డైలీ సీరియల్

పంచతంత్రం -- 5

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పండి అన్నట్లు చూసాడు కార్తీక్.
‘‘ఏం లేదు. మనకున్న పరిచయంతో చెపుతున్నా!..... మీకు లాభం కలిగించే విషయం...’’ అని ఆగాడు బంగారయ్య.
కార్తీక్ చెప్పమన్నట్లు చూసాడు.
‘‘మీకు తెలుసుగా?... పెద్ద నోట్లు రద్దయిపోయాయి... వాటిని మార్చుకోవటం కష్టంగా ఉంటోంది.
లెక్కల్లో చూపించని డబ్బుఐతే మార్చుకోవటం మహాకష్టం. మేము కమిషన్ మీద పాత నోట్లు కొంటాం. లక్ష రూపాయల పాత నోట్లకి డెబ్భైవేలు ఇస్తాం.’’
‘‘కొత్త నోట్లు ఇస్తారా?’’అంటూ అడిగాడు కార్తీక్.
‘‘మేము మీకు ఒక క్రెడిట్ కార్డు ఇస్తాం. ఆ కార్డు మా పేరు మీదే ఉంటుంది. మీకు దాని పిన్ నెంబర్ చెపుతాం. ఆ కార్డుమీద మీరు డెబ్భైవేలు వరకూ వాడుకోవచ్చు. తర్వాత దాన్ని హోల్డ్ చేస్తాం. క్రెడిట్ కార్డు వద్దు అనుకుంటే కొత్త కరెన్సీ ఇస్తాం. కాకపోతే అందుకు మా కమిషన్ ఎక్కువ ఉంటుంది.
‘‘సారీ బంగారయ్యగారూ! నా దగ్గిర అన్ని నోట్లు లేవు.’’ అన్నాడు కార్తీక్.
‘‘సరే! ఎందుకైనా మంచిది. నా విజిటింగ్ కార్డు పెట్టుకోండి... మీ ఫ్రెండ్స్‌కి గాని... బంధువులకు గాని అవసరం ఉంటే చెప్పండి.’’
అంటూ తన విజిటింగ్ కార్డు కార్తీక్‌కి ఇచ్చి- ‘‘అవునూ నీ ఫోన్ నెంబర్ ఎంతా? అంటూ అడిగాడు బంగారయ్య. ఆయనకు కార్తీక్ తన ఫోన్ నెంబర్ చెప్పాడు. ఆ నంబర్‌ను బంగారయ్య తన ఫోన్‌లో ఫీడ్ చేసుకున్నాడు.
తర్వాత బంగారయ్య, కార్తీక్ కూడా బస్సు ఎక్కారు. అప్పటికే గోపిక తన సీట్లో కూర్చుని ఉన్నది. మరో నిమిషం తర్వాత కామేశ్వరి కూడా బస్సు ఎక్కింది. వెంటనే బస్సు కదిలింది.
* * *
కార్తీక్, గోపిక, కామేశ్వరి, బంగారయ్య మొదలైనవాళ్లు ప్రయాణిస్తున్న బస్సు మెత్తగా, వేగంగా దూసుకువెడుతోంది.
కామేశ్వరి ఓర కంటితో కార్తీక్ వంక చూసింది.
గోపిక, కార్తీక్ పక్కపక్కనే కూర్చోవటం ఆమెకు నచ్చలేదు. రెండు క్షణాలు ఏదో ఆలోచించింది. ఠక్కున సెల్‌ఫోన్ తీసింది. ఒక నెంబర్‌కి ఫోన్ చేసింది. కొద్దిక్షణాల తర్వాత కార్తీక్ దగ్గరి సెల్‌ఫోన్ మోగింది.
ఆ శబ్దానికి గోపిక తల తిప్పి కార్తీక్ వంక చూసింది.
కార్తీక్ ఫోన్ తీసి నెంబర్ వంక చూసాడు. ఏదో కొత్త నెంబర్. కార్తీక్ ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. అతడు ‘‘హలో!’’ అనగానే అవతలి వైపు నుంచి ముద్దుపెట్టిన శబ్దం వినపడింది.
ఆ శబ్దం పక్కనే కూర్చుని వున్న గోపికకి కూడా వినపడింది. దాంతో కార్తీక్‌తోపాటు గోపిక కూడా ఉలిక్కిపడింది..
కంగారు పడుతూ అన్నాడు కార్తీక్.
‘‘ఏయ్! ఎ... ఎ... ఎ.... ఎవరు నువ్వు..?’’
‘‘హి... హి... హి...గుర్తుపట్టలేదా?... నేను కామేశ్వరిని...!’’అంటూ వినపడింది.
కార్తీక్ ఫోన్‌లోనుంచి మాటలు పెద్దగా వినపడుతున్నాయి.
చెవులు రిక్కించి వింటున్న గోపికకు ఆ మాటలు స్పష్టంగా అర్ధం అవుతున్నాయి.
వెంటనే కార్తీక్ ఆశ్చర్యంగా పక్కకు చూసాడు. అతడు అలా పక్కకు చూసిన వెంటనే మూతి సున్నాలా చుట్టి ఓ ‘నిశ్శబ్ద ముద్దు’ అభినయించింది కామేశ్వరి.
మరోవైపు చెవులు రిక్కించి వీళ్ళ సంభాషణ వింటూ-
‘‘అమ్మ! ఎంత డేర్ చేస్తోంది?’’ అనుకున్నది గోపిక.
షాక్ అవుతూ ఫోన్లో అడిగాడు కార్తీక్.
‘‘నా ఫోన్ నెంబర్ నీకు ఎలా తెలుసు?’’
‘ఇందాక వాడు ఎవడో బంగారయ్య అనే వాడికి నీ ఫోన్ నెంబర్ చెప్పావ్‌గా. అప్పుడు ఆ పక్కనే నిలబడి వినేశా!’’అని చెప్పి- ‘‘హి... హి... హి...’’అంటూ నవ్వింది కామేశ్వరి.
బంగారయ్యతో తన ఫోన్ నంబర్ చెపుతుండగా విన్నదన్నమాట అని మనసులో అనుకుంటూ ‘‘్ఫన్ పెట్టై!’’అన్నాడు కార్తీక్.
అతని మాటలు లెక్కచేయకుండా అన్నది కామేశ్వరి.
‘‘నీ పక్కన కూర్చుందే..దెయ్యం... అది ఎవరు? నీ గర్ల్‌ఫ్రెండా?’’
తమ సంభాషణ గోపిక వింటోంది అని కార్తీక్‌కి అర్ధం అయింది.
‘‘లేదు...! తోటి పాసింజర్. ఇప్పుడే పరిచయం.’’
‘‘అది నీకు లైన్ వేస్తోంది అని నాకు డౌట్ ఉంది... అసలే నువ్వు హ్యాండ్ సమ్‌గా, ఉంటావ్‌గా?’’
‘‘నో... నో...! తాను వేసినా నేను పడను...!’’
ఈ మాట వినగానే గోపికకు కోపం ముంచుకు వచ్చింది. కానీ జరుగుతున్న సంభాషణ వినాలనే తాపత్రయంతో కోపాన్ని అణచుకుంది.
‘‘అది ఇందాక మనల్ని ఫాలోఅయి, ఆ చెట్టుచాటున దాక్కుని మనల్ని అబ్జర్వ్ చేసింది అని డౌట్‌గా ఉంది...’’ ఈ మాట వినగానే గోపిక షాక్ అయింది.
‘‘తను అలాంటిది కాదు... అనుకుంటున్నా...!’’
‘‘ఓకే! దాని సంగతి తర్వాత... నిన్ను వాటేసుకోవాలి... ఫ్రెంచ్ కిస్సులు పెట్టాలి అని మహా ఇదిగా ఉంది.’’ అకస్మాత్తుగా ఏదో ఐడియా రావటంతో కార్తీక్ అన్నాడు.
‘‘అమ్మో! ఫ్రెంచ్ కిస్సులా మా ఆవిడ ఊరుకోదు.’’
రెండు క్షణాల తర్వాత ఫోన్‌లో వినపడింది.
‘‘నీకు పెళ్లి అయ్యిందా? మీ ఆవిడ పేరు ఏంటి?’’
‘‘సత్యభామ!’’
‘‘ఓకే! నీకు పెళ్ళైనా ఫర్వాలేదు... మనం... సహజీవనం చేద్దాం...!’’
రెండు క్షణాలు ఆలోచించి చెప్పాడు కార్తీక్.
‘‘నేను. రెడీ...! ఐతే వన్ కండిషన్!’’
‘‘ఏంటది?’’
‘‘మనం... సహజీవనం ఇప్పుడే మొదలుపెడదాం.’’
ఈ డైలాగ్ వినగానే ఉలిక్కిపడింది గోపిక.
‘‘నేనుకూడా రెడీ.;... నీ పక్కన కూర్చున్న దయ్యాన్ని... అక్కడనుంచి లేపేయ్...! అక్కడ నేను కూర్చుంటా.!’’ అన్నది కామేశ్వరి.
కార్తీక్ తల పక్కకు తిప్పి గోపిక వైపు చూసాడు.
అప్పటివరకూ అతడినే చూస్తున్న గోపిక ఠక్కున తల పక్కకు తిప్పుకుంది.
సరిగ్గా ఆ సమయంలో రోడ్ పక్కనే ఉన్న ఓక దాబాముందు బస్సు ఆగింది. జనం కిందికి దిగుతున్నారు.
‘‘కాస్త ఏదన్నా తిందా...!’’అంటూ కామేశ్వరితో చెప్పి..., గోపిక వైపుచూసి ‘‘మీరుకూడా రండి!’’అని మళ్ళీ కామేశ్వరి వైపు తిరిగి- ‘‘సహజీవనంలో ఒకరి భావాలు మరొకరు గౌరవించాలి’’అన్నాడు కార్తీక్.
దాంతో తమతో గోపిక రావటానికి కామేశ్వరి అభ్యంతరం చెప్పలేదు. వాళ్ళు ఇద్దరినీ అబ్సర్వ్‌చేసే ప్రయత్నంలో గోపిక వాళ్లతో బయలుదేరింది.
ధాబాలో ఓ కార్నర్ టేబుల్ దగ్గర ముగ్గురూ కూర్చున్నారు.
‘‘ముందు ఇడ్లీ తిందాం!’’ అన్నాడు కార్తీక్.
‘‘్ధబాలో ఇడ్లీ దొరకదు.? పరోటా నాకు చాలా ఇష్టం...! పరోటా తిందాం.!’’ అన్నది కామేశ్వరి.
‘‘లేదు...! సహజీవనంలో ఒకరి భావాలు మరొకరు గౌరవించాలి... మనం ఇడ్లీయే తినాలి.’’
‘‘నేనూ అదే అంటున్నా! సహజీవనంలో ఒకరి భావాలు మరొకరు గౌరవించాలి’’అన్నది కామేశ్వరి.
‘‘కానీ సహజీవనంలో ఎవరు సీనియర్ ఐతే వాళ్ళ భావాలను ఇరువురూ గౌరవించాలి అని చెప్పాడు జపాన్‌కు చెందిన ‘అకిటోహికిటో’ అన్నాడు కార్తీక్.

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు