డైలీ సీరియల్

పంచతంత్రం -- 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంటనే నవ్వుతూ అన్నదా అమ్మాయి.
‘‘నన్ను గుర్తుపట్టారన్నమాట...!... నేను వచ్చింది మిమ్మల్ని తిట్టటానికి కాదు....! టెంపుల్లో జరిగిన దానికి అయామ్ సో సారీ....!’’
ఆ మాటతో కార్తీక్‌తోపాటు, పున్నాగ చెట్టు చాటున ఉన్న గోపిక కూడా ఉలిక్కిపడింది. అయోమయంగా ఆ అమ్మాయి వైపు చూసాడు కార్తీక్.
ఆ అమ్మాయి అన్నది.
‘‘్ఫ్లష్‌బ్యాక్‌లోకి వెడితే నీకు అసలు విషయం అర్ధం అవుతుంది. నేను... నిన్ను ఫస్ట్‌టైం చూసింది గుళ్లో కాదు....’’
‘‘మరెక్కడ?’’
‘‘ఒక షోరూమ్‌లోని ట్రయిల్ రూమ్ లోపల...’’
ఈ సమాధానం విని శ్రోతలు ఇద్దరూ ఉలిక్కిపడ్డారు.
ఆ అమ్మాయి చెప్పటం కొనసాగించింది.
‘‘నాలుగు రోజుల క్రితం బందర్ రోడ్డులో ఉన్న ఫ్యాషన్ ప్లాజాలో.... షాప్ క్లోజ్ చేసే టైములో నువ్వు వచ్చావ్. ఐదు టీషర్ట్స్, నాలుగు జీన్స్ కొన్నావ్. ట్రయల్ రూమ్‌లో నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటుండగా ట్రయిల్ రూమ్ డోర్ ఓపెన్ అయింది.’’
ఆ అమ్మాయి చెప్పటం ఆపింది.
ఆ రోజు జరిగిన విషయం కార్తీక్‌కి గుర్తుకు వచ్చింది. ట్రయల్ రూమ్‌లో తాను తొడుక్కున్న ప్యాంటు, షర్ట్ విప్పతీసి, తను కొనదల్చుకున్న ప్యాంటు, టీషర్ట్ తొడుక్కో బోతుండగా, అకస్మాత్తుగా ట్రయల్ రూమ్ డోర్ ఓపెన్ అయింది. అప్పుడు తను కేవలం అండర్‌వేర్ మీద ఉన్నాడు. బోల్ట్‌లూజ్‌గా ఉండటంతో తెరుచుకున్న డోర్‌ను తాను ఛటుక్కున వేసేశాడు. ఆ కాస్త సమయంలోనే ఆ అమ్మాయి తనను చూసేసిందా...?
కార్తీక్ ముఖంలో మారుతున్న భావాలను గమనిస్తూ, చిలిపిగా నవ్వుతూ అన్నది ఆ అమ్మాయి.
‘‘అలా నిన్ను చూసిన వెంటనే నీ మీద నాకు ఎట్రాక్షన్ కలిగింది. ఆ తర్వాత మా వీధిలో ఒక చేత్తో బైక్ నడుపుతూ, మరో చేత్తో సెల్‌ఫోన్లో మాట్లాడుతూ, కట్స్‌కొడుతూ, రయ్యిన దూసుకుపోతున్న నిన్ను చూసాను. ఆ యాంగిల్లో నిన్ను చూసాక నాది ఎట్రాక్షన్ కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అర్ధంచేసుకున్నాను. నువ్వు మా ఏరియాలోని ఉంటున్నట్లు గ్రహించాను.’’
కార్తీక్ చెప్పాడు.
‘‘నాది విజయవాడ కాదు... హైదరాబాద్... ఓ ఫ్రెండ్ మ్యారేజ్‌కి వారం క్రితం విజయవాడ వచ్చాను. ఆ ఫ్రెండ్ ఇంట్లోనే దిగాను. తిరగటానికి ఫ్రెండ్ బండి వాడుతున్నాను.’’
‘‘ఫ్రెండ్ మ్యారేజా?... ఆడ ఫ్రెండా?... మగ ఫ్రెండా?’’
‘‘మగ ఫ్రెండే!... విజయవాడలో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు.’’
‘‘ఓకే...! నీది మా ఏరియానే అని అర్ధం చేసుకున్నాను. కానీ నీ అడ్రస్ మాత్రం తెలుసుకోలేకపోయాను. ఆ తర్వాత అదృష్టవశాత్తూ... అనుకోకుండా టెంపుల్‌లో నిన్ను చూసాను. అంతా ఆ వేణుగోపాలస్వామి దయ అనుకున్నాను. టెంపుల్‌లో నన్ను కామెంట్ చేసింది నీ ఫ్రెండ్ అని నాకు తెలుసు. కానీ నువ్వే కామెంట్ చేసావు అంటూ, నీతో చిలిపిగా గిల్లికజ్జా పెట్టుకుని, నీతో స్నేహం పెంచుకుని.... ఆ స్నేహాన్ని లవ్వులోకి దించాలి. అనుకున్నా.’’
చెట్టు వెనకున్న గోపిక, అమ్మాయి ముందున్న కార్తీక్ ఇద్దరూ నిర్ఘాంతపోయారు.
‘‘మరి...!?’’ అనుమానంగా అడగబోతున్న కార్తీక్‌కి అడ్డుతగులుతూ అన్నదా అమ్మాయి.
