పయనించి అడవి మార్గాన్ని వదలి మత్స్యదేశంలో ప్రవేశించారు. అలసట చెందిన ద్రౌపదిని అర్జునుడు మోసుకొని నగర ప్రాంతానికి తెచ్చాడు. అందరూ నిర్ణయించుకొనిన విధంగానే విరాటరాజు కొలువులో ప్రవేశించి సుఖంగా ఉన్నారు.
సైరంధ్రి అయిన ద్రౌపది
ద్రౌపది సైరంధ్రి వేషంలో పురప్రవేశం చేసింది.
కాటుక కనులుగల ఆ ద్రౌపది చిక్కుపడిన చక్కని, నల్లని, సన్నని, మెత్తని పొడువైన జుట్టును పైకి లాగి ముడివెట్టుకొన్నది. కుడివైపునకు కొద్దిగా ఒరిగేటట్లు అందంగా కొప్పును అమర్చుకొన్నది.
ముదుకైన నార వస్త్రంతో స్తనమండలాన్ని కప్పుకొన్నది.
సైరంధ్రి వేషంలో మేఘం క్రమ్మటంచేత నిండు కాంతి తరగిన చంద్రకళవలె కన్పట్టుచున్నది. మంచుచే కప్పబడి వికాసం లేక అందం తరగిన పద్మంవలె అగుపించుచున్నది. దట్టంగా పొగ క్రమ్ముకొనగా కాంతి తళకులు తగ్గిన దీపశిఖవలె వున్నది. శరీరం నిండా దుమ్ము అలముకొనటంవలన నిగనిగలు తగ్గి లావణ్యం కొరవడిన తీగవలె వున్నది. అలా ఉన్న ద్రౌపది అసలు రూపంలోని ఉజ్వలత్వం మరుగున పడిపోయింది.
అటువంటి వేషంలో కదలి వెళుతున్న ద్రౌపదిని పురజనులు చూచారు. ఈమె రోహిణిగానీ, అరుంధతిగానీ అయి వుండాలి. అంతేగానీ మానవకాంత మాత్రం కాదు. ఈమె శరీర కాంతి చూస్తే సందేహం కలుగుచున్నది అని అనుకొన్నారు. పురుషులు, స్ర్తిలు ఆమె వెంబడి పడ్డారు. ‘‘నీవెవరవు? ఏమి చేయగోరితివి’’ అని అడిగారు. అప్పుడు ఆమె వారితో అన్నది ‘‘నేను సైరంధ్రిని. నాకు పని యిచ్చుతలంపు వున్నవారికి పని చేయుదును’’ అని.
అయినా పురజనులు నమ్మలేదు. ప్రజలు ఆమెను చుట్టుముట్టి నడుస్తున్నారు. మెల్లగా రాజమందిరం వద్దకు చేరింది. అప్పుడు విరాట రాజు పట్టమహిషి, కేకయపుత్రి అయిన ‘సుదేష్ణ’ విహారం కొరకు తన చెలికత్తెలతో కలిసి మేడ పైభాగంలో విహరిస్తున్నది. అక్కడ కిటికీలగుండా సుదేష్ణు ద్రౌపదిని చూచింది. చెలికత్తెలను చూచి-
‘‘ఈమె ఎక్కడినుండి ఎక్కడికి వెళుతున్నదో? ఒంటరి ఆడది. ఈమెలో అందం, హుందాతనం కనిపిస్తూ ఉన్నాయి. అయినా సేవకురాలివలె వినయంతో వంగి నడుస్తున్నది. ప్రజలు కూడా ఎంతో వింతగా చూస్తున్నారు. తొందరగా వెళ్లి ఆమెను వెంటబెట్టుకొని రండి’’ అని అన్నది.
ఇద్దరు చెలికత్తెలు వెంటనే బయలుదేరి ద్రౌపదిని చేరారు. వెళ్లి ఆమెతో ‘‘విరాట మహారాజు పట్టమహిషి సుదేష్ణాదేవి దయతో నిన్ను తన వద్దకు తీసుకొని రమ్మని మమ్ముల పంపింది’’ అని అన్నారు.
ద్రౌపది మేల ముసుగును సవరించుకొని వినయంగా వారితో కలిసి వారి వెంట అంతఃపురంలోనికి వెళ్లింది. సుదేష్ణ ద్రౌపదిని చూచింది. చేతులు ముందుకు చాచి ఆప్యాయంగా దగ్గరకు రమ్మని పిలిచింది. ద్రౌపది మెల్లగా ఆమె చెంతకు చేరింది. అప్పుడు రాణి తగిన రీతిలో ద్రౌపదితో-
..........................ఇంకావుంది

త్రోవగుంట వేంకట సుబ్రహ్మణ్యము