‘‘నేను అప్పుడు సీరియస్ ఎందుకు అయ్యానా?... అనేకదా నీ డౌట్?’’ మెల్లిగా నవ్వి అన్నదా అమ్మాయి.
‘‘సరిగ్గా అదే సమయానికి అనుకోకుండా మా అమ్మ మనవైపు వచ్చింది. అందుకే కొంచెం సీరియస్‌గా నటించా.’’
‘‘నటించావా?.... అదంతా నటనే...?!’’
‘‘అవును.!’’
‘‘మరి మీ అమ్మ? ... నీతోపాటు ఆవిడ రంగంలోకి దిగలేదు ఎందుకు?’’
‘‘తను అప్పుడు.. వౌనవ్రతంలో ఉంది.’’
‘‘బతికిపోయాను....!’’ అన్నాడు కార్తీక్.
ఆ అమ్మాయి నవ్వింది.
‘‘నా అసలు పేరు కామేశ్వరి, ఈ పేరు నాకు నచ్చలేదు. ఈ పేరు తీసేసి తమన్నా, కాజల్, ఐశ్వర్య వీటిల్లో ఏదో ఒక పేరు పెట్టుకుంటా... మరి నీ పేరు?’’
‘‘తర్వాత చెప్తా... చూడూ...! నాకు ఈ లవ్ ఎట్ ఫస్ట్‌సైట్ మీద నమ్మకం లేదు...!’’
‘‘నాకు నమ్మకం ఉంది...! అంతే కాదు, కుడి తొడ మీద వేప కాయంత పుట్టుమచ్చ ఉన్నవాళ్ళు భార్యల్ని ప్రేమగా చూసుకుంటారని పుట్టుమచ్చల శాస్త్రంలో చదివాను. నీకు అక్కడ పుట్టుమచ్చ ఉంది. నిన్ను ఇష్టపడడానికి ఇది కూడా ఒక కారణం.’’
‘‘మరి ఎడమ తొడ మీద నిమ్మకాయంత పుట్టుమచ్చ ఉంటే?’’
‘‘దీనికి ఆపోజిట్ ఫలితం వస్తుంది.’’
‘‘కదా?... నాకు ఎడం పక్క కూడా నిమ్మకాయంత ఉంది. నేను నీకు పనికిరాను. ఇంకోళ్ళని చూసుకో. మనం ప్రేమించే వాళ్ళని కాదు, మనలని ప్రేమించేవాళ్ళతో మనం సెటిల్ అవ్వాలి.’’
స్థిరంగా చెప్పాడు కార్తీక్.
ఆ అమ్మాయి ఏదో ఆలోచించింది. కార్తీక్‌కి దగ్గరగా జరిగింది. ముఖంపైకి లేపి అన్నది.
‘‘నువ్వు చెప్పిన విషయం ఆలోచిస్తా!... ఈలోపు... ఒక స్మాల్ కిస్!!’’
పున్నాగ చెట్టుచాటున గోపిక కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది.
లిప్‌స్టిక్ వేసిన ఆ అమ్మాయి పెదాలు ఎర్రగా ఊరిస్తున్నాయి.
కార్తీక్ ఒక అడుగు వెనక్కువేసి చెప్పాడు.
‘‘సారీ! నాకు లిప్‌స్టిక్ పడదు. ఎలర్జీ!’’
వెంటనే ఆ అమ్మాయి లిప్‌స్టిక్ తుడుచుకుని-
‘‘మరి... ఇప్పుడు?’’ అన్నది.
‘‘నువ్వు ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లో చాటింగ్‌లు, యూట్యూబ్‌లో యూత్ ఫుల్ షార్ట్ఫిలిమ్స్ చూస్తుంటావు అనుకుంటా?’’
‘‘కరెక్ట్!’’
‘‘ముందు అవి చూడటం మానుకో... బ్రెయిన్‌లోని పిచ్చి పిచ్చి ఆలోచనలు డస్ట్‌బిన్‌లో డంప్ చేసి, డిలీట్ చేసేయ్....’’
‘‘చేస్తా! కానీ నిన్ను మాత్రం వదలను!’’
కార్తీక్‌కి ఏంచెప్పాలో వెంటనే తట్టలేదు. అతడు దూరంగా ఉన్న బస్సు వైపుచూసాడు. డ్రైవర్ బస్సు టైర్ మార్చటం దాదాపు పూర్తిఅయింది. వెంటనే ఆ అమ్మాయితో..
‘‘అదిగో! టైర్ మార్చటం ఐపోయింది!’’అంటూ చెప్పి ముందుకు కదిలాడు.
‘‘ముందు నువ్వు వెళ్ళు!. తర్వాత నేనొస్తా...’’అంటూ అమ్మాయి వెనకనుంచి చెప్పింది.
అదే సమయంలో కార్తీక్‌కి కనపడకుండా పక్కకు జరిగింది గోపిక.
***
బస్సు వైపు నడుస్తున్న కార్తీక్‌ని ఓ వ్యక్తి విష్ చేసాడు. ఆ వ్యక్తికి యాభై సంవత్సరాల వయసు ఉంటుంది. అతడిని ఎక్కడో చూసినట్టు కార్తీక్‌కి అనిపించింది. ఆ వ్యక్తి చెప్పాడు.
‘‘నా పేరు బంగారయ్య. మీరు కొన్నాళ్ళు మా ఇంటి పక్కన అద్దెకు ఉన్నారు.’’
కార్తీక్ బంగారయ్యను గుర్తుపట్టి చిరునవ్వు నవ్వాడు. బంగారయ్య ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ‘‘మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి!’’ అన్నాడు బంగారయ్య.
-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